
టోక్యో: అమెరికా స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ తన అభిమానులను షాక్‌కు గురి చేసింది. గురువారం జరగనున్న వ్యక్తిగత ఆల్‌రౌండ్ ఫైనల్స్ నుంచి బైల్స్ తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. తన మానసిక ఆరోగ్యం సరిగా లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జిమ్నాస్టిక్స్‌లో ఆరుసార్లు ఒలింపిక్ మెడల్స్ గెలిచిన బైల్స్ ఈసారి కూడా హాట్ ఫెవరేట్‌గా బరిలోకి దిగింది. కాగా సోమవారం ఆమె ఉమెన్స్ టీమ్ ఫైనల్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా గురువారం జరగనున్న వ్యక్తిగత ఆల్‌రౌండ్ ఫైనల్ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ఆమె ప్రకటించింది.
ఆమె ప్రకటనపై అమెరికా జిమ్నాస్ట్ స్పందించింది. '' బైల్స్ మానసిక ఆరోగ్యం సరిగా లేదని.. వైద్యుల సూచన మేరకే ఆమె పోటీ నుంచి తప్పుకుందని'' పేర్కొంది. అయితే ప్రతీరోజు బైల్స్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించనున్నామని తెలిపింది. వచ్చే వారం జరిగే వ్యక్తిగత ఈవెంట్ ఫైనల్స్‌లో బైల్స్ పాల్గొంటుందో లేదో ఇప్పుడే చెప్పడం కష్టమని వెల్లడించింది. అయితే క్వాలిఫికేషన్స్ రౌండ్‌లో 9వ హైయ్యెస్ట్ స్కోర్ వచ్చిన జేడ్ క్యారీ బైల్స్ స్థానంలో ఆల్ రౌండ్ ఈవెంట్‌లో పాల్గొంటుందని అమెరికా జిమ్నాస్ట్ సంఘం తెలిపింది. కాగా బైల్స్ నిర్ణయం తాము గౌరవిస్తున్నామని మరో ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment