మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్నాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కెటగిరీలో ఆస్కార్‌కు నామినేట్ అయిన నేపథ్యంలో అక్కడ చరణ్ పలు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు. ఈ క్రమంలో అక్కడి ప్రముఖ టెలివిజన్ షో గుడ్‌మార్నింగ్ అమెరికాతో చెర్రి ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా తొలిసారి తండ్రి కాబోతున్నారు కదా, ఆ ఫీలింగ్ ఎలా ఉంది? అని షో హోస్ట్ ప్రశ్నించారు.
చదవండి: గుడ్ మార్నింగ్ అమెరికా షోలో చరణ్, చిరంజీవి ఏమన్నారంటే!
దీనికి చరణ్ స్పందిస్తూ.. ‘ఇది ఒక అందమైన అనుభూతిని కలిగిస్తుంది. కానీ ఇన్నేళ్లు నేను ఉపాసనకు అంతగా దొరికేవాడిని కాదు. కానీ ఇప్పుడు తప్పడం లేదు’ అని సరదాగా సమధానం ఇచ్చాడు. అనంతరం ఈ శుభవార్తను మీ అమ్మనాన్న తర్వాత మొదట ఎవరితో పంచుకున్నారనే ప్రశ్న ఎదురైంది. ‘నేను తండ్రిని అవుతుండటంతో మా అమ్మనాన్న చాలా సంతోషంగా ఉన్నారు. ఈ శుభవార్త కోసం వారు ఎంతోకాలంగా ఎదురు చూశారు. ఇక నేను దీని గురించి ప్రకటన చేయడానికి ముందు నా బెస్ట్ ఫ్రెండ్ తారక్‌కు(జూనియర్ ఎన్టీఆర్) ఫోన్ చేసి నా ఆనందాన్ని పంచుకున్నాను’ అని చెప్పుకొచ్చాడు.
చదవండి: చరణ్ బర్త్‌డే: మెగా ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇవ్వబోతున్న అల్లు అరవింద్
అనంతరం మాట్లాడుతూ.. ‘మా జీవితంలోకి మరో వ్యక్తిని ఆహ్వానిస్తున్నందుకు మేం చాలా సంతోషంగా ఉన్నాం. ముఖ్యంగా మా అమ్మ-నాన్న(చిరంజీవి-సురేఖ) చాలా ఆనందంగా ఉన్నారు. ఇది ఒక అందమైన అనుభూతి. ఇక నేను, నా భార్య ఉపాసన మా జీవితాన్ని కొత్త కోణంలో చూడటం ప్రారంభించాం’ అంటూ అన్నాడు. కాగా ఇండస్ట్రీలో రామ్ చరణ్-జూనియర్ ఎన్టీఆర్‌లు మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ఎలాంటి ఫంక్షన్స్ అయినా ఇరు కటుంబ సభ్యులు ఒక్కచోట చేరుతారు. ఎప్పుడు ఒకరిపై ఒకరు అభిమానాన్ని పంచుకుంటుంటారు. తన పిల్లలు చరణ్‌తో ఆడుకునేందుకు ఎక్కువ ఇష్టపడతారని గతంలో తారక్ పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment