టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో జతకట్టనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే కథ సిద్ధం కాగా.. షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తీయబోయే చిత్రం కావడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తి నెలకొంది.
అయితే ఇటీవల రాజమౌళి గురించి ఓ డాక్యుమెంటరీ చిత్రం వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన మోడరన్ మాస్టర్స్ పేరుతో ఈ డాక్యుమెంటరీని రిలీజ్ చేశారు. ఇందులో ఆయన డైరెక్షన్, ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాల కోసం చేసిన హార్డ్ వర్క్‌ను చూపించారు. మొత్తంగా రాజమౌళి జీవిత విశేషాలను డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకులను ముందుకు తీసుకొచ్చారు.
తాజాగా ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్‌పై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు. ఆయన కథ చెప్పేవిధానం, డెడికేషన్ అద్భుతమంటూ కొనియాడారు. ఇలాంటి డాక్యుమెంటరీ రూపొందించడం రాజమౌళికి దక్కిన సరైన గౌరవమని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీని అనుపమా చోప్రా సమర్పణలో అప్లాజ్ ఎంటర్‌టైన్మెంట్, ఫిల్మీ కంపానియన్ సంయుక్తంగా నిర్మించారు. రాఘవ్ ఖన్నా దర్శకత్వం వహించగా.. తన్వీ అజింక్యా సహ దర్శకులుగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుచోంది.
Comments
Please login to add a commentAdd a comment