Documents ripped up, stuffed down the toilet: అమెరికా అధ్యక్షుల రికార్డులను భద్రపరిచే నేషనల్ ఆర్కైవ్స్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యహహార శైలిపై విచారణ చేయాలని న్యాయశాఖను అభ్యర్థించింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష్య డాక్యుమెంట్‌లను చింపేసి టాయిలెట్‌లో పడేయడం లేదా ఫ్లోరిడాకు తరలించడం వంటివి చేశారని ఆరోపించింది. అంతేకాదు ట్రంప్ అధ్యక్ష పత్రాలను భద్రపరచడంలో చట్టాలను ఉల్లంఘించారని ఆర్కైవ్స్ పేర్కొంది. రిపబ్లికన్ మద్దతుదారులను ఆకర్షించే నిమిత్తం ట్రంప్ గతంలో ప్రెసిడెన్షియల్ డెకోరమ్ ఆమోదించిన అనేక నిబంధనన పత్రాలను పాడు చేసినట్లు వెల్లడించింది. అంతేకాదు అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడూ వైట్‌హౌస్ పేపర్లను చించిపడేసే ట్రంప్ అలవాటు పై దర్యాప్తు చేయాలని ఆర్కైవ్స్ కోరింది.
ఈ ఆరోపణల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వ రికార్డుల కార్యాలయం ట్రంప్ ఫ్టోరిడా ఎస్టేట్ నుండి 15 బాక్సుల డాక్యుమెంట్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ధృవీకరించింది. పైగా వాటిని ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన సమయంలో తనతోపాటు తీసువెళ్లారని పేర్కొంది. అంతేకాదు ఆ పత్రాలలో చాలామటుకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కి సంబంధించిన అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల తోపాటు అప్పటి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్రంప్ కోసం ఓవల్ ఆపీస్‌ని విడిచి వెళ్తున్నప్పుడు రాసిన లేఖ కూడా ఉందని వెల్లడించింది . అయితే ట్రంప్ మాత్రం అవన్ని ప్రేమ లేఖలని చెప్పడం గమనార్హం. ఈ మేరకు వాటర్‌గేట్ కుంభకోణం నేపథ్యంలో ఆమోదించిన 1978 ప్రెసిడెన్షియల్ రికార్డ్స్ యాక్ట్ (పీఆర్‌ఏ) ప్రకారం యూఎస్ అధ్యక్షులు అన్ని ఈమెయిల్‌లు, ఉత్తరాలు, ఇతర పని పత్రాలను నేషనల్ ఆర్కైవ్స్‌కు బదిలీ చేయాలి.
అయితే ట్రంప్ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదంటూ ఈ ఆరోపణలన్నింటిని ఖండించారు. అంతేగాదు ఆర్కైవ్స్‌తో తన వ్యవహారాలను ఎలాంటి వివాదం లేకుండా స్నేహపూరిత వాతావరణంలోనే కొనసాగించినట్లు పేర్కొన్నాడు. న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్ట్ మ్యాగీ హేబెర్‌మాన్ రాసిన "కాన్ఫిడెన్స్ మ్యాన్" పుస్తకం ప్రకారం వైట్ హౌస్ నివాసంలోని సిబ్బంది క్రమానుగతంగా మూసుకుపోతున్న టాయిలెట్‌లో ప్రింటెడ్ పేపర్‌ను కనుగొన్నారు అని రాయడం కొసమెరుపు.
హేబెర్‌మాన్ ట్రంప్‌తో తీసుకున్న ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పుస్తకాన్ని రాశాడు. జనవరి 6, 2020న అమెరికా క్యాపిటల్ పై ట్రంప్ మద్దతుదారులు జరిపిన దాడిపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక కమిటీ కూడా ట్రంప్ అధికారిక పత్రాల కోసం తీవ్రంగా గాలిస్తోంది. ఈ మేరకు ప్రత్యేక కమిటీ అధ్యక్షురాలు కరోలిన్ మలోనీ మాట్లాడుతూ..ట్రంప్ పదేపదే అధ్యక్ష రికార్డులను నాశనం చేయడానికి ప్రయత్నించారని, తాము ఆ రికార్డుల గురించి ఆందోళన చెందుతున్నాం. ఇది తీవ్రమైన ఉల్లంఘన కిందకే వస్తుంది. అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment