
టీవీ చర్చలో మంత్రిపై దాడి
కొల్లాం: ఓ టీవీ చానెల్ చర్చ కార్యక్రమం రభసగా మారింది. ప్రేక్షకులు దాడి చేయడంతో కేరళ కార్మిక మంత్రి బేబీ జాన్, లెఫ్ట్ కూటమికి చెందిన ఎన్.విజయ్ పిళ్లై గాయపడ్డారు.
గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు జాన్ బదులిస్తుండగా కొందరు వారిపై రాళ్లు రు వ్వి, కుర్చీలు విసిరారు. గాయపడిన ఇద్దరు నేతల్ని ఆసుపత్రికి తరలించారు. జాన్ తాను రెండు సార్లు నెగ్గిన చావరా నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు.