సంగారెడ్డి టౌన్: అండర్ 14, 17 చెస్, జిమ్నాస్టిక్ క్రీడా జట్ల ఎంపిక ఈ నెల 15న జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మైదానంలో జరుగుతుందని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. క్రీడాకారులు బోనఫైడ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డుతోపాటు నాలుగు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, చెస్ క్రీడాకారులు చెస్ బోర్డులతో గురువారం ఉదయం 10 గంటలకు మైదానంలో హాజరు కావాలన్నారు. ఇతర వివరాలకు సెల్ నం. 9866140016, 9493676216లో సంప్రదించాలని సూచించారు.