Simone Biles
-
Simone Biles: శరీరాన్ని విల్లులా వంచుతూ.. బ్యాలెన్సింగ్ బైల్స్
శరీరాన్ని విల్లులా వంచుతూ వాల్ట్పై ఆమె చేసే విన్యాసాలకు ప్రపంచం అచ్చెరువొందింది.. ఫ్లోర్ ఎక్సర్సైజ్లో తిరుగులేని ప్రదర్శన కనబర్చినప్పుడు అభిమానగణం జేజేలు కొట్టింది.. బ్యాలెన్స్ బీమ్‌పై ఆ అమ్మాయి ఆట క్షణాల పాటు అందరి గుండెలు ఆగిపోయేలా చేసిన ఘట్టాలు ఎన్నో! ఆమె బరిలోకి దిగితే చాలు పతకాల పంట పండుతుంది... ఎవరికీ సాధ్యం కాని రికార్డులు కొత్తగా వచ్చి చేరతాయి. ఇదీ అదీ అని లేకుండా తన ఆటతో 27 ఏళ్ల వయసులోనే జిమ్నాస్టిక్స్ ప్రపంచంలో అన్ని ఘనతలను అందుకున్న ఆ స్టార్ పేరే సిమోన్ బైల్స్! దశాబ్దకాలానికి పైగా జిమ్నాస్టిక్స్ అంటే ఆమె మాత్రమే అనేలా గుర్తింపు తెచ్చుకోవడం బైల్స్‌కు మాత్రమే చెల్లింది. కేవలం 4 అడుగుల 8 అంగుళాల ఎత్తుతోనే బైల్స్ సంచలనాలు సృష్టించగలిగింది.పారిస్ ఒలింపిక్స్ తర్వాత ‘సిమోన్.. నేను మీ అమ్మను. నన్ను క్షమించవా! గతం మరిచి నన్ను ఒక్కసారైనా కలుస్తావని ఆశిస్తున్నా..’ ఒక 52 ఏళ్ల మహిళ ఆవేదనతో బహిరంగంగా వెల్లడించిన కోరిక ఇది. ఆమె ఎవరో కాదు. దిగ్గజ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్‌కు కన్నతల్లి షెనాన్. 27 ఏళ్ల తర్వాత ఆమెకు ఇప్పుడు కూతురు గుర్తుకొచ్చింది. ఇన్నేళ్లలో ఆమె బైల్స్‌ను ఏ ఒక్క రోజూ గుర్తుచేసుకున్న పాపాన పోలేదు. పసిగుడ్డుగా ఉన్నప్పుడే వదిలేసి వెళ్లిపోయింది.తాత పెంపకంలో..షెనాన్ నలుగురు పిల్లల్లో బైల్స్ మూడో సంతానం. అయితే మరో పాప పుట్టాక షెనాన్ ఆల్కహాల్‌కు, డ్రగ్స్‌కు బానిసైంది. నలుగురు పిల్లలను అనాథాశ్రమంలో వదిలేసి వెళ్లిపోయింది. కొంతకాలం వరకు ఈ నలుగురు పిల్లల ఆచూకీ ఎవరికీ తెలియలేదు. ఎట్టకేలకు బైల్స్ తాత రాన్ (తల్లి షెనాన్ తండ్రి)కి వారి గురించి సమాచారం అందింది. దాంతో రాన్, ఆయన రెండో భార్య నెలీ కలసి బైల్స్, ఆమె చెల్లెలు ఏడ్రియాను, ఇద్దరు పెద్ద పిల్లలను రాన్ సోదరి దత్తత తీసుకొని పెంచుకున్నారు. ఇప్పటికీ వారినే బైల్స్ తన అమ్మానాన్నలుగా పిలుస్తుంది.సాధనమున పనులు..జిమ్నాస్టిక్స్‌లో బైల్స్ దిగ్గజంగా ఎదగడం వరకు రాన్, నెలీ ఎంతో ప్రోత్సహించారు. ఆరేళ్ల వయసులో టెక్సస్‌లో తమ ఇంటి సమీపంలో వారు సరదాగా సెలవుల్లో సిమోన్‌ను జిమ్నాస్టిక్స్‌లో చేర్పించారు. కానీ ఆమె ఆ వయసులోనే ఆటపై అమితాసక్తి కనబరుస్తూ ఒక్క క్లాస్‌కు కూడా గైర్హాజరు కాలేదు. అనారోగ్యంతో ఇంట్లో కూర్చోమని చెప్పినా సరే వెళ్లాల్సిందేనని పట్టుబట్టేది. తర్వాత ఆమెను పూర్తి స్థాయిలో జిమ్నాస్టిక్స్ శిక్షణ వైపు మళ్లించారు. ఎనిమిదేళ్ల వయసులో అమెరికాలో ప్రముఖ కోచ్‌లలో ఒకరైన ఐమీ బూర్మన్ వద్ద ట్రైనింగ్ మొదలు పెట్టిన బైల్స్ మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఆటపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు బైల్స్ స్కూల్ చదువుకు గుడ్‌బై చెప్పి హోమ్ స్కూలింగ్ వైపు మళ్లింది.జూనియర్‌గా రాణించి..బూర్మన్ శిక్షణలో రాటుదేలిన బైల్స్ జూనియర్ స్థాయిల్లో పోటీల్లో పాల్గొంటూ తన సత్తాను ప్రదర్శించేందుకు సిద్ధమైంది. ‘అమెరికన్ క్లాసిక్స్’ టోర్నీల్లో చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. వాల్ట్, బ్యాలెన్స్ బీమ్, ఫ్లోర్ ఎక్సర్సైజ్, అనీవెన్ బార్స్.. ఇలా జిమ్నాస్టిక్స్‌లో ఉండే వేర్వేరు ఈవెంట్లన్నింటిలోనూ బైల్స్ విన్యాసాలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. ఈ క్రమంలో అమెరికా జాతీయ జూనియర్ టీమ్‌లోనూ ఎంపికైంది. నిలకడైన ప్రదర్శనతో 16 ఏళ్ల వయసులో తొలిసారి యూఎస్ తరఫున సీనియర్ స్థాయి పోటీల్లో ఆడే అవకాశం బైల్స్‌కు దక్కింది. ఇటలీలో జరిగిన టోర్నీలో అమెరికా టీమ్ విజేతగా నిలవడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. అయితే కొద్ది రోజులకే జరిగిన మరో టోర్నీలో బైల్స్ కాలి మడమకు గాయం కావడంతో పోటీల్లో విఫలమైంది. కానీ కోలుకొని మళ్లీ జాతీయ పోటీల్లో సత్తా చాటిన బైల్స్‌కు మరో మహదావకాశం దక్కింది. అమెరికా తరఫున తొలిసారి వరల్డ్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఎంపికైన బైల్స్ కెరీర్ అప్పటి నుంచి శిఖరానికి చేరింది. విశ్వ వేదికలపై..బెల్జియంలోని ఆంట్వెర్ప్ వేదికగా వరల్డ్ చాంపియన్‌షిప్.. బెల్స్ ఖాతాలో 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం చేరాయి. ప్రతి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఇదే తరహా ప్రదర్శన. నానింగ్, గ్లాస్గో, దోహా, స్టట్గార్ట్, ఆంట్వెర్ప్.. 2013–23 మధ్య వరల్డ్ చాంపియన్‌షిప్ వేదిక మారినా, బైల్స్ ప్రదర్శనలో అదే జోరు కొనసాగింది. ఆరు చాంపియన్‌షిప్స్‌లో కలిపి ఏకంగా 23 స్వర్ణాలు, 4 రజతాలు, 3 కాంస్యాలు. ఇక మిగిలింది మరో విశ్వ క్రీడా వేదిక ఒలింపిక్స్‌ను జయించడమే! ఇక్కడా బైల్స్ తన అద్భుత ఆటను ప్రదర్శించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో 4 స్వర్ణాలు, 1 కాంస్యంతో ఆల్ రౌండర్‌గా నిలిచింది. 2020 టోక్యో ఒలింపిక్స్ సమయానికి స్టార్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన బైల్స్ 24 ఏళ్ల వయసులో తనపై ఉన్న అంచనాల ఒత్తిడిని తట్టుకోలేక టీమ్ ఫైనల్ పోటీ నుంచి తప్పుకుంది. అయితే ఈ క్రీడల్లోనూ ఆమె ఒక రజతం, ఒక కాంస్యం గెలవగలిగింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌కు వచ్చే సరికి మళ్లీ అన్ని రకాలుగా సన్నద్ధమై, 3 స్వర్ణాలు, ఒక రజతం సాధించింది.అనితరసాధ్యం..జిమ్నాస్టిక్స్లోని అత్యంత కఠినమైన ఈవెంట్లలోనూ అలవోకగా మార్కులు కొట్టేయడం బైల్స్‌కు మాత్రమే సాధ్యమైంది. మూడు విభాగాలు వాల్ట్, బ్యాలెన్స్ బీమ్, ఫ్లోర్ ఎక్సర్‌సైజ్‌లలో ‘బైల్స్’ పేరు మీదే ప్రత్యేక అంశాలు ఉండటం ఆమె గొప్పతనానికి నిదర్శనం. అతి ఎక్కువ కాఠిన్య స్థాయి, ప్రమాద తీవ్రత ఉన్న ఈ ఎక్సర్‌సైజ్‌లను ప్రపంచంలో బైల్స్ తప్ప మరే జిమ్నాస్ట్ ప్రదర్శించలేదు. తన కెరీర్ మంచిస్థితిలో ఉన్న దశలో అమెరికా జిమ్నాస్టిక్స్ టీమ్ ఫిజీషియన్ ల్యారీ నాసెర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే విషయంలో వెల్లడించి బైల్స్ వార్తల్లోకెక్కింది. మూడేళ్ల పాటు సహచర జిమ్నాస్ట్ స్టేసీ ఎర్విన్‌తో డేటింగ్ చేసిన బైల్స్.. గత ఏడాది అమెరికన్ ఫుట్‌బాల్ ప్లేయర్ జొనాథన్ ఓవెన్స్‌ను పెళ్లి చేసుకుంది. ఇప్పటికే మూడు ఒలింపిక్స్‌లలో పాల్గొన్న బైల్స్.. 2028లో సొంతగడ్డపై జరిగే ఒలింపిక్స్‌లో మరిన్ని విజయాలు అందుకునే అవకాశం ఉంది. – మొహమ్మద్ అబ్దుల్ హాది -
Simone Biles: ఒలింపిక్ లెజెండ్ - సింహం మెడలో మేక...
విమర్శలకు చాలా మంది కుంగిపోతుంటారు. ఆమెరికన్ ఆర్టిస్టిక్ జిమ్నాస్ట్ అయిన సిమోన్ అరియన్నే బైల్స్ ఓవెన్స్ మాత్రం విమర్శలనే సవాల్‌గా తీసుకుంది. పారిస్ ఒలింపిక్స్‌లో ఇటీవల జరిగిన ఆల్‌రౌండ్ ఈవెంట్లో స్వర్ణం సాధించింది. దీంతో తొమ్మిది ఒలింపిక్ పతకాలు, 30 ప్రపంచ ఛాంపియన్షిప్ పతకాలు ఆమె ఖాతాలో చేరి, ప్రపంచంలోనే అత్యధిక ఒలింపిక్ పతకాలు సాధించిన ఐదవ మహిళా ఒలింపిక్ జిమ్నాస్ట్‌గా పేరొందిందామె.27 ఏళ్ల సిమోన్ విజయం సాధించిన వెంటనే తన మెడలో మేక లాకెట్టుతో ఉన్న చైన్‌ను బయటకు తీసి అందరికీ చూపించింది. ‘చాలా మంది నన్ను ‘గోట్’ అని పిలుస్తుంటారు. నేను దానిని నెగిటివ్‌గా తీసుకోలేదు. ఈ గోట్లో కూడా ప్రత్యేకత ఉంది, అది ప్రపంచానికి చూపించాలనుకున్నాను. అందుకే ‘స్టఫ్డ్ గోట్’ను హారంగా మెడలో ధరించాను’ అంటూ గోట్ లాకెట్‌ను చేత్తో పట్టుకొని చూపిస్తూ అంది సిమోన్ బైల్స్.తొమ్మిదవ ఒలింపిక్ పతకాన్ని, ఆరవ స్వర్ణాన్ని సంపాదించినందుకు సిమోన్ ప్రదర్శనలో అభినందనలు దక్కాయి. అయితే, 2021లో జరిగిన టోక్యో గేమ్స్ నుండి చివరి నిమిషంలో వైదొలగడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె చేష్టల కారణంగా మరొక క్రీడాకారిణికి అవకాశం లేకుండా పోయిందని, జాత్యహంకారం, సెక్సిస్ట్, ట్రాన్స్‌ఫోబిక్, డ్రగ్ చీట్... అని ఎంతో మంది చేత నాడు విమర్శలను ఎదుర్కొంది. దీంతో కుటుంబంలో వచ్చిన సమస్యలు, మానసిక సమస్యలతో పోటీల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. అయినా ఆమెపైన విమర్శలు ఆగలేదు. ఆ సందర్భంలో ఆమెను ‘గోట్’ అంటూ హేళన చేశారు. అదే ఆమె ఇప్పుడు తన బలంగా మార్చుకుని, దాంతోనే పతకాన్ని సాధించ గలిగింది. -
బంగారు బైల్స్.. ప్యారిస్ ఒలిపింక్స్‌లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ (ఫోటోలు)
-
‘అథ్లెట్ ఆఫ్ ద ఇయర్’ సిమోన్ బైల్స్
విఖ్యాత టైమ్ మేగజైన్ 2021కి గానూ ‘అథ్లెట్ ఆఫ్ ద ఇయర్’గా అమెరికన్ స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్‌ను ఎంపిక చేసింది. నాలుగుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన బైల్స్ టోక్యో ఒలింపిక్స్ సమయంలో తాను ‘ద ట్విస్టీస్’తో బాధపడుతున్నట్లు చెప్పి నాలుగు బంగారు పతక ఈవెంట్ల నుంచి తప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అనంతరం అమెరికా జిమ్నాస్టిక్స్ టీమ్ మాజీ డాక్టర్ ల్యారీ నాసర్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ సెనేట్ ముందు సాక్ష్యం చెప్పింది. -
మరో రెండు ఈవెంట్స్ నుంచి వైదొలిగిన సిమోన్ బైల్స్
మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమెరికా మహిళా స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ టోక్యో ఒలింపిక్స్‌లో తన మెరుపు విన్యాసాన్ని పరిమిత ఈవెంట్లలోనే ప్రదర్శించాలని నిర్ణయించుకుంది. వాల్ట్‌లో డిఫెండింగ్ చాంపియన్ అయిన ఆమె... ఆ ఈవెంట్‌తో పాటు అన్ఈవెన్ బార్స్ నుంచి కూడా తప్పుకుంది. ఆదివారం ఈ రెండు ఈవెంట్లకు సంబంధించిన ఫైనల్ పోటీలు జరుగుతాయి. అయితే బ్యాలెన్స్ బీమ్, ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఈవెంట్లలో పాల్గొనే అవకాశముంది. ఈ రెండు ఈవెంట్లకు మరింత సమయం ఉండటంతో ఆలోపు మానసిక సమస్యలను అధిగమించవచ్చని ఆమె భావిస్తోంది. మంగళవారం జరిగిన టీమ్ ఈవెంట్ ఫైనల్స్ నుంచి ఈ 24 ఏళ్ల ఒలింపిక్ చాంపియన్ బైల్స్ అనూహ్యంగా తప్పుకున్న సంగతి తెలిసిందే! -
Simon Byles: విజయాలే భారమై...
టోక్యో: రియో ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలు, వివిధ వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో కలిపి ఏకంగా 19 స్వర్ణాలు... మొత్తంగా అంతర్జాతీయ వేదికపై 36 పతకాలతో జిమ్నాస్టిక్స్ చరిత్రలో అత్యుత్తమ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అమెరికా యువ తార సిమోన్ బైల్స్. ►టోక్యో ఒలింపిక్స్‌కు తమ దేశం తరఫున మరో సారి భారీ అంచనాలతో వెళ్లిన బైల్స్‌ను మానసిక సమస్యలు వీడటం లేదు. మంగళవారం టీమ్ ఈవెంట్ ఫైనల్లో ఒక్క ‘వాల్ట్’లోనే ఒకే ఒక ప్రయత్నం చేసి తప్పుకున్న బైల్స్... గురువారం జరిగే ఆల్ ఆరౌండ్ ఈవెంట్లో కూడా పాల్గొనడం లేదని ప్రకటించింది. ప్రస్తుతం తాను మానసికంగా సిద్ధంగా లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించింది. వచ్చేవారంలో జరిగే వ్యక్తిగత ఈవెంట్లలో కూడా ఆమె పాల్గొంటుందా లేదా అనేదానిపై స్పష్టత రాలేదు. ప్రతీ రోజు ఆమె ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన అనంతరమే నిర్ణయం తీసుకుంటా మని అమెరికా ఒలింపిక్ వర్గాలు వెల్లడించాయి. ఒత్తిడి పెరిగిపోయిందా..! జాగ్రత్తగా చూస్తే బైల్స్ పాల్గొనే ఈవెంట్లలో ఆమె ధరించే డ్రెస్‌పై ఏదో ఒక మూల ‘మేక’ బొమ్మ ము ద్రించి ఉంటుంది. ఇది ఏదో రాశిని బట్టి పెట్టుకు న్నది కాదు... ఎౖఅఖీ (ఎట్ఛ్చ్ట్ఛట్ట ౖజ అ ∙ఖీజీఝ్ఛ)... చరిత్రలో