మళ్లీ బిగ్‌బీ కేబీసీ షో | koun banega crorepati to start again | Sakshi
Sakshi News home page

మళ్లీ బిగ్‌బీ కేబీసీ షో

Published Sun, Aug 3 2014 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 11:17 AM

మళ్లీ  బిగ్‌బీ కేబీసీ షో

మళ్లీ బిగ్‌బీ కేబీసీ షో

17న సోనీలో ప్రసారం 

సూరత్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతీ(కేబీసీ)-8’ టీవీ షో శనివారం సూరత్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. కేబీసీ షో ముంబై వెలుపల జరగడం ఇదే తొలిసారి. అమితాబ్ గుజరాత్ పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ షో అక్కడ నిర్వహించడం గమనార్హం. ఈ ప్రీమియర్ షోలో సూరత్ వ్యాపారవేత్త దీపా జగ్తియానీ రూ.6.40 లక్షల నగదు గెలుచుకున్నారు. 

ఈ సారి పోటీలో తుది విజేతకు అందించే బహుమతిని రూ. 7కోట్లకు పెంచారు. కేబీసీ-4లో పోటీచేసిన మనోజ్ శర్మ, కేబీసీలో రూ.ఐదు కోట్లు గెలిచిన తొలి మహిళ సున్మీత్ కౌర్ సాహ్నీ, ప్రపంచ క్విజ్ చాంపియన్ విక్రమ్ జోషీలను సలహా కోరే ందుకు కొత్తగా లైఫ్‌లైన్  అవకాశాన్ని ప్రవేశపెట్టారు. కేబీసీ 8వ సీజన్  షో ఈనెల 17వ తేదీన సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ చానల్‌లో ప్రసార ం కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement