తలకు తగిలిన గాయం కారణంగా ఆరు నెలల పాటు తన జీవితంలో ఏం జరిగిందో తనకు గుర్తు లేదు అంటున్నారు బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని. సినిమాల తర్వాత దిశా పటాని ఎక్కువగా వర్కవుట్ వీడియోలు, ఫిట్నెస్‌కు సంబంధించిన విషయాల గురించే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. షూటింగ్ నుంచి ఏ మాత్రం విరామం దొరికినా జిమ్‌లో ప్రత్యక్షం అయ్యే దిశా.. ప్రస్తుతం జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఈ విషయం గురించి దిశా మాట్లాడుతూ.. ‘20 ఏళ్ల లోపే జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడం ప్రారంభిస్తే మేలు. గత మూడేళ్ల నుంచి నేను జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. దాంతో పాటు మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటున్నాను. జిమ్నాస్టిక్స్ సాధన చేయాలంటే ఎంతో ధైర్యం, శక్తి కావాలి. సాధన సమయంలో దెబ్బలు తగులుతాయి. కాళ్లు, చేతులు కూడా విరుగుతాయి. కొన్ని నెలల క్రితం జిమ్నాస్టిక్స్ చేస్తుండగా.. కింద పడ్డాను. తలకు గాయమైంది. కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టింది. అయితే ఆ ఆరు నెలల్లో నా జీవితంలో ఏం జరిగిందో నాకు గుర్తు లేదు. ఓ రకంగా చెప్పాలంటే ఆరు నెలల జీవితాన్ని నేను కోల్పోయాను’ అని చెప్పుకొచ్చారు దిశా. కాగా సల్మాన్ ఖాన్ ‘భారత్’ సినిమా షూటింగ్‌లో దిశా జిమ్నాస్టిక్ విన్యాసాలు చేస్తుండగా ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇక కెరీర్ విషయానికొస్తే దిశ ప్రస్తుతం.. ఆదిత్య రాయ్ కపూర్‌తో కలిసి ‘మళంగ్’ చిత్రంలో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment