సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయానికి వచ్చిన సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలకు ప్రణాళిక సిద్ధం చేశారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో సభల నిర్వహణకు కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో లక్ష మంది రైతులతో సభ నిర్వహించనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సభలను నిర్వహించనున్నట్లు టీఆర్‌ఎస్ పార్టీవర్గాల ద్వారా తెలిసింది.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సభలు నిర్వహించడం ద్వారా సీఎం కేసీఆర్, మోదీపై ప్రత్యక్ష యుద్ధానికి సన్నద్ధమవుతున్నారని తెలుస్తోంది. కాగా, ఈ సభలకు హాజరయ్యే రైతులకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని భావిస్తున్నారు. ఇటీవల సీఎం బిహార్ పర్యటన, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి ప్రగతి భవన్‌కు వచ్చిన రైతు నాయకులతో జరిగిన సమావేశాల్లో వ్యక్తమైన అభిప్రాయాల మేరకు ఈ భారీ బహిరంగ సభలకు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment