
టోక్యో: సిమోన్ బైల్స్ లేకపోతేనేమి... సునిసా లీ ఉందిగా! అమెరికా జిమ్నాస్టిక్స్ అభిమానులు గురువారం సరిగ్గా ఇలాగే సంతోషించారు. మహిళల జిమ్నాస్టిక్స్ ఆల్ అరౌండ్‌లో యునైటెడ్ స్టేట్స్ (యూఎస్) తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. వరుసగా ఐదోసారి అమెరికా జిమ్నాస్ట్ ఈ ఈవెంట్‌లో స్వర్ణం సాధించింది. 18 ఏళ్ల సునిసా లీ అద్భుత విన్యాసాలతో చెలరేగి స్వర్ణ పతకం గెలుచుకుంది. ఆమె మొత్తం 57.433 పాయింట్లు స్కోర్ చేసింది. బైల్స్ గైర్హాజరులో తొలి స్థానంలో నిలవాలని ఆశించిన బ్రెజిల్ జిమ్నాస్ట్ రెబెకా ఆండ్రాడేకు నిరాశ తప్పలేదు. 57.298 పాయింట్లు సాధించిన ఆమె రజత పతకంతో సరిపెట్టుకుంది. ఏంజెలినా మెల్‌నికోవా (ఆర్‌ఓసీ) 57.199 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment