![Rakul Preet Singh and Manchu Lakshmi 30 KMs Cycling - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/19/rakhul.jpg.webp?itok=Nbkga8wU)
సాక్షి, హైదరాబాద్: హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తున్న ఫోటోలను, వీడియోలను ఎప్పుడూ తన సోషల్‌మీడియా అకౌంట్లలలో షేర్ చేస్తూ తన అభిమానుల్లో స్ఫూర్తి నింపుతూ ఉంటుంది. మొన్న జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను షేర్ చేసిన రకుల్ తాజాగా వర్షంలో తన స్నేహితులలో కలిసి సైక్లింగ్ చేసిన వీడియోను షేర్ చేసింది. వీడియోతో పాటు కొన్ని ఫోటోలను కూడా రకుల్ షేర్ చేసింది. దీనిలో మంచు లక్ష్మి కూడా పాల్గొన్నారు.
సైక్లిస్ట్ ఆదిత్యా మెహతా బృందంతో కలిసి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి కలిసి 30 కిలోమీటర్లు సైక్లింగ్ చేసినట్లు రకుల్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. హైదరాబాద్‌లోని సుచిత్ర ఎక్స్ రోడ్ నుంచి తూప్రాన్ రోడ్డు మీదుగా వాళ్లిద్దరూ సైక్లింగ్ చేసినట్లు రకుల్ తెలిపింది. 'థ్యాంక్యు.. చాలా ఇష్టపడి చేశాం. త్వరలో 100 కిలోమీటర్ల సైక్లింగ్ కూడా చేస్తాం' అంటూ రకుల్ ప్రీత్ ట్వీట్ చేస్తూ నవ్వుతూ ఉన్న ఎమోజీని కూడా తన పోస్ట్‌కు జోడించింది.
Thankuuuu we loved it .. here is to doing a 100km soon hopefully 😝 https://t.co/MidRxabAad
— Rakul Singh (@Rakulpreet) August 19, 2020
చదవండి: కరణం మల్లేశ్వరి పాత్రలో రకుల్
Comments
Please login to add a commentAdd a comment