
కార్యక్రమంలో ఆర్‌వోసీ అధికారులు, ఇతర ప్రతినిధులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) ఆధ్వర్యంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఎంసీఏ) తీసుకొచ్చిన ప్రగతిశీల సంస్కరణల మీద విజయవాడ ఆర్‌వోసీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం జరిగింది. కంపెనీల చట్ట సవరణలు, కంపెనీస్ కొత్త రూల్స్, షేర్ క్యాపిటల్, డిబెంచర్స్ 2014 నిబంధనలు వంటి తదితర అంశాలలతో పాటూ వెబ్ ఆధారిత సర్వీస్ రన్, సీఆర్‌సీ వంటి సాంకేతికత అంశాల మీద అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఆర్‌వోసీ డెన్నింగ్ కె. బాబు, అసిస్టెంట్ ఆర్‌వోసీ ఎల్. సాయి శంకర్, ఐసీఎస్‌ఐ అమరావ తి చాప్టర్ ప్రతినిధులు పి. ప్రకాశ్ రెడ్డి, జేవీ రామారావు, కె. శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.