ఆత్మీయులు అకాలంగా మరణిస్తే ఎవరికైనా అంతులేని దు:ఖం కలుగుతుంది. అలా కన్న పేగు దూరమైతే వారి దు:ఖం ఇంకా అంతులోనిది. పొగిలి పొగిలి ఏడ్చినా తీరనిది ఆ బాధ. కలలో తప్పించి వారు వారికి కనిపించరు. అలా దూరమైన వారిని, పేగు బంధాన్ని నిజంగా కలుసుకుంటే....కళ్లతో చూస్తూ పెదవులతో మాట్లాడుతూ, చేయి చేయి పట్టుకొని స్పర్శిస్తే..... నిజంగా అది సాధ్యమైతే ఆ అనుభూతి అపారమైనతి. ఎన్నటికీ మరవలేనిది. మరపురానిది.