Hyper Aadi Introduced His Girlfriend In a TV Show - Sakshi
Sakshi News home page

Hyper Aadi : విహారికతో హైపర్‌ ఆది ప్రేమాయణం.. స్టేజ్‌పై ప్రపోజ్‌ చేసిన కమెడియన్‌!

Published Tue, Aug 15 2023 11:44 AM | Last Updated on Tue, Aug 15 2023 1:08 PM

Hyper Aadi Introduced His Girlfriend In A TV Show - Sakshi

తనదైన పంచ్‌ డైలాగులతో ట్రెండింగ్‌ కమెడియన్‌గా మారాడు హైపర్‌ ఆది. జబర్ధస్త్‌ కామెడీతో షో అతని జీవితాన్ని మార్చేసింది. ఆ షోలో మొదటగా కంటెస్టెంట్‌గా వచ్చి, తర్వాత టీమ్‌ లీడర్‌ అయ్యాడు. ప్రస్తుతం మల్లెమాల ఎంటర్‌టైన్మెంట్ నిర్మిస్తున్న పలు టీవీ షోలలో ఆది పాల్గొంటూ తనదైన కామెడీతో నవ్వులు పూయిస్తున్నాడు. పలు షోలలో తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు.

(చదవండి: హైపర్ ఆదితో పెళ్లి? క్లారిటీ ఇచ్చేసిన వర్షిణి!)

తాజాగా ఓ టీవీ షోలో తన ప్రియురాలిని పరిచయం చేశాడు. తాను గత కొంత కాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, ఆమెను పరిచయం చేస్తానంటూ స్టేజ్‌పైకి పిలిచాడు. ‘ఇప్పటివరకు కంటెంట్‌ కోసం చాలా మందికి లైన్‌ వేసినట్లు చెప్పాను. కానీ నేను నిజంగా ప్రేమించింది ఒక అమ్మాయిని మాత్రమే. ఆమె ఇక్కడే ఉందంటూ ‘బేబీ ఒక్కసారి స్టేజ్‌పైకి రా’అని ఆది పిలవగా.. ఒక అమ్మాయితో నవ్వులు చిందిస్తూ స్టేజ్‌ మీదకు వచ్చింది. ఆ తర్వాత ఆది తనకు ‘ఐ లవ్‌ యూ విహారిక’ అంటూ ప్రపోజ్‌ చేశాడు. విహారిక కూడా ‘లవ్‌ యూ టూ ఆది’ అని చెప్పింది. అంతేకాదు ఇద్దరూ ఒకరి బుగ్గలను ఒకరు ముద్దాడారు. దీంతో షోలో ఉన్నవారంతా చప్పట్లు కొడుతూ ఆ జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.

విహారికతో ప్రేమాయణం నిజమేనా?
హైపర్‌ ఆది పెళ్లిపై గతంలో చాలా సార్లు పలు రూమర్స్‌ వినిపించాయి. ఓ యాంకర్‌తో ఆది లవ్‌లో ఉన్నాడని త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే వార్త ఆ మధ్య నెట్టింట చక్కర్లు కొట్టింది. తాజాగా ఆ యాంకర్‌ వర్షిణితో పెళ్లి అనే పుకార్లు వినిపించగా.. ఆమె కొట్టిపారేసింది. అయితే ఆది మాత్రం ఈ రూమర్స్‌పై ఎప్పుడూ స్పందించలేదు. పైగా తన పెళ్లిపై తానే పంచ్‌లు వేసుకుంటాడు.

గతంలో కూడా తాను పెళ్లి చేసుకునేది ఈ అమ్మాయినే అంటూ పలు షోలలో కొంతమందిని పరిచయం చేశాడు. కాకపోతే అది స్కిట్‌లో భాగమే. కేవలం హైప్‌ కోసం ఆది అలా చెప్పేవాడు. ఇక తాజాగా ఆది పరిచయం చేసిన అమ్మాయి కూడా షోలో భాగమే అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.  మరికొంతమంది అయితే ఆ అమ్మాయిని ఏ టీవీ షోలోనూ చూడలేదు. నిజంగానే ఆమె ఆది ప్రియురాలే కావొచ్చునని అంటున్నారు.  మరి ఇందులో ఏది నిజమేది అనేది ఆ షో ఫుల్‌ ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ అయ్యాక తెలుస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement