![Priyanka gets five medals - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/1/Gymnastics.jpg.webp?itok=VmA_pYou)
సాక్షి, హైదరాబాద్: జాతీయ రిథమిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి కె. ప్రియాంక సాగర్ మెరిసింది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో ఐదు పతకాలను సాధించింది. సీనియర్ విభాగంలో జరిగిన హూప్, బాల్, క్లబ్, రిబ్బన్, ఆల్‌రౌండ్ ఈవెంట్లలో మూడో స్థానంలో నిలిచిన ప్రియాంక ఐదు కాంస్యాలను తన ఖాతాలో వేసుకుంది. టీమ్ విభాగంలో మహారాష్ట్ర జట్టు విజేతగా నిలవగా... ఛత్తీస్‌గఢ్, హరియాణా జట్లు వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి.
వ్యక్తిగత ఆల్‌రౌండ్ విభాగంలో అదితి దండేకర్ (మహారాష్ట్ర), దిశా (మహారాష్ట్ర), కె. ప్రియాంక (తెలంగాణ)... హూప్ ఈవెంట్‌లో అదితి దండేకర్, కిమాయ కదమ్ (మహారాష్ట్ర), కె. ప్రియాంక... బాల్ ఈవెంట్‌లో అదితి , దిశా, ప్రియాంక... క్లబ్ ఈవెంట్‌లో కిమాయ కదమ్, దిశా, ప్రియాంక... రిబ్బన్ విభాగంలో అదితి, దిశా, ప్రియాంక వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు కె. రంగారావు, కార్యదర్శి ప్రేమ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment