మోదీ సూట్ వేలంపై సిబాల్ చురకలు | Modi suite retort auction Sibal | Sakshi
Sakshi News home page

మోదీ సూట్ వేలంపై సిబాల్ చురకలు

Published Tue, Mar 17 2015 2:39 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

మోదీ సూట్ వేలంపై సిబాల్ చురకలు - Sakshi

మోదీ సూట్ వేలంపై సిబాల్ చురకలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ సూట్ వేలంపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ సోమవారం బీజేపీకి చురకలు అంటించారు. వచ్చే బడ్జెట్‌లో పలు ప్రాజెక్టులకు నిధుల కోసం కేంద్ర ఆర్థిక మంత్రి ఇలాంటి వినూత్న పద్ధతులను మరిన్నింటిని చేపడతారేమో అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇలాంటి వేలం కార్యక్రమాలను నిర్వహించడానికి ఓ సబ్ కమిటీని కూడా వేస్తారేమో అన్న ఆశ్చర్యాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఒబామా పర్యటన సమయంలో మోదీ ధరించిన సూట్‌ను గత నెల గుజరాత్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త రూ.4.31 కోట్లకు వేలంలో దక్కించుకున్న విషయం విదితమే. మహాత్మాగాంధీ, అబ్రహం లింకన్ వస్తువుల కంటే మోదీ సూటే వేలంలో ఎక్కువ ధర పలకడం ఎంతో విస్మయానికి గురిచేసిందని సిబాల్ వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement