
కేపీహెచ్‌బీలో కూరగాయలు అమ్మిన రకుల్
ప్రస్తుతం వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ సూపర్ ఫాంలో కనిపిస్తున్న యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఇంట్రస్టింగ్ ట్వీట్తో అభిమానులకు షాకిచ్చింది. ''కేపీహెచ్‌బీలో నేను కూరగాయలు అమ్ముతా, ఉదయం 10 గంటల నుంచి నా దగ్గరకు వచ్చి కూరగాయలు కొనుక్కోండి'' అంటూ రకుల్ చేసిన ట్వీట్కు సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చెప్పినట్టుగా శనివారం ఉదయం కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ లో మంజీరా మాల్ ఎదురుగా ఉన్న మార్కెట్ లో రకుల్ కూరగాయలు అమ్మింది.
అసలు రకుల్కు కూరగాయలు అమ్ముకునేంత అవసరం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా.. సినిమాలతో పాటు టీవీ షోస్తో కూడా సత్తా చాటుతున్న మంచు లక్ష్మి.. 'మేము సైతం' పేరుతో మరో టివి షో ప్రారంభిస్తుంది. సమాజ సేవ నేపథ్యంతో రూపొందించిన ఈ కార్యక్రమం కోసం రకుల్ ప్రీత్సింగ్ ఈ రిస్క్ తీసుకుంటుంది. ఇలా రకుల్ అమ్మిన కూరగాయల ద్వారా వచ్చిన డబ్బును ఏదైనా సామాజిక సేవా కార్యక్రమం కోసం వినియోగించనున్నారు.
I will b at KPHB market opp Manjeera mall sellin vegetables 4 lakshmis show #memusaitham.lts change lives come buy vegetables from me.10am
— Rakul Preet (@Rakulpreet) February 5, 2016