మోదీ సూటుకు అక్షరాలా 'కోటి' | Prime Minister Narendra Modi's suit will be auctioned in Surat | Sakshi
Sakshi News home page

మోదీ సూటుకు అక్షరాలా 'కోటి'

Published Wed, Feb 18 2015 1:05 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

మోదీ సూటుకు అక్షరాలా 'కోటి' - Sakshi

మోదీ సూటుకు అక్షరాలా 'కోటి'

సూరత్ :  అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ధరించిన సుమారు రూ.10లక్షల  విలువైన సూట్  వేలానికి రంగం సిద్ధమైంది.  రాజకీయపరంగా తీవ్ర వివాదం రేపిన ఈ సూట్‌తోపాటు గడిచిన  తొమ్మిది నెలలుగా ప్రధానికి కానుకలుగా అందిన 455 వస్తువులను కూడా  వేలానికి పెట్టనున్నారు. గుజరాత్  రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బుధవారం  సూరత్ లోని సైన్స్ సెంటర్  ఈ వేలానికి వేదిక కానుంది. సూరత్ కు చెందిన వ్యాపారవేత్త సురేష్ అగర్వాల్ ఈ సూట్ కోసం రూ.కోటికి  బిడ్ చేయటం విశేషం. ఈ సూట్ ను దక్కించుకునేందుకు ఈరోజు సాయంత్రం అయిదు గంటల వరకూ వేలంలో పాల్గొనేందుకు అవకాశం ఉంది.

 

ఇలా వచ్చిన సొమ్మును బాలికా విద్య కోసం నమామి గంగా ట్రస్ట్ ఫండుకు  విరాళంగా ఇవ్వనున్నారు. మూడు రోజులు  పాటు ఈ వేలం జరుగుతుందని కలెక్టర్ డా.రాజేంద్ర కుమార్, మున్సిపల్ కమిషనర్ మీడియాకు వెల్లడించారు.  అధిక మొత్తంలో నిధుల సమీకరణ కోసమే డైమండ్ సిటీ సూరత్ ను  ఎన్నుకున్నామని తెలిపారు. సూరత్ నరేంద్ర మోదీ  గుజరాత్  ముఖ్యమంత్రిగా  ఉన్నపుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినట్టుగా వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement