న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా తనకు వచ్చిన కానుకలు, మెమెంటోలను ఈ–వేలం వేస్తున్నామని అందులో పాల్గొని కొనుగోలు చేయాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ బహుమతులు అమ్మగా వచ్చిన డబ్బులన్నీ గంగానదిని ప్రక్షాళనకు ఉద్దేశించిన నమామి గంగే ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తామని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ట్వీట్ చేశారు.
‘‘గత కొద్ది ఏళ్లుగా నాకు ఎందరో ఎన్నో కానుకలు ఇచ్చారు. మన ఒలింపిక్ హీరోలు ఇచ్చిన ప్రత్యేక మెమొంటోలు, వారు వాడిన వస్తువులు కూడా ఉన్నాయి. వాటిని ఆన్‌లైన్ ద్వారా వేలం వేస్తున్నాం. ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొనండి. ఈ–వేలంలో వచ్చిన డబ్బుల్ని గంగానది శుద్ధి చేయడానికి వినియోగిస్తాం’’ అని ప్రధాని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Over time, I have received several gifts and mementos which are being auctioned. This includes the special mementos given by our Olympics heroes. Do take part in the auction. The proceeds would go to the Namami Gange initiative.https://t.co/Oeq4EYb30M pic.twitter.com/PrF44YWBrN
— Narendra Modi (@narendramodi) September 19, 2021
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజుని పురస్కరించుకొని సెప్టెంబర్ 17న కేంద్ర సాంస్కృతిక శాఖ కానుకలు వేలం వెయ్యడం మొదలు పెట్టింది. అక్టోబర్ 7 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ వేలంలో వ్యక్తులు, సంస్థలు ఎవరైనా సరే http://pmmementos.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా వేలంలో పాల్గొనవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment