
మెగా హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ మూవీతో అంతర్జాతీయంగా ఫేమ్ సంపాదించాడు. అంతేకాకుండా ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ సైతం ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవలే గుడ్ మార్నింగ్ అమెరికా షోలో చెర్రీ సందడి చేశారు. ఆర్ఆర్ఆర్ హీరో అమెరికన్ పాపులర్ టాక్ షోలో పాల్గొనడం పట్ల మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేశారు. అమెరికాలో అత్యంత ప్రేక్షకుల ఆదరణ పొందిన టీవీ షోలలో ’గుడ్ మార్నింగ్ అమెరికా’ ఒకటి. టాలీవుడ్ నుంచి పాల్గొన్న తొలి హీరోగా రామ్ చరణ్ రికార్డుకెక్కారు
ఇటీవల రామ్ చరణ్ అమెరికాలో ఉంటూ పలు అవార్డుల కార్యక్రమాల్లో బిజీగా పాల్గొన్నారు. దర్శకధీరుడు రాజమౌళితో కలిసి అంతర్జాతీయ వేదికలపై మెరిశారు. అయితే తాజాగా అమెరికా పర్యటనలో చెర్రీ ధరించిన సూట్స్‌పై నెట్టింట చర్చ మొదలైంది. చెర్రీ ధరించిన షూట్స్ ఎక్కడ తయారు చేశారు? వాటి డిజైనర్ ఎవరు? వాటి ధర ఎంత? అన్న విషయాలపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
తాజా అప్ డేట్ ప్రకారం రామ్ చరణ్ వేసుకున్న సూట్స్ చెన్నైకి చెందిన ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ ప్రత్యేకంగా రూపొందించినట్లు సమాచారం. మెగా హీరో ధరించిన ఒక్కో సూట్ కోసం దాదాపు రూ.13 నుంచి రూ.70 లక్షల వరకు వెచ్చించారని తెలుస్తోంది. అంతర్జాతీయ వేదికలపై రామ్ చరణ్ ధరించిన సూట్స్ రాయల్ లుక్‌లో కనిపించాయి. అమెరికాలో చెర్రీ రాయల్‌గా కనిపించడంపై మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
All the latest looks of @AlwaysRamCharan are swoon worthy 😍😍 he is class apart 💕 pic.twitter.com/otEZpLfs0S
— Bhav (@Dr_bhavG) March 1, 2023