న్యూఢిల్లీ: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌లో జీ20 సదస్సుకి వచ్చినప్పుడు కాస్త విభిన్నంగా వ్యవహరించినట్టుగా ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి. వివిధ దేశాల అధినేతల కోసం కేంద్ర ప్రభుత్వం హోటల్స్‌లో భారీగా భద్రత ఏర్పాట్లు చేసిప్రెసిడెన్షియల్ సూట్‌లను సిద్ధం చేసింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కోసం హోటల్ లలిత్‌లో ప్రెసిడెన్షియల్ సూట్ ఏర్పాటు చేశారు. ట్రూడో దానిని తిరస్కరించి అదే హోటల్‌లో సాధారణ గదిలో బస చేశారు.
ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని అభాండాలు వేస్తున్న ట్రూడో తన భద్రతాధికారుల సూచన మేరకే ఇలా చేసినట్టుగా తెలుస్తోంది. అదే విధంగా ట్రూడో సొంత విమానానికి సాంకేతిక లోపాలు తలెత్తి ఆయన ప్రయాణం వాయిదా పడింది. అప్పుడు భారత్ ఎయిర్ ఇండియా వన్ విమానాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినా ట్రూడో తిరస్కరించారు. తన విమానం సిద్ధమయ్యాక రెండు రోజుల తర్వాత సెప్టెంబర్ 12న బయల్దేరి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment