
బాకు (అజర్‌బైజా¯Œ ): ప్రపంచకప్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ టోర్నమెంట్‌లో భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌కు నిరాశ ఎదురైంది. ఇప్పటికే వాల్ట్ విభాగంలో ఫైనల్‌కు అర్హత పొందిన ఆమె బ్యాలెన్సింగ్ బీమ్ విభాగంలో మాత్రం తడబడింది. త్రిపురకు చెందిన 25 ఏళ్ల దీపా శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్‌లో 10.633 పాయింట్లు స్కోరు చేసి 25 మందిలో 20వ స్థానాన్ని సంపాదించింది.
ఎమ్మా నెదోవ్ (ఆస్ట్రేలియా–13.466 పాయింట్లు) అందరికంటే ఎక్కువ స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. టాప్–8లో నిలిచిన వారికి ఫైనల్ బెర్త్ లభిస్తుంది. నేడు జరిగే వాల్ట్ ఫైనల్లో దీపా పతకమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.