Suite
-
ప్రెసిడెన్షియల్ సూట్ వద్దన్నాడు.. విమానాన్ని కాదన్నాడు!
న్యూఢిల్లీ: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌లో జీ20 సదస్సుకి వచ్చినప్పుడు కాస్త విభిన్నంగా వ్యవహరించినట్టుగా ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి. వివిధ దేశాల అధినేతల కోసం కేంద్ర ప్రభుత్వం హోటల్స్‌లో భారీగా భద్రత ఏర్పాట్లు చేసిప్రెసిడెన్షియల్ సూట్లను సిద్ధం చేసింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కోసం హోటల్ లలిత్‌లో ప్రెసిడెన్షియల్ సూట్ ఏర్పాటు చేశారు. ట్రూడో దానిని తిరస్కరించి అదే హోటల్లో సాధారణ గదిలో బస చేశారు. ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని అభాండాలు వేస్తున్న ట్రూడో తన భద్రతాధికారుల సూచన మేరకే ఇలా చేసినట్టుగా తెలుస్తోంది. అదే విధంగా ట్రూడో సొంత విమానానికి సాంకేతిక లోపాలు తలెత్తి ఆయన ప్రయాణం వాయిదా పడింది. అప్పుడు భారత్ ఎయిర్ ఇండియా వన్ విమానాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినా ట్రూడో తిరస్కరించారు. తన విమానం సిద్ధమయ్యాక రెండు రోజుల తర్వాత సెప్టెంబర్ 12న బయల్దేరి వెళ్లారు. -
అమెరికాలో రామ్ చరణ్.. ఒక్కో సూట్ ధర అన్ని లక్షలా?
మెగా హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ మూవీతో అంతర్జాతీయంగా ఫేమ్ సంపాదించాడు. అంతేకాకుండా ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ సైతం ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవలే గుడ్ మార్నింగ్ అమెరికా షోలో చెర్రీ సందడి చేశారు. ఆర్ఆర్ఆర్ హీరో అమెరికన్ పాపులర్ టాక్ షోలో పాల్గొనడం పట్ల మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేశారు. అమెరికాలో అత్యంత ప్రేక్షకుల ఆదరణ పొందిన టీవీ షోలలో ’గుడ్ మార్నింగ్ అమెరికా’ ఒకటి. టాలీవుడ్ నుంచి పాల్గొన్న తొలి హీరోగా రామ్ చరణ్ రికార్డుకెక్కారు ఇటీవల రామ్ చరణ్ అమెరికాలో ఉంటూ పలు అవార్డుల కార్యక్రమాల్లో బిజీగా పాల్గొన్నారు. దర్శకధీరుడు రాజమౌళితో కలిసి అంతర్జాతీయ వేదికలపై మెరిశారు. అయితే తాజాగా అమెరికా పర్యటనలో చెర్రీ ధరించిన సూట్స్‌పై నెట్టింట చర్చ మొదలైంది. చెర్రీ ధరించిన షూట్స్ ఎక్కడ తయారు చేశారు? వాటి డిజైనర్ ఎవరు? వాటి ధర ఎంత? అన్న విషయాలపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. తాజా అప్ డేట్ ప్రకారం రామ్ చరణ్ వేసుకున్న సూట్స్ చెన్నైకి చెందిన ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ ప్రత్యేకంగా రూపొందించినట్లు సమాచారం. మెగా హీరో ధరించిన ఒక్కో సూట్ కోసం దాదాపు రూ.13 నుంచి రూ.70 లక్షల వరకు వెచ్చించారని తెలుస్తోంది. అంతర్జాతీయ వేదికలపై రామ్ చరణ్ ధరించిన సూట్స్ రాయల్ లుక్‌లో కనిపించాయి. అమెరికాలో చెర్రీ రాయల్‌గా కనిపించడంపై మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. All the latest looks of @AlwaysRamCharan are swoon worthy 😍😍 he is class apart 💕 pic.twitter.com/otEZpLfs0S — Bhav (@Dr_bhavG) March 1, 2023 -
ఒకప్పడు ‘అడవి’ మనిషి... ఇప్పడు రియల్ హీరో
జాతి వివక్షత, కుల వివక్ష.. పేద, ధనిక వంటి కారణంగా చాలామంది నిరాదరణకు గురవ్వడం చూసి ఉంటాం. కానీ రూపం కారణంగా నిరాదరణకు గురై దూరంగా అడవిలో జీవించాల్సి రావడం అంటే అది అత్యంత అమానుషమే. రువాండాకు చెందిన ఒక వ్యక్తి అసాధారణ రూపం కారణంగా నిరాదరణకు గురైనప్పటిక ఒక చానల్ సాయంతో మళ్లీ తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు. అతనెవరో ఏంటో చూద్దాం రండి. (చదవండి: లక్కీ హ్యండ్! 20 లాటరీ టికెట్లు.. 20 సార్లూ అదృష్టం!) రువాండాకు చెందిన జాంజిమాన్ ఎల్లీని రియల్ లైఫ్‌లో మోగ్లీగా పిలిచేవారు. కారణం అతని రూపం. అయితే ఈ 22 ఏళ్ల జాంజిమాన్ ఎల్లీ మైక్రోసెఫాలీ అనే రుగ్మతతో బాధపడుతున్నాడు (శిశువు తల ఊహించిన దాని కంటే చాలా చిన్నదిగా ఉంటుంది). ఈ వ్యాధి అతన్ని ప్రజలకు దూరంగా అడవిలో నివశించేలా చేసింది. ఈ రూపం కారణంగా కర్కశత్వానికి, నిరాదరణకు గురయ్యాడు. దీనికి తోడు అతనికి వినికిడి, మాట్లాడలేని సమస్యలు కూడా ఉన్నాయి. పైగా ఎల్లీ తల్లికి అతను పుట్టక ముందే ఐదుగురు పిల్లలను కోల్పయింది. ఆమె దేవుడికి ఎన్నో ప్రార్థనలు చేయగా ఎల్లీ పుట్టాడు. అంతేకాదు ఈ ఒంటరి తల్లి ఎల్లిని పెంచలేక అడవికి వెళ్లి గడ్డి తినమని బలవంతం చేస్తుండేది. అయితే అఫ్రిమాక్స్ అనే ప్రాంతీయ టీవి చానల్ గో ఫండ్ అనే వెబ్సైట్ ద్వారా ప్రజలకు అతనికి మనమందరం సాయం చేద్దాం అంటూ ప్రచారం చేసింది. దీంతో ఇప్పుడూ ఎల్లీ రువాండాలోని గిసేనీలోని ఉబుమ్వే కమ్యూనిటీ సెంటర్లో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలలో చేరాడు. పైగా అతని స్కూల్ యూనిఫాం అయిన కస్టమ్ మేడ్ సూట్ ధరించి కెమెరాకు ఫోజులిస్తున్నాడు. ఈ మేరకు ఎల్లి తల్లి మాట్లాడుతూ..."ఒకప్పుడూ నా కొడుకుని చూసి అందరూ ఎగతాళి చేసేవారు. ఇప్పుడూ మా జీవితాలు మారాయి. నా కొడుకు ఆనందంగా స్కూల్‌కి వెళ్తున్నాడు. మాకు ఉండటానికి ఒక ఇల్లు కూడా కట్టించి ఇచ్చారు. నా బాధలన్నింటిన మీరు ఒక్క నిమిషంలో దూరం చేశారు" అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. అయిలే ఎల్లి సూట్ ధరించి నవ్వుతూ ఫోజులిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు మనం అందరూ కృషి చేస్తే ఇలాంటి వాళ్ల ఎందరికో సాయం చేయగలం అంటూ రకరకలుగా ట్వీట్ చేశారు. (చదవండి: బాప్రే!.. ఆ జంట దొంగలించిన వైన్ బాటిల్స్ ఖరీదు రూ.3 కోట్లా!) The story of Zanziman Ellie Mowgli transformation is inspirational, Everyone this a happy life, We can all work to eliminate stigmatization in our respective societies. pic.twitter.com/bQhwIm02Tf — Sam Wamalwa🇰🇪 (@samsmoothke) October 28, 2021 -
తుపానులో ‘పెళ్లి’ తంటాలు.. ఫోటోలు వైరల్
