టీవీలో సంచలనం: అమ్మాయితో గొరిల్లా రొమాన్స్ | Gorilla to romance leading lady of TV show 'Thapki Pyar Ki' | Sakshi
Sakshi News home page

టీవీలో సంచలనం: అమ్మాయితో గొరిల్లా రొమాన్స్

Published Fri, Jun 17 2016 10:46 AM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM

టీవీలో సంచలనం: అమ్మాయితో గొరిల్లా రొమాన్స్

టీవీలో సంచలనం: అమ్మాయితో గొరిల్లా రొమాన్స్

ఇప్పటికే ఆమె జీవితంలో ఇద్దరు మగాళ్లున్నారు. ఒకడు నిశ్చితార్థం ముందు ఆమెను కాదని, మళ్లీ వెంటపడేవాడు. మరొకడు.. ఆమె పనిచేస్తోన్న టీవీ చానెల్  ఓనర్. రెండో వాడంటే ఆమెకూ ఇష్టమే. కానీ ఆ డబ్బున్న మారాజు తల్లిదండ్రులకు మాత్రం అతడు ఈమెను పెళ్లిచేసుకోవడం ఇష్టంఉండదు. స్వతంత్ర భావాలున్న ఆమె.. ప్రేమలో వరుస వైఫల్యాల కారణంగా కుంగిపోతుంది. దీంతో జీవితం కాస్త భారంగా మారిపోతుంది.. అదే సమయంలో ప్రేమైక జీవనం కోసం తపన పెరుగుతుంది. తనవాడి కోసం ఎదురుచూస్తోన్న ఆమె దగ్గరకు అనుకోని పరిస్థితుల్లో ఓ మనసున్న(!) గొరిల్లా వస్తుంది. కాలక్రమంలో ఇద్దరూ దగ్గరవుతారు(!). గొరిల్లాకు ఆ అమ్మాయిపట్ల ప్రేమ పుడుతుంది. పిచ్చిచేష్టలతో గుండెల్లో నిండుగా ఉన్న ప్రేమను ప్రదర్శిస్తుందా గొరిల్లా.

భారతీయ బుల్లితెర చరిత్రలో ఇదొక సంచలనం. మొట్టమొదటిసారి ఓ టీవీ సీరియల్ లో భారీ జంతువు.. అది కూడా ఫుల్ లెంత్ పాత్రలో కనిపించనుంది. ఏడాది కాలంగా కలర్స్ చానెల్ లో ప్రసారం అవుతూ, మంచి టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోతోన్న 'థప్ కీ ప్యార్ కి' సీరియల్ లో ఈ అరుదైన దృశ్యాలు చోటుచేసుకోనున్నాయి. బిగ్ బ్రదర్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న జిగ్యాస్ సింగ్ 'థప్ కీ' షోలో లీడ్ రోల్ ప్లే చేస్తోంది. గొరిల్లా ఆమె వద్దకు చేరుకునే, ఇంట్లో నానా యాగీ చేసి, ఆమెను మెప్పించే ఎపిసొడ్లు జూన్ 17 నుంచి ప్రారంభం కానున్నాయి. జిగ్యాస- గరిల్లాల మధ్య సాగే రొమాంటిక్ సీన్లు ప్రేక్షకులను ఏమేరకు రంజింపజేస్తాయో చూడాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement