
టోక్యో: ఒలింపిక్స్‌లో పోటీల నాలుగో రోజు రష్యన్ల పాలిట మరుపురాని రోజుగా మిగిలిపోయింది. విశ్వక్రీడల స్విమ్మింగ్‌లో ఎదురులేని అమెరికా స్విమ్మర్లకు చెక్ పెట్టిన రష్యన్లు... జిమ్నాస్టిక్స్‌లో అమెరికాకు షాక్ ఇచ్చారు. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో మంగళవారం మహిళల టీమ్ విభాగం పతకాల పోటీ జరిగింది. ఇందులో రష్యా మెరుపు విన్యాసాలతో బంగారు పతకం కొల్లగొట్టింది. 1992లో సోవి యట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్‌లో రష్యా పసిడి నెగ్గడం ఇదే తొలిసారి.
అమెరికా గ్రేటెస్ట్ జిమ్నాస్ట్, ఒలింపిక్ చాంపియన్ సిమోన్ బైల్స్ పోటీల మధ్యలోనే తప్పుకోవడం జట్టుకు ప్రతికూలించింది. తద్వారా టీమ్ విభాగంలో వరుసగా మూడో ఒలింపిక్ స్వర్ణం సాధించాలనుకున్న అమెరికా ఆశలు ఆవిరయ్యాయి. బైల్స్ ఒక్క వాల్ట్‌లోనే పోటీ పడింది. తదుపరి అన్‌ఈవెన్ బార్స్, బ్యాలెన్స్ బీమ్, ఫ్లోర్ ఈవెంట్లలో పోటీ పడకుండా తప్పుకుంది. మరోవైపు అకయిమోవా, లిస్టునోవా, మెలి్నకొవా, వురజొవాతో కూడిన రష్యా బృందం 169 స్కోరుతో స్వర్ణం గెలిచింది. సిమోన్, చిలెస్, సునిసా లీ, గ్రేస్‌లతో కూడిన అమెరికా 166 స్కోరుతో రజతం దక్కించుకుంది. 164 పాయింట్లు సాధిం చిన బ్రిటన్ కాంస్యం నెగ్గింది. 1928 తర్వాత టీమ్ విభాగంలో బ్రిటన్‌కు పతకం రావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment