సమాఖ్యను సందర్శించిన మహారాష్ట సంఘాలు
Published Wed, Jul 27 2016 1:04 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
లింగాలఘణపురం : మండల కేంద్రంలోని శుభాంజలి మండల సమాఖ్యను మంగళవా రం మహారాష్ట్రకు చెంది న స్వయం సహాయక సం ఘాల అధ్యక్ష కార్యదర్శులు సందర్శించారు. ప్రతి నెలా 26న జరిగే మండల సమా ఖ్య సమావేశం తీరును గమనించారు. మహారాష్ట్ర బ్లాక్ మేనేజర్ సునిల్‌పాటిల్ ఆధ్వర్యంలో 26 మంది సంఘాల అధ్యక్షకార్యదర్శులు ఈ బృందంలో ఉన్నారు. సమావేశంలో జరిగే చర్చలు, చేసిన తీర్మానాలు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. వారి వెంట స్థానిక డీపీఎం నీలవేణి, మండల సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు రాధిక, అనిత, కోశాధికారి రజిత, ఏపీఎం శంకరయ్య, సీసీలు ఉన్నారు.
Advertisement
Advertisement