presidential
-
ప్రెసిడెన్షియల్ సూట్ వద్దన్నాడు.. విమానాన్ని కాదన్నాడు!
న్యూఢిల్లీ: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌లో జీ20 సదస్సుకి వచ్చినప్పుడు కాస్త విభిన్నంగా వ్యవహరించినట్టుగా ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి. వివిధ దేశాల అధినేతల కోసం కేంద్ర ప్రభుత్వం హోటల్స్‌లో భారీగా భద్రత ఏర్పాట్లు చేసిప్రెసిడెన్షియల్ సూట్లను సిద్ధం చేసింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కోసం హోటల్ లలిత్‌లో ప్రెసిడెన్షియల్ సూట్ ఏర్పాటు చేశారు. ట్రూడో దానిని తిరస్కరించి అదే హోటల్లో సాధారణ గదిలో బస చేశారు. ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని అభాండాలు వేస్తున్న ట్రూడో తన భద్రతాధికారుల సూచన మేరకే ఇలా చేసినట్టుగా తెలుస్తోంది. అదే విధంగా ట్రూడో సొంత విమానానికి సాంకేతిక లోపాలు తలెత్తి ఆయన ప్రయాణం వాయిదా పడింది. అప్పుడు భారత్ ఎయిర్ ఇండియా వన్ విమానాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినా ట్రూడో తిరస్కరించారు. తన విమానం సిద్ధమయ్యాక రెండు రోజుల తర్వాత సెప్టెంబర్ 12న బయల్దేరి వెళ్లారు. -
రాజపక్స ఉపయోగించిన రహస్య బంకర్ ఇదే కావొచ్చు!
శ్రీలంక రాజధాని కొలంబోలో నిరసనకారులు అధ్యక్షుడు గోటబయ రాజపక్స అధికార నివాసాన్ని చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. పైగా రాజపక్స రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు ఆయన నివాసంలోకి చొరబడి ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన నివాసంలో ఒక రహస్య బంకర్ బయటపడింది. ఈ రహస్య బంకర్‌ని ఉపయోగించే రాజపక్స పరారైనట్లు తెలుస్తోంది. ఇది భూగర్భ సోరంగంలా ఉంటుంది. లిఫ్ట్ ద్వారా మాత్రమే ఈ రహస్య బంకర్లోకి ప్రవేశించి తప్పించుకోగలరు. ఐతే శనివారం వేలాదిమంది నిరసనకారులు రాజపక్స నివాసంలోకి చొరబడి విలాసాలను ఆస్వాదిస్తూ...ఆయన వంటగదిలోకి ప్రవేశించి.. ఆహారాన్ని తింటూ కొందరూ, మరికొందరూ స్విమ్మింగ్ పూల్,జిమ్‌లలోకి ప్రవేశించి ఎంజాయ్ చేయడం వంటి పనులు చేశారు. ఈ మేరకు నిరసనకారులు ముట్టడించి హింసాత్మక నిరసనలు తెగబడటం, రాజీనామా చేయాలంటూ పెరిగిన డిమాండ్ల నడుమ రాజపక్స పారిపోవాల్సి వచ్చింది. ఐతే ఇంతవరకు గోటబయ రాజపక్స ఆచూకి తెలియరాలేదు. కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను పునర్జీవింప చేయడానికి... తన దౌత్యం, రాజీకీయ చతురత, అనుభవంతో ఈ దుస్థితి నుంచి బయటపడేయగలడన్న ఆశతో గత నెలలో రణిల్ విక్రమ సింఘేను ప్రధానిగా నియమించాడు రాజపక్స. అయినప్పటికీ శ్రీలంకలో కనీస నిత్వావసర వస్తువుల ధరలు ఆకాశాన్నట్టడంతో.. ప్రజలు కొనుగోలు చేయలని దారుణ స్థితిలో ఉన్నారు. ఇంకోవైపు ఇంధన కొరతతోపాటు, విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం తదితర కారణాలతో కనీస ఆహారోత్పత్తులను సైతం దిగుమతి చేసుకోలేని దుస్థితిలో ఉంది శ్రీలంక. దీంతో ప్రజల్లో సహనం సన్నగిల్లిపోయి నిరసన జ్వాల కట్టలు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే ఆందోళనకారులు "గోట గో హోం" అంటూ నినాదాలతో రాజపక్స కార్యాలయాన్ని, అధికార నివాసాన్ని ముట్టడించారు. దీంతో లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స రహస్య బంకర్‌ను ఉపయోగించి పరారైనట్లు సమాచారం. (చదవండి: శ్రీలంక సంక్షోభం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన అమెరికా!) అధ్యక్షుడి భవనంలో కరెన్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు -
ట్రంప్‌కి ఆఫీస్ పేపర్లను చింపి వైట్‌హౌస్ టాయిలెట్లో వేయడం హాబీ!
Documents ripped up, stuffed down the toilet: అమెరికా అధ్యక్షుల రికార్డులను భద్రపరిచే నేషనల్ ఆర్కైవ్స్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యహహార శైలిపై విచారణ చేయాలని న్యాయశాఖను అభ్యర్థించింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష్య డాక్యుమెంట్లను చింపేసి టాయిలెట్లో పడేయడం లేదా ఫ్లోరిడాకు తరలించడం వంటివి చేశారని ఆరోపించింది. అంతేకాదు ట్రంప్ అధ్యక్ష పత్రాలను భద్రపరచడంలో చట్టాలను ఉల్లంఘించారని ఆర్కైవ్స్ పేర్కొంది. రిపబ్లికన్ మద్దతుదారులను ఆకర్షించే నిమిత్తం ట్రంప్ గతంలో ప్రెసిడెన్షియల్ డెకోరమ్ ఆమోదించిన అనేక నిబంధనన పత్రాలను పాడు చేసినట్లు వెల్లడించింది. అంతేకాదు అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడూ వైట్‌హౌస్ పేపర్లను చించిపడేసే ట్రంప్ అలవాటు పై దర్యాప్తు చేయాలని ఆర్కైవ్స్ కోరింది. ఈ ఆరోపణల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వ రికార్డుల కార్యాలయం ట్రంప్ ఫ్టోరిడా ఎస్టేట్ నుండి 15 బాక్సుల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు ధృవీకరించింది. పైగా వాటిని ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన సమయంలో తనతోపాటు తీసువెళ్లారని పేర్కొంది. అంతేకాదు ఆ పత్రాలలో చాలామటుకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్కి సంబంధించిన అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల తోపాటు అప్పటి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్రంప్ కోసం ఓవల్ ఆపీస్ని విడిచి వెళ్తున్నప్పుడు రాసిన లేఖ కూడా ఉందని వెల్లడించింది . అయితే ట్రంప్ మాత్రం అవన్ని ప్రేమ లేఖలని చెప్పడం గమనార్హం. ఈ మేరకు వాటర్‌గేట్ కుంభకోణం నేపథ్యంలో ఆమోదించిన 1978 ప్రెసిడెన్షియల్ రికార్డ్స్ యాక్ట్ (పీఆర్ఏ) ప్రకారం యూఎస్ అధ్యక్షులు అన్ని ఈమెయిల్‌లు, ఉత్తరాలు, ఇతర పని పత్రాలను నేషనల్ ఆర్కైవ్స్‌కు బదిలీ చేయాలి. అయితే ట్రంప్ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదంటూ ఈ ఆరోపణలన్నింటిని ఖండించారు. అంతేగాదు ఆర్కైవ్స్‌తో తన వ్యవహారాలను ఎలాంటి వివాదం లేకుండా స్నేహపూరిత వాతావరణంలోనే కొనసాగించినట్లు పేర్కొన్నాడు. న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్ట్ మ్యాగీ హేబెర్మాన్ రాసిన "కాన్ఫిడెన్స్ మ్యాన్" పుస్తకం ప్రకారం వైట్ హౌస్ నివాసంలోని సిబ్బంది క్రమానుగతంగా మూసుకుపోతున్న టాయిలెట్లో ప్రింటెడ్ పేపర్‌ను కనుగొన్నారు అని రాయడం కొసమెరుపు. హేబెర్మాన్ ట్రంప్‌తో తీసుకున్న ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పుస్తకాన్ని రాశాడు. జనవరి 6, 2020న అమెరికా క్యాపిటల్ పై ట్రంప్ మద్దతుదారులు జరిపిన దాడిపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక కమిటీ కూడా ట్రంప్ అధికారిక పత్రాల కోసం తీవ్రంగా గాలిస్తోంది. ఈ మేరకు ప్రత్యేక కమిటీ అధ్యక్షురాలు కరోలిన్ మలోనీ మాట్లాడుతూ..ట్రంప్ పదేపదే అధ్యక్ష రికార్డులను నాశనం చేయడానికి ప్రయత్నించారని, తాము ఆ రికార్డుల గురించి ఆందోళన చెందుతున్నాం. ఇది తీవ్రమైన ఉల్లంఘన కిందకే వస్తుంది. అని వ్యాఖ్యానించారు. -
భలే చాన్సులే..
♦ రాష్ట్రపతి ఉత్తర్వులతో ‘ఏకీకృత’ ప్రయోజనం ♦ ఉపాధ్యాయులకు పదోన్నతులు ♦ స్కూల్ అసిస్టెంట్లకు జేఎల్, ఎంఈవోలు, డిప్యూటీ డీఈవోలగాను.. ♦ సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగాను పదోన్నతి ♦ సీనియారిటీ ప్రాతిపదికన ప్రాధాన్యత సాక్షి, విశాఖపట్నం : ఏకీకృత సర్వీస్ రూల్స్‌పై రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులతో ఉపాధ్యాయులకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది. సెకండరీ గ్రేడ్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్లుగాను, స్కూల్ అసిస్టెంట్లు జూనియర్ లెక్చరర్లు, ఎంఈవోలు, డిప్యూటీ డీఈవోలు గాను పదోన్నతులు పొందడానికి మార్గం సుగమం కానుంది. విద్యాశాఖ ఇందుకవసరమైన సర్వీస్ రూల్స్‌ను రూపొందించే పనిలో ఉంది. ఇన్నాళ్లూ ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేసే ఉపాధ్యాయులకే తప్ప స్థానిక సంస్థల యాజమాన్యంలో నడిచే పాఠశాలల టీచర్లకు సర్వీస్ రూల్స్ లేవు. రాష్ట్రపతి ఉత్తర్వులతో ఇకపై వీరికి కూడా సర్వీస్ రూల్స్ వర్తిస్తాయి. సర్వీస్ రూల్స్‌పై రూపొందించిన డ్రాఫ్ట్‌పై తమ అభ్యంతరాలను ఈ నెల తొమ్మిదో తేదీలోగా తెలియజేసేందుకు విద్యాశాఖ ఉపాధ్యాయులకు అవకాశం ఇచ్చింది. దీంతో ఆయా ఉపాధ్యాయులను తమ అభ్యంతరాలను తెలియజేస్తున్నారు. వీటిని పరిశీలించిన తర్వాత విద్యాశాఖ సమగ్ర నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారిలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ వంటి పోస్ట్రుగాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిలో సీనియర్లకు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్లుగా పదోన్నతి కల్పిస్తారు. మరికొందరు ఎంఈవోలు, డిప్యూటీ డీఈవోలుగా పదోన్నతి పొందుతారు. కామన్ సీనియారిటీ ప్రకారం వీరికి ప్రమోషన్లు లభిస్తాయి. ఇందుకుగాను సబ్జెక్టుల వారీగా సీనియారిటీ జాబితాను సిద్ధం చేస్తారు. నిబంధనల ప్రకారం ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను 70 శాతం పదోన్నతుల ద్వారా, 30 శాతం ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు జోన్-1 పరిధిలోకి వస్తాయి. జోన్-1లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో సుమారు వెయ్యి లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. వీటిలో విశాఖ జిల్లాకు సంబంధించి 450 వరకు ఖాళీలున్నాయి. నిబంధనల మేరకు వీటిని 70 శాతం ప్రమోషన్లు, 30 శాతం ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తే 300 మందికి పైగా లెక్చరర్లు, ఎంఈవోలు, డిప్యూటీ డీఈవోలు, డైట్ లెక్చరర్లుగా పదోన్నతులు పొందేందుకు అవకాశం ఉందన్నమాట! ఇలా పదోన్నతి పొందే స్కూల్ అసిస్టెంట్లకు ప్రభుత్వం రెండు ఇంక్రిమెంట్లను ఇవ్వనుంది. ఈ లెక్కన కనీసం ఒక్కొక్కరికి తమ బేసిక్‌పై జీతం రూ.ఐదారు వేలు అదనంగా పెరగనుంది. మరోవైపు జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో సుమారు 300 మంది కాంట్రాక్టు విధానంలో లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. తమను పర్మినెంట్ చేయాలని ఈ కాంట్రాక్టు లెక్చరర్లు ఎప్పట్నుంచో ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. అప్పుడప్పుడు ఆందోళనలూ చేస్తున్నారు. వీరిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలులోకి తెచ్చి వీరికి పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కావడానికి కనీసం మరో రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. -
సమాఖ్యను సందర్శించిన మహారాష్ట సంఘాలు
లింగాలఘణపురం : మండల కేంద్రంలోని శుభాంజలి మండల సమాఖ్యను మంగళవా రం మహారాష్ట్రకు చెంది న స్వయం సహాయక సం ఘాల అధ్యక్ష కార్యదర్శులు సందర్శించారు. ప్రతి నెలా 26న జరిగే మండల సమా ఖ్య సమావేశం తీరును గమనించారు. మహారాష్ట్ర బ్లాక్ మేనేజర్ సునిల్‌పాటిల్ ఆధ్వర్యంలో 26 మంది సంఘాల అధ్యక్షకార్యదర్శులు ఈ బృందంలో ఉన్నారు. సమావేశంలో జరిగే చర్చలు, చేసిన తీర్మానాలు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. వారి వెంట స్థానిక డీపీఎం నీలవేణి, మండల సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు రాధిక, అనిత, కోశాధికారి రజిత, ఏపీఎం శంకరయ్య, సీసీలు ఉన్నారు. -
థానే అమ్మాయికి అమెరికా ఆహ్వానం..
మహరాష్ట్రః ముంబై కాలేజీలో చదువుతున్న విద్యార్థినికి ఆమెరికా ఆహ్వానం పలికింది. వచ్చే సంవత్సరం వాషింగ్టన్ లో జరగనున్న కార్యక్రమానికి థానెకు చెందిన విద్యార్థిని ఓయిషికా ఎంపికైంది. దీంతో రానున్న ప్రెసిడెన్షియల్ ప్రారంభోత్సవ లీడర్షిప్ సమ్మిట్ కు రావాల్సిందిగా ఆమెకు ప్రత్యేక ఆహ్వానం పంపింది. మహరాష్ట్ర థానెకు చెందిన పదహారేళ్ళ ఓయిషికా నియోగి... ముంబై కాలేజీలో చదువుకుంటోంది. తన తల్లి చుమ్కీ నియోగి తో పాటు థానే మీరా రోడ్ శివారు ప్రాంతంలో నివసిస్తోంది. ప్రస్తుతం ముంబై మలాద్ లోని బికె గాడియా జూనియర్ కాలేజీలో సైన్స్ గ్రూప్ లో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన ఓయిషికా... కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు పాల్గొనే యువ ప్రపంచ సదస్సులో భారత్ కు ప్రాతినిథ్యం వహించనుంది. 2017లో వాషింగ్టన్ లో జరిగే ఈ కార్యక్రమానికి అతి పిన్న నోబెల్ గ్రహీత, పాకిస్తానీ అమ్మాయి, విద్యా కార్యకర్త మలాలా, ఆమె తండ్రి జియావుద్దీన్ కూడ ఇతర ఆహ్వానితులుగా హాజరుకానున్నారు. వారందరినీ కలిసే అవకాశం తనకు రావడంపట్ల ఓయిషికా ఆనందం వ్యక్తం చేస్తోంది. ఓ అద్భుతమైన వక్త, యువ మేధావి కావడంతోనే ఆమెకు ఈ అరుదైన అవకాశం వచ్చిందంటూ బికె గాడియా కాలేజ్ ప్రిన్సిపాల్ అరుంధతి ఓయిషికాను ప్రశంసించారు. ఓయిషికా కలకత్తాలో పుట్టింది. హైదరాబాద్ లో జరిగిన హార్వర్డ్ యునైటెడ్ నేషన్స్ పోటీలో రాణించిన ఆమె... అనంతరం జూన్ 2015 లో అమెరికా గ్లోబల్ యంగ్ లీడర్స్ సదస్సు డిక్లమేషన్ పోటీలోనూ గెలిచింది. తరువాతే ఆమెకు ఈ సదవకాశం వచ్చింది. అంతర్జాతీయ సంబంధాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులు... మోడల్ చర్చల్లో పాల్గొని ప్రత్యేకంగా ప్రపంచ ప్రేక్షకులముందు వాటిని బహిర్గతం చేసేందుకు ఐక్యరాజ్యసమితి మోడల్ యునైటెడ్ వేదిక రూపొందించింది. బి. కె. గాడియా జూనియర్ కళాశాల కు చెందిన డి.జి కేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి సంవత్సరం ఐక్యరాజ్యసమితి మాక్ డిబేట్ నిర్వహిస్తుంది. అందులో గెలిచిన ఓయిషికా గత సంవత్సరం హైదరాబాద్ పోటీలో రాణించి, అనంతరం వాషింగ్టన్ డిసి, న్యూయార్క్ ల్లో జరిగిన గ్లోబల్ యూత్ లీడర్ షిప్ కాన్ఫరెన్స్ కు కూడ హాజరైంది. అయితే ప్రస్తుతం అమెరికా ఆహ్వానంమేరకు ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ సమ్మిట్ కు హాజరు కాబోతోంది. తనకు బరాక్ ఒబామా, మిచెల్లె లు కూడ ఎంతో ఆరాధ్యులని, వారిని కూడ ఎప్పుడోప్పుడు కలుస్తానని ఈ సందర్భంగా చెప్తోంది. రానున్న ఆమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ గెలవాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నానని, అలా జరిగితే వైట్ హౌస్ లో మొదటి మహిళా అధ్యక్షురాలుగా హిల్లరీది చారిత్రక విజయమౌతుందని, ఆమె ఓ మంచి నాయకురాలుగా వర్థిల్లుతుందన్న నమ్మకం కూడ తనకు ఉందని ఓయిషికా చెప్తోంది. అయితే డోనాల్డ్ ట్రంప్ కాస్త దూకుడు మనిషి అయినా ఆమెరికన్లు ఆయన్ను ఇష్టపడుతున్నట్లుగా కనిపిస్తోందని, చాలాకాలం ప్రశాంతంగా కొనసాగిపోవడంతో ఇప్పుడు కాస్త దూకుడు కావాలన్న దృష్టిలో అమెరికన్లు ఉన్నారని అంటోంది. భవిష్యత్తులో టెలివిజన్ మీడియా ప్రొఫెషనల్ కావాలనుకుంటున్న ఓయిషికా.. ఐక్యరాజ్య సమితిలో మీడియా ప్రతినిధిగా పనిచేయాలని కలలుగంటోంది. ప్రపంచ వ్యవహారాల్లో జ్ఞానాన్ని సముపార్జించడమేకాక, వెస్ట్రన్ డ్యాన్స్ అండ్ థియేటర్, పెయింటింగ్ వంటి వాటిలో కూడ ఓయిషికా శిక్షణ పొందుతోంది. -
'ఆ డిబేట్ కిచెన్ టేబుల్ నుండే మొదలౌతుంది'
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో డెమొక్రటిక్ పార్టీ తరపున ముందున్న హిల్లరీ క్లింటన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం లోవాలో డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెన్సియల్ డిబేట్లో పాల్గొన్న ఆమె.. రానున్న ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే తన భర్త బిల్ క్లింటన్ సలహాలు సూచనలు తనకు ఎంతగానో ఉపయోగపడుతాయని అంది. అయితే పాలనకు సంబంధించిన ఆ డిబేట్ కిచెన్ టేబుల్ నుండే మొదలౌతుంది అని సరదాగా వ్యాఖ్యానించారు. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన బిల్ క్లింటన్ అనుభవం తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు హిల్లరీ వెల్లడించారు. 'నాకున్న బెస్ట్ సలహాదారుడు బిల్. 1990 లలో అమెరికా పౌరుల ఆర్థిక పరిస్థితి మెరుగవడంలో అతని పాత్ర ఎంతో ఉంది. నేను తప్పకుండా బిల్ సలహాలు తీసుకుంటాను' అని హిల్లరీ తెలిపారు. అమెరికా ఇంకా ఎంతో అభివృద్ధి సాధించాల్సి ఉందని తెలిపిన ఆమె.. ముఖ్యంగా పేద ప్రజలు స్వతహాగా అభివృద్ధి చెందడానికి చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.