‘గుడ్‌మార్నింగ్ హైదరాబాద్’ అంటూ ‘శంకర్ దాదా జిందాబాద్' సినిమాలో చిరంజీవి పాట పాడితే.. ఇప్పుడు ఆయన తనయుడు, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ‘గుడ్ మార్నింగ్..అమెరికా’అంటున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ ‘గుడ్‌మార్నింగ్ అమెరికా’ అనే పాపులర్ టీవీ షోలో చరణ్ పాల్గొననున్నారు. ఈ షో అమెరికన్ టైమింగ్స్ ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు, ఇండియన్ టైమింగ్స్ ప్రకారం రాత్రి 11.30 గంటలకు ప్రసారం కానుంది. ఈ షో ద్వారా తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులతో పంచుకోనున్నారు. తమ అభిమాన హీరో అమెరికన్ పాపులర్ టాక్ షో పాల్గొనడం పట్ల మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అమెరికాలో అత్యంత ప్రేక్షకుల ఆదరణ పొందిన టీవీ షోలలో ’గుడ్ మార్నింగ్ అమెరికా’ ఒకటి. ఈ పాపులర్ షోలో గతంలో టామ్ క్రూజ్, లియోనార్డో డికాప్రియో, ర్యాన్ రెనాల్డ్స్ వంటి హాలీవుడ్ హీరోలు పాల్గొన్నారు. టాలీవుడ్ నుంచి పాల్గొన్న తొలి హీరోగా రామ్ చరణ్ రికార్డుకెక్కారు. గతంలో ఇడియా నుంచి ప్రియాంక చోప్రా, షారుఖ్ ఖాన్ ఈ పాపులర్ షో పాల్గొన్నారు.
Mega Power Star @alwaysRamCharan is going to be a part of Good Morning America 3, a very popular American talk show. The show will be aired at 1pm PST. Truly a proud moment to see our star on one of the most known shows in the world. #RamCharan pic.twitter.com/xAmf2rir4E
— Ramesh Bala (@rameshlaus) February 22, 2023
Comments
Please login to add a commentAdd a comment