అత్యుత్తమ ప్లేయర్ అని గుర్తు చేయడం దాని ఉద్దేశం! ఒలింపిక్స్‌లో తన సత్తా చాటేందుకు ఆమె టోక్యో బయల్దేరినప్పుడు అమెరికా విమానయాన సంస్థ ‘యునైటెడ్’ కూడా ఫ్లయిట్లో ఇలాంటి వస్తువులే ఇచ్చి గౌరవం ప్రదర్శించుకుంది. మైకేల్ ఫెల్ప్స్ లాంటి దిగ్గజం లేకపోవడంతో అమెరికా దేశానికి ఈ ఒలింపిక్స్‌లో ఆమె ఒక ‘ముఖచిత్రం’ తరహాలో మారిపోయింది. ► ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు ముందు ఒకవైపు తన బ్రాండ్ పేరును కాపాడుకోవాలి. స్పాన్సర్లను సంతోషపెట్టాలి. అటు అభిమానులను అలరించాలి. ఇటు ఇంటా, బయటా విమర్శకులకు సమాధానమివ్వాలి. ఇదంతా 24 ఏళ్ల బైల్స్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచింది. టోక్యోలో ఆమె మానసికంగా కుప్పకూలిపోవడం అనూహ్యమేమీ కాదు. ► ‘రియో’ విజయాల తర్వాత చాలాసార్లు ఆమె మానసికంగా ఆందోళనకు గురైంది. కిడ్నీలో రాయితో ఇబ్బంది పడుతున్న దశలో కూడా అందరి కోసం ఆమె 2018 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగాల్సి వచ్చింది. కరోనా సమయంలో హ్యూస్టన్‌లోని తన ఇంట్లో ఉన్న సమయంలో వరుసగా పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు రావడం, అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడగడం బైల్స్‌ను బాగా ఇబ్బంది పెట్టింది (జపాన్ టెన్నిస్ స్టార్ నయోమి ఒసాకా కూడా ఇదే కారణం చెబుతూ ఫ్రెంచ్ ఓపెన్‌లో తప్పుకుంది). ► అమెరికా ఒలింపిక్స్ ట్రయల్స్ సందర్భంగా ఆమె సహచరి సునీసా లీకంటే కూడా బైల్స్ వెనుకబడింది. గత ఎనిమిదేళ్లలో ఇలా జరగలేదు. గత రియో ఒలింపిక్స్‌లో బైల్స్‌పై ఏ ఒత్తిడి లేదు. స్వేచ్ఛగా, చలాకీగా విన్యాసాలు ప్రదర్శిస్తూ పతకాలు కొల్లగొట్టింది. ► తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లో మంగళవారం ‘వాల్ట్’ విన్యాసం చేసినప్పుడు ఆమెలో ఉత్సా హం కనిపించలేదు. 2 1/2 ట్విస్ట్‌లు చేయాల్సిన చోట 1 1/2 ట్విస్ట్‌కే పరిమితమైంది. సరిగ్గా చెప్పాలంటే కాస్త గట్టిగా ప్రయత్నిస్తే ఏమైనా దెబ్బలు తగులుతాయేమో అని భయపడే కొత్త జిమ్నాస్ట్లాగా కనిపించింది. ఎంతో సాధించిన తర్వాత ఇంకా రిస్క్ చేసి ప్రమాదం కొనితెచ్చుకోవడం ఎందుకనే భావన ఆమె వ్యాఖ్యల్లోనూ వినిపించింది. తాను పూర్తి స్థాయిలో ఆత్మవిశ్వాసంతో లేకపోయినా సరే... అందరినీ సంతృప్తిపరచడం కోసమే బైల్స్ ఒలింపిక్స్‌కు వచ్చినట్లుగా కనిపిస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే వ్యక్తిగత విభాగంలోనూ ఆమె పోటీ పడకపోవచ్చు! ప్రస్తుత పరిస్థితుల్లో కాస్త కుదురుగా కూర్చొని నా మానసిన సమస్యలను పరిష్కరించుకుంటే మంచిదని అనిపించింది. వివరంగా చెప్పలేను కానీ కొన్ని అంశాల్లో నా ఇబ్బందులు కొనసాగుతున్నాయి. నాకు ఎలాంటి గాయం లేదు. మనసు ఎక్కడో ఉండి బరిలోకి దిగి... లేని గాయాలు తెచ్చుకునే పిచ్చి పనిని నేను చేయదల్చుకోలేదు. ఒలింపిక్స్‌కు వచ్చాక నేను నా కోసం కాకుండా ఇంకెవరి కోసమే ఆడుతున్నట్లు అనిపించింది. ఇది నన్ను బాధించింది. పేరు ప్రతిష్టలను పక్కన పెట్టి నా ఆరోగ్యానికి ఏది సరైందో ఆ నిర్ణయం తీసుకోవడం అవసరం. మళ్లీ పోటీల్లో పాల్గొంటానో లేదో చివరి నిమిషం వరకు చెప్పలేను. –సిమోన్ బైల్స్, అమెరికా జిమ్నాస్ట్ -
Simone Biles: మానసిక ఆరోగ్యం బాలేదు.. అందుకే తప్పుకుంటున్నా
టోక్యో: అమెరికా స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ తన అభిమానులను షాక్‌కు గురి చేసింది. గురువారం జరగనున్న వ్యక్తిగత ఆల్‌రౌండ్ ఫైనల్స్ నుంచి బైల్స్ తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. తన మానసిక ఆరోగ్యం సరిగా లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జిమ్నాస్టిక్స్‌లో ఆరుసార్లు ఒలింపిక్ మెడల్స్ గెలిచిన బైల్స్ ఈసారి కూడా హాట్ ఫెవరేట్‌గా బరిలోకి దిగింది. కాగా సోమవారం ఆమె ఉమెన్స్ టీమ్ ఫైనల్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా గురువారం జరగనున్న వ్యక్తిగత ఆల్‌రౌండ్ ఫైనల్ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ఆమె ప్రకటించింది. ఆమె ప్రకటనపై అమెరికా జిమ్నాస్ట్ స్పందించింది. '' బైల్స్ మానసిక ఆరోగ్యం సరిగా లేదని.. వైద్యుల సూచన మేరకే ఆమె పోటీ నుంచి తప్పుకుందని'' పేర్కొంది. అయితే ప్రతీరోజు బైల్స్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించనున్నామని తెలిపింది. వచ్చే వారం జరిగే వ్యక్తిగత ఈవెంట్ ఫైనల్స్‌లో బైల్స్ పాల్గొంటుందో లేదో ఇప్పుడే చెప్పడం కష్టమని వెల్లడించింది. అయితే క్వాలిఫికేషన్స్ రౌండ్లో 9వ హైయ్యెస్ట్ స్కోర్ వచ్చిన జేడ్ క్యారీ బైల్స్ స్థానంలో ఆల్ రౌండ్ ఈవెంట్లో పాల్గొంటుందని అమెరికా జిమ్నాస్ట్ సంఘం తెలిపింది. కాగా బైల్స్ నిర్ణయం తాము గౌరవిస్తున్నామని మరో ప్రకటనలో పేర్కొంది. -
అరుదైన విన్యాసాలతో కొత్త చరిత్ర
-
అరుదైన విన్యాసాలతో కొత్త చరిత్ర
స్టుట్గార్ట్ (జర్మనీ): ఐదుసార్లు ఒలింపిక్ విజేత, 14 సార్లు ప్రపంచ చాంపియన్ అయిన అమెరికా జిమ్నాస్టిక్స్ సంచలనం సిమోన్ బైల్స్ మరోసారి అత్యద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అంతేకాకుండా సరికొత్త ప్రదర్శనతో ఆటకే వన్నె తెచ్చారు బైల్స్. 22 ఏళ్లకే ప్రపంచ జిమ్నాస్టిక్స్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న బైల్స్ .. ఎన్నో పతకాలు ఖాతాలో వేసుకున్నారు. గుండె గుబేల్మనిపించే విన్యాసాలు చేసే ఈ అమ్మాయి.. తాజాగా వరల్డ్ ఆర్టిస్టిక్ చాంపియన్‌షిప్‌లో పోటీపడ్డ మొదటి రోజే చరిత్రలో నిలిచిపోయే ప్రదర్శరతో చూపరులను ఆకట్టుకున్నారు. గంటల వ్యవధిలో రెండు విన్యాసాలను తన పేరిట లిఖించుకున్నారు. ఫ్లోర్ ఎక్సర్సైజ్ క్వాలిఫికేషన్లో బైల్స్.. ట్రిపుల్ -డబుల్ స్కిల్‌ను ప్రదర్శించారు. దీనికి ‘బైల్స్ 2’అని పేరు పెట్టారు. ఆపై, బీమ్‌లో డబుల్-ట్విస్టింగ్ డబుల్ టక్ డిస్మౌంట్ను ప్రదర్శన చేశాడు బైల్స్. జిమ్నాస్టిక్స్‌లో మొట్టమొదటగా చేసిన ఈ విన్యాసాన్ని ఇకపై‘ బైల్స్’అని పిలవనున్నారు.(ఇక్కడ చదవండి: భారత జిమ్నాస్ట్స్ విఫలం) ఇటీవల జరిగిన యూఎస్ జిమ్నాస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఫ్లోర్ రొటీన్ ఈవెంట్లో అత్యంత క్లిష్టమైన ట్రిపుల్-డబుల్ విన్యాసం చేసిన బైల్స్ సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఫ్లోర్ ఈవెంట్లో ట్రిపుల్-డబుల్ అంటే.. గాలిలోకి ఎగిరి కిందకు ల్యాండ్ అయ్యే క్రమంలో శరీరాన్ని రెండుసార్లు బ్యాక్ ఫ్లిప్ చేస్తూ మూడుసార్లు ట్విస్ట్ చేయడం. అత్యంత అరుదైన, సాహసోపేతమైన ఈ అద్భుత విన్యాసాన్ని 22 ఏళ్ల బైల్స్ ఆవిష్కృతం చేసి సంచలనం సృష్టించారు. తాజాగా ఈ అరుదైన విన్యాసాలను మరోసారి ప్రదర్శించి దానికి తన పేరునే లిఖించుకున్న బైల్స్ కొత్త చరిత్ర సృష్టించారు. Simone Biles gets a second skill named after her tonight, this one her double-double dismount off the balance beam. Biles took issue with the point value an FIG committee awarded it, calling it bullshit. Note the claps in front of the judges. pic.twitter.com/AvUu8ddTxc — Nick Zaccardi (@nzaccardi) October 5, 2019 -
బైల్స్ పై గెలవడమే లక్ష్యంగా..
కోల్‌కతా: రియో ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ వాల్ట్ విభాగంలో తృటిలో కాంస్య పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయిన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ తదుపరి లక్ష్యం వరల్డ్ నంబర్‌వన్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్‌ను ఓడించడమేనట. అమెరికాకు చెందిన బైల్స్‌పై గెలవడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నట్లు దీపా తాజాగా పేర్కొంది. రియోలో వాల్ట్ జిమ్నాస్టిక్స్‌లో పసిడి సాధించిన బైల్సే తాను చూసిన మహిళా జిమ్నాస్ట్ల్లో అత్యుత్తమం అంటూ దీపా కితాబిచ్చింది. 'ఆమె కంటే నేను ఉత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయాను. కాకపోతే బైల్స్‌ను ఓడించడానికి ఇప్పట్నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. అదే లక్ష్యంగా ప్రిపరేషన్ మొదలుపెట్టా. ఆమెను ఓడించడమే నా తదుపరి లక్ష్యం' అని దీపా పేర్కొంది. నగరంలో స్థానికంగా జరిగిన దుర్గా పూజా కార్యక్రమంలో పాల్గొన్న దీప.. తన రియో ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే రియోలో పతకం సాధించకపోవడంతో యావత్ భారతావనిని నిరాశకు లోనైన విషయం తనకు తెలుసని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. తాను పతకం గెలిచి ఉంటే దాన్ని దేశానికి అంకింత ఇచ్చేదానని దీప పేర్కొంది.