కల్యాణం వచ్చినా.. కక్కు వచ్చినా ఆగదన్నట్టు.. వానొచ్చినా...వరదొచ్చినా.. తమ పెళ్లి ముచ్చట కాస్తా జరిగి తీరాల్సిందే అని ఒక జంట నిశ్చయించుకుంది. భారీ వరదల మధ్య ప్రమాదకరమైన నదిని దాటి మరీ ఈ జంట వివాహ వేడుకను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పెళ్లి దుస్తుల్లో వధూవరుల ఇబ్బందులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విరివిగా షేర్ అవుతున్నాయి. అడ్డంకులను అధిగమించి ఒక్కటైన జంటను నెటిజన్లు అభినందిస్తున్నారు. స్థానిక వార్తాపత్రిక ఫిలిప్పీన్ స్టార్ ప్రకారం,టైఫూన్ క్వింటా కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు వరదలు ముంచెత్తాయి. అయితే ఇలాంటి ప్రతికూల వాతావరణంలో కూడా వివాహబంధంతో ఒక్కట వ్వాలనుకున్నారు రోనీ గుళీపా, జెజిల్ మసూలా. వరదలతో పోటెత్తిన లుయాంగ్ నదిని దాటుకుని చర్చికి వెళ్లి అక్టోబర్ 23న మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా పెళ్లి గౌనులో వధువు, సూట్ ధరించిన వరుడు ఇద్దరూ పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. ఈ జంటతో పాటు స్నేహితులు, బంధువులు కూడా ఇబ్బందులు పడుతూ పెళ్లికి హాజరు కావడం విశేషం. వేడుక అనంతరం అంతా ఆనందంతో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ పెళ్లి ప్రయాణానికి సంబంధించిన ఫోటోలు ఇపుడు ఆసక్తికరంగా మారాయి. బంధువుల్లో ఒకరైన జోసెఫిన్ బోహోల్ సబనాల్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
నాసా కొత్త స్పేస్ సూట్
చంద్రుడి మీద నడిచేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కొత్త అంతరిక్ష సూటును తయారుచేసింది. ఎక్స్ట్రావెహిక్యులర్ మొబిలిటీ యూనిట్ (ఎక్స్ఈఎమ్యూ)గా పిలిచే దీని ఫొటోను బుధవారం విడుదల చేసింది. ఇది అచ్చం మానవుడి శరీరంలా కనిపించే చిన్న అంతరిక్ష వాహనం. -
అంబానీపై దావా వేస్తా.. చరిత్ర సృష్టిస్తా
సాక్షి, ముంబై: అప్పుల సంక్షోభంలో చిక్కుకున్న అనిల్ అంబానీకి మరో పెద్ద చిక్కొచ్చి పడేటట్టుంది. వార్షిక వాటాదారుల సమావేశం సందర్భంగా కంపెనీ ప్రస్తుత పరిస్థితిపై వాటాదారులు ఆందోళన వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అనిల్ అంబానీ సంస్థల పేలవమైన పనితీరు, రేటింగ్ డౌన్‌గ్రేడ్ కారణంగా ఎంతో నష్టపోయామని గ్రూపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక వాటాదారుడు. పెద్దమొత్తంలో సంపదను కోల్పోయానని చెప్పిన సదరు వాటాదారుడు ఇందుకు అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీల యాజమాన్యంపై క్లాస్ యాక్షన్ దావా వేస్తానని హెచ్చరించారు. సమస్యలను వచ్చే రెండు-మూడు నెలల్లో పరిష్కరించకపోతే, గ్రూప్ కంపెనీలపై ఫస్ట్ క్లాస్ యాక్షన్ దావా వేయడం ద్వారా చరిత్ర సృష్టిస్తానని కార్పొరేట్ న్యాయవాదిగా చెప్పుకున్న వాటాదారుడు పేర్కొన్నారు. 2005 నుంచి మూడు రిలయన్స్ గ్రూప్ కంపెనీలలో మూడింటిలో 3 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టగా, విలువలో 90 శాతానికి పైగా నష్టపోయానని ఆయన చెప్పారు. ప్రధానంగా ఛైర్మన్ అనిల్ అంబానీ తన షేర్లలో 80 శాతానికి పైగా షేర్లను బ్యాంకుల వద్ద తనఖాగా పెట్టి రుణం తీసుకోవడమే సంక్షోభాన్నిమరింత పెంచిందని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం తనను నాశనం చేసిందని వాపోయారు. కష్టపడి సంపాదించిన డబ్బును ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. కేర్ రేటింగ్స్ డౌన్‌గ్రేడ్ రేటింగ్ ఇచ్చిన రోజే 37లక్షల రూపాయలను పోగొట్టుకున్నానన్నారు. ఈ నేపథ్యంలోతన ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు లభించకపోతే, రాబోయే రెండు-మూడు నెలల్లో ఆర్పవర్పై క్లాస్ యాక్షన్ దావా వేస్తానని అని ఆయన హెచ్చరించారు. అంతేకాదు ఇందుకు మిగతా 10 శాతం వాటాదారులను కూడా కూడగడతానని తెలిపారు. మరోవైపు ఏజీఓంలో వాటాదారులకు అనిల్ సమాధానం చెబుతూ సలహాలలన్నింటినీ పరిశీలిస్తామనీ, లేవనెత్తిన సమస్యలనులోతుగా ఆలోచించి, వాటిని పరిష్కరించడానికి తమవంతు కృషి చేస్తామని హామీ వచ్చారు. అనిల్ సారధ్యంలోని రిలయన్స్ అడాగ్ గ్రూప్ కంపెనీల సంయుక్త విలువ ఆరంభంలో రూ లక్ష కోట్లు దాటింది. కానీ ప్రస్తుతం ఈ గ్రూప్ అన్ని కంపెనీల మార్కెట్ విలువ కేవలం రూ 18,525 కోట్లకు పడిపోయింది. ఇందులో రిలయన్స్ నిప్పాన్ ఏఎంసీ ఒక్క కంపెనీ విలువే రూ 16,000 కోట్లుగా ఉంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ విలువు రూ 212 కోట్లుగా ఉంది. 2008 లో 72 రేట్లు అధిక బిడ్లు లభించి మార్కెట్ నుంచి రూ 11,563 కోట్లు సమీకరించిన రిలయన్స్ పవర్ ప్రస్తుత విలువ రూ 617 కోట్లకు పడిపోయింది. కాగా కంపెనీ యాక్ట్ 2013లోని ఒక సెక్షన్ ప్రకారం వాటాదారులు సంబంధిత కంపెనీలు క్లాస్ యాక్షన్ సూట్‌ను దాఖలు అవకాశం కల్పిస్తుంది. కానీ ఇప్పటివరకు ఈ నిబంధన ప్రకారం ఎటువంటి కేసు నమోదు కాలేదు. చదవండి : అనిల్ అంబానీ కీలక నిర్ణయం : రుణ వ్యాపారానికి గుడ్‌బై -
ఐరన్ మ్యాన్ కవచాన్ని దొంగలెత్తుకెళ్లారు..
లాస్ ఏంజిల్స్ : సూపర్ హీరో ఐరన్ మ్యాన్ సూట్(ఉక్కు కవచం)ను దొంగలెత్తుకెళ్లారు. బుధవారం లాస్ ఏంజిల్స్‌లోని ఓ ఆధునాతన గదిలో భద్రంగా దాచిన సూట్‌ను దొంగలెత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగతనం ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఎరుపు, బంగారు రంగులో ఉన్న ఈ సూట్ విలువ దాదాపు రెండు కోట్ల రూపాయల పైమాటేనని పోలీసులు తెలిపారు. 2008లో వచ్చిన ఐరన్‌మ్యాన్ సినిమాలో హీరో రాబర్ట్ డౌనీ జూనియర్ దీనిని ధరించాడు. ఆ సినిమా అప్పట్లో ఓ చరిత్ర సృష్టించింది. రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టడమే కాకుండా రాబర్ట్ డౌనీని అభిమానులకు మరింత చేరువ చేసింది. రాబర్ట్ డౌనీ జూనియర్ వచ్చే ఏడాదిలో అవెంజర్స్ సిరీస్‌లోని నాలుగో భాగంలో నటించనున్నారు. -
సూట్ అడిగితే జైల్లో పెట్టండి
కలెక్టర్ వీరపాండ్యన్ పెద్దపప్పూరు : పంట దిగుబడులు అమ్మే సమయంలో రైతులను సూట్ అడిగే వ్యాపారులపై కేసులు నమోదు చేసి జైల్లో పెట్టాలని కలెక్టర్ వీరపాండియన్ అధికారులకు సూచించారు. కరివేపాకు వ్యాపారులు తమను నిలువునా ముంచుతున్నారని, ఓ వ్యాపారి దాదాపు కోటి రూపాయలు చెల్లించకుండా ఎగ్గొట్టాడని ముచ్చుకోట రైతులు ఆయన వద్ద ఆవేదన వ్యక్తం చేయడంతో పై విధంగా స్పందించారు. మండలంలో బుధవారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా మండలంలోని ముచ్చుకోటలో డ్రిప్ పద్ధతిలో సాగు చేస్తున్న అరటి, కరివేపాకు పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఆదాయ వ్యయాలను తెలుసుకున్నారు. నీటి లభ్యతపై ఆరా తీయగా.. రైతులు మాట్లాడుతూ గ్రామంలో భూగర్భజలాలు అడుగంటి పోవడంతో అందరం నీరు లభించే ఒకే ప్రాంతంలో బోరుబావులు తవ్వుకుని పైప్‌లైన్ ద్వారా పొలాలకు నీటిని మల్లించుకుంటున్నామని, దీంతో లక్షలాది రూపాయలు పెట్టుబడులు అవుతున్నాయని వాపోయారు. గ్రామ సమీపంలోని ముచ్చుకోట రిజర్వాయర్‌కు నీరిస్తే తమ పొలాల్లో ఉన్న బోర్లకు నీళ్లు ఎక్కుతాయని, రిజర్వాయర్‌కు నీళ్లిచ్చి ఆదుకోవాలని వేడుకున్నారు. ఉపాధి పనులను వ్యవసాయానికి అనుసంధానం చేసి కూలీల ఖర్చయినా తగ్గించాలని కొందరు రైతులు కోరారు. అనంతరం కలెక్టర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. నిర్మాణం పూర్తయిన ఇంటిని ప్రారంభించారు. నిర్మాణ వ్యయంతోపాటు ప్రభుత్వం అందించిన సిమెంట్, నగదు వివరాలను లబ్ధిదారులనడిగి తెలుసుకున్నారు. అనంతరం జె.కొత్తపల్లి గ్రామంలోని జాజికొండవాగు వంకలో చేస్తున్న నీరు - చెట్టు పనులను, సోమనపల్లి సమీపంలో కొండపై ఉపాధి పనులను పరిశీలించారు. కూలి డబ్బులు వస్తున్నాయా, గిట్టుబాటు అవుతోందా అంటూ కూలీలతో మాట్లాడారు. అలాగే తిమ్మనచెరువు గ్రామ సమీపంలోని చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. చెరువు అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అనంతరం చాగల్లు, పెండేకల్లు ప్రాజెక్టులను పరిశీలించారు. ప్రాజెక్టులకు నీటి లభ్యతపై ఇరిగేషన్ అధికారులతో ఆరా తీశారు. ఈ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వాలని ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు ఆయనను కోరారు. పెండేకల్లు ప్రాజెక్ట్‌లో ముళ్లపొదలను తొలగించాలని గ్రామస్తులు కలెక్టర్‌ను కోరగా ఆ పనులు ప్రాజెక్ట్ కాంట్రాక్టర్‌తోనే చేయించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మలోల, డ్వామా ఏపీడీ విజయశంకర్‌రెడ్డి, హౌసింగ్ పీడీ రాజశేఖర్, డీఈ శైలజ, ఏడీఏ వెంకట్‌కుమార్, తహసీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీడీఓ పరమేశ్వర్, ఏఓ దేవిపద్మలత, ఉద్యానవన అధికారి ఫజులునిస్సాబేగం, హౌసింగ్ ఏఈ సంధ్య, ఏపీఓ పుల్లారెడ్డి, ఇరిగేషన్ ఏఈ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మోదీ సూట్ వేలంపై సిబాల్ చురకలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ సూట్ వేలంపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ సోమవారం బీజేపీకి చురకలు అంటించారు. వచ్చే బడ్జెట్లో పలు ప్రాజెక్టులకు నిధుల కోసం కేంద్ర ఆర్థిక మంత్రి ఇలాంటి వినూత్న పద్ధతులను మరిన్నింటిని చేపడతారేమో అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇలాంటి వేలం కార్యక్రమాలను నిర్వహించడానికి ఓ సబ్ కమిటీని కూడా వేస్తారేమో అన్న ఆశ్చర్యాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఒబామా పర్యటన సమయంలో మోదీ ధరించిన సూట్‌ను గత నెల గుజరాత్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త రూ.4.31 కోట్లకు వేలంలో దక్కించుకున్న విషయం విదితమే. మహాత్మాగాంధీ, అబ్రహం లింకన్ వస్తువుల కంటే మోదీ సూటే వేలంలో ఎక్కువ ధర పలకడం ఎంతో విస్మయానికి గురిచేసిందని సిబాల్ వివరించారు.