ROC
-
29 ఏళ్ల తర్వాత జిమ్నాస్టిక్స్‌లో స్వర్ణం సాధించారు
టోక్యో: ఒలింపిక్స్‌లో పోటీల నాలుగో రోజు రష్యన్ల పాలిట మరుపురాని రోజుగా మిగిలిపోయింది. విశ్వక్రీడల స్విమ్మింగ్‌లో ఎదురులేని అమెరికా స్విమ్మర్లకు చెక్ పెట్టిన రష్యన్లు... జిమ్నాస్టిక్స్‌లో అమెరికాకు షాక్ ఇచ్చారు. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో మంగళవారం మహిళల టీమ్ విభాగం పతకాల పోటీ జరిగింది. ఇందులో రష్యా మెరుపు విన్యాసాలతో బంగారు పతకం కొల్లగొట్టింది. 1992లో సోవి యట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్‌లో రష్యా పసిడి నెగ్గడం ఇదే తొలిసారి. అమెరికా గ్రేటెస్ట్ జిమ్నాస్ట్, ఒలింపిక్ చాంపియన్ సిమోన్ బైల్స్ పోటీల మధ్యలోనే తప్పుకోవడం జట్టుకు ప్రతికూలించింది. తద్వారా టీమ్ విభాగంలో వరుసగా మూడో ఒలింపిక్ స్వర్ణం సాధించాలనుకున్న అమెరికా ఆశలు ఆవిరయ్యాయి. బైల్స్ ఒక్క వాల్ట్‌లోనే పోటీ పడింది. తదుపరి అన్ఈవెన్ బార్స్, బ్యాలెన్స్ బీమ్, ఫ్లోర్ ఈవెంట్లలో పోటీ పడకుండా తప్పుకుంది. మరోవైపు అకయిమోవా, లిస్టునోవా, మెలి్నకొవా, వురజొవాతో కూడిన రష్యా బృందం 169 స్కోరుతో స్వర్ణం గెలిచింది. సిమోన్, చిలెస్, సునిసా లీ, గ్రేస్‌లతో కూడిన అమెరికా 166 స్కోరుతో రజతం దక్కించుకుంది. 164 పాయింట్లు సాధిం చిన బ్రిటన్ కాంస్యం నెగ్గింది. 1928 తర్వాత టీమ్ విభాగంలో బ్రిటన్‌కు పతకం రావడం విశేషం. -
ఆర్వోసీ విజయవాడలో శిక్షణ శిబిరం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) ఆధ్వర్యంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఎంసీఏ) తీసుకొచ్చిన ప్రగతిశీల సంస్కరణల మీద విజయవాడ ఆర్వోసీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం జరిగింది. కంపెనీల చట్ట సవరణలు, కంపెనీస్ కొత్త రూల్స్, షేర్ క్యాపిటల్, డిబెంచర్స్ 2014 నిబంధనలు వంటి తదితర అంశాలలతో పాటూ వెబ్ ఆధారిత సర్వీస్ రన్, సీఆర్సీ వంటి సాంకేతికత అంశాల మీద అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఆర్వోసీ డెన్నింగ్ కె. బాబు, అసిస్టెంట్ ఆర్వోసీ ఎల్. సాయి శంకర్, ఐసీఎస్ఐ అమరావ తి చాప్టర్ ప్రతినిధులు పి. ప్రకాశ్ రెడ్డి, జేవీ రామారావు, కె. శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు. -
టీఎస్ఎస్ గ్రూప్‌లో ఆర్వోసీ సోదాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న టీఎస్ఎస్ గ్రూప్‌లో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) హైదరాబాద్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. గ్రూప్ కంపెనీల్లో భారీగా నగదు లావాదేవీలు, అవకతవకలు జరిగాయన్న సమాచారంతో ఈ సోదాలు జరిపినట్లు ఆర్వోసీ వర్గాలు తెలిపాయి. మాదాపూర్‌లోని కావూరీహిల్స్‌లో ఉన్న టీఎస్ఎస్ గ్రూప్‌లో 15 అనుబంధ కంపెనీలున్నాయి. రమేశ్ హరిదాస్, ఉర్వశీ రమేశ్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న ఈ కంపెనీల్లో 10 హైదరాబాద్ ఆర్వోసీ పరిధిలో, 2 విజయవాడ, 3 చెన్నై ఆర్వోసీ పరిధిలో ఉన్నాయి. ట్రాన్స్‌జెల్ ఇరాన్‌కు షిఫ్ట్.. టీఎస్ఎస్ గ్రూప్‌లోని చాలా కంపెనీలు 2016 నుంచి (ఎంసీఏకు బ్యాలెన్స్ షీట్స్ సమర్పించడం లేదు. ఈ కంపెనీల్లో న్యూ హెవెన్ కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ గతేడాది బీఎస్ఈ నుంచి డీ–లిస్ట్ అయింది. ట్రాన్స్‌జెల్ ఇండస్ట్రీస్ కార్యకలాపాలు ఇరాన్‌కు బదిలీ అయ్యాయి. దీనికి రమేశ్, ఉర్వశీతో పాటూ ఇరాన్ పార్టనర్ హెర్మాన్ జోసెఫ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ విషయమై టీఎస్ఎస్ గ్రూప్ డైరెక్టర్ రమేశ్ హరిదాస్‌ను ప్రశ్నించగా.. ‘‘పటాన్చెరులో ప్లాంట్ పెడతామని అనుకున్నాం. కానీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్లాంట్‌ను, మిషనరీని ఇరాన్‌కు బదిలీ చేయాల్సి వచ్చింది’’ అని చెప్పారు. రూ.500 కోట్లకు పైగా రుణాలు... ఎంసీఏ రికార్డుల ప్రకారం టీఎస్ఎస్ గ్రూప్‌నకు రూ.500 కోట్లకు పైగా రుణాలున్నాయి. కాకపోతే సోదాల కోసం వెళ్లిన ఆర్ఓసీ అధికారులకు కంపెనీ పేర్ల బోర్డులు గానీ, ఉద్యోగులు గానీ కనిపించలేదని సమాచారం. నందినీ ఇండస్ట్రీస్‌లో ఉన్న 8–10 మందినే ఇతర కంపెనీల్లో కూడా ఉద్యోగులుగా చూపిస్తున్నారనేది ఆర్వోసీ అధికారుల మాట. ఈ గ్రూప్‌నకు చెన్నైలో ఉన్న కంపెనీలను కూడా తనిఖీ చేసిన తర్వాత చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. ఆర్వోసీ లెక్కలే తప్పు.. ఆర్వోసీ తనిఖీలపై వివరణ కోరేందుకు ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధి ప్రయత్నించగా... ‘‘మా గ్రూప్ కంపెనీలకున్న రుణాలు రూ.160 కోట్లే. చాలా వరకు తీర్చేశాం. హైదరాబాద్‌లో నాలుగు ప్రైమ్ ప్రాపర్టీలున్నాయి. వాటిని విక్రయించి.. మిగతా రుణాలను తీర్చడానికి ప్రయత్నిస్తున్నాం. ఏడాదిలో ఇది జరిగిపోతుందని’’ అని కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. డైరెక్టరు రమేశ్ హరిదాస్ మాత్రం ‘‘మాకు ఒక్క రూపాయి లోన్ లేదు. ఆర్వోసీ రికార్డులే తప్పు. చాలా రుణాలు తీర్చేశాం. బ్యాంక్‌లు ఆర్వోసీకి అప్డేట్ చేయలేదు’’ అని పేర్కొనటం గమనార్హం. -
2లక్షల కంపెనీలపై సర్కారు వేటు
-
2లక్షల కంపెనీలపై వేటు
ఆర్వోసీ నుంచి తొలగింపు ► బ్యాంక్ ఖాతాల స్తంభన కేంద్రం ఆదేశాలు ► రెగ్యులేటరీ నిబంధనలను పాటించని నేపథ్యం ► మరికొన్ని కంపెనీలపైనా చర్యలకు సమాయత్తం ► నల్లధనంపై మరో కీలక నిర్ణయం న్యూఢిల్లీ: నల్లధనం నిరోధించే దిశలో కేంద్రంలోని మోదీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెగ్యులేటరీ నిబంధనలను పాటించని 2.09 లక్షల కంపెనీలను రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్(ఆర్వోసీ) నుంచి తొలగించింది. ఇందులో భాగంగా ఆయా బ్యాంక్ ఖాతాల స్తంభనకూ ఆదేశాలు ఇచ్చింది. ఆయా సంస్థలపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. మరికొన్ని కంపెనీలపైనా ఇదే విధమైన చర్యలకు అవకాశం ఉందని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. నిబంధనలు పాటించకుండా, చాలాకాలం నుంచి వ్యాపారం చేయకుండా ఉంటున్న కంపెనీల ఆర్థిక కార్యకలాపాలపై నిఘా పెట్టాలని బ్యాంకులను ఆదేశించినట్లు ఆర్థికశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీనికి సంబంధించి ఇంకా ఆయన తెలిపిన అంశాలు క్లుప్తంగా... ♦ తప్పు చేసిన కంపెనీలను వదిలిపెట్టడం జరగదు. కార్పొరేట్ ప్రమాణాల మెరుగుదలకు ఈ చర్యలు దోహదపడతాయి. వ్యవస్థ ప్రక్షాళన దిశలో ఇదొక ముందడుగు. ♦ కంపెనీల చట్టంలోని 248 (5) సెక్షన్ ప్రకారం మొత్తం 2,09,032 కంపెనీలను రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ నుంచి తొలగించడం జరిగింది. ఈ చర్యతో ఆయా కంపెనీల ప్రస్తుత డైరెక్టర్లు, ఆథరైజ్డ్ సిగ్నేటరీస్ తమ హోదాలను కోల్పోయి, మాజీలుగా మారతారు. ♦ డీమోనిటైజేషన్ సమయంలో నల్లడబ్బును వ్యవస్థలోకి తీసుకురావడానికి ఈ కంపెనీలు (తాజా డీరిజిస్టర్డ్) తమ అకౌంట్లను వినియోగించుకున్నాయా? ఆయా అంశాలకు సంబంధించి ఈ కంపెనీల కార్యకలాపాలు ఏమన్నా ఉన్నాయా? అన్న అంశంపై సైతం సమగ్ర విశ్లేషణ ప్రారంభమైంది. ♦ ఆర్ఓసీ నుంచి తొలగించిన కంపెనీల బ్యాంక్ అకౌంట్లపై ఆంక్షల విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు ఇప్పటికే ఆర్థిక సేవల శాఖ నుంచి ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ద్వారా వర్తమానం అందింది. ♦ నిజానికి ప్రస్తుత చర్యలను ఎదుర్కొంటున్న కంపెనీల్లో కొన్ని కార్పొరేట్ మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌కు సంబంధించి క్రియాశీలంగానే ఉన్నాయి. అయితే తగిన సమయంలో తమ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు లేదా వార్షిక రిటర్న్స్ తదితర ఇతర రెగ్యులేటరీ నిబంధనలు పాటించడంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ♦ ఏదైనా కంపెనీ అకౌంట్ స్తంభించిపోతే ఆ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు తిరిగి బ్యాంక్‌ను సంప్రదించి, తగిన కారణాలు చూపి అకౌంట్‌ను తిరిగి పునరుద్ధరించుకునే వీలూ ఉంది. నల్లధనమే లక్ష్యం... నల్లధనాన్ని నిర్మూలించాలన్నది ప్రధాని నరేంద్రమోదీ ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని నెరవేర్చడంలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ తన సర్వశక్తులనూ ఒడ్డుతుంది. ఇందుకు అనుగుణంగా నల్లధనం తదుపరి యుద్ధంలో భాగంగానే బ్యాంకులకు తాజా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తక్షణం ఈ చర్యలు అమల్లోకి వస్తాయి. – ట్వీటర్లో పీపీ చౌదరి, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి