Dipa Karmakar
-
జిమ్నాస్టిక్స్‌లో వెలిగిన దీపం
ఆరేళ్ల వయసులోనే ఆ అమ్మాయి జిమ్నాస్టిక్స్ వైపు ఆకర్షితురాలైంది. అయితే ఆమె పాదం కింది భాగం చూస్తే సమతలంగా ఉంది. ఈ ఆటకు ఇలాంటి పాదం పనికి రాదని, జంప్ చేసే సమయంలో ఇబ్బంది కలుగుతుందని స్థానిక కోచ్‌లు చెప్పేశారు. కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కోచ్‌గా ఉన్న బిశ్వేశ్వర్ నంది మాత్రం ఆ అమ్మాయిలో చురుకుదనాన్ని గుర్తించాడు. తాను ఆమె లోపాన్ని ఎలాగైనా సరిదిద్ది మరీ ఆటలో తీర్చిదిద్దుతానని ఆమె తండ్రికి మాటిచ్చాడు. అక్కడి నుంచి మొదలైన ఆ చిన్నారి ప్రస్థానం ఆపై భారత జిమ్నాస్టిక్స్ చరిత్రలో అత్యుత్తమ ప్లేయర్‌గా నిలిచే వరకు సాగింది. ఆ అమ్మాయే దీపా కర్మాకర్. 16 ఏళ్ల సుదీర్ఘ శ్రమ తర్వాత తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దీప.. ఎన్నో అరుదైన రికార్డులను, గతంలో ఎవరికీ సాధ్యం కాని మరెన్నో ఘనతలను నమోదు చేసింది.ఓడినా విజేతగా నిలిచి..ప్రొడునోవా వాల్ట్.. జిమ్నాస్టిక్స్‌లో అత్యంత కఠినమైన, ప్రమాదకరమైన ఈవెంట్. ప్రపంచ జిమ్నాస్టిక్స్ చరిత్రలో ఐదుగురు మాత్రమే ఈ ఈవెంట్‌ను విజయవంతంగా పూర్తి చేయగలిగారు. వారిలో దీప కూడా ఉంది. 2016 రియో ఒలింపిక్స్‌లో ఆమె ఈ విన్యాసాన్ని చేసి చూపించింది. తన సత్తాను చాటింది. అప్పటి వరకు మన దేశం నుంచి.. ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో మహిళల విభాగంలో ఎవరూ కనీసం అర్హత కూడా సాధించలేకపోయారు. అది దీపకు మాత్రమే సాధ్యమైంది. ఆపై ఫైనల్‌కు కూడా చేరిన ఆమె తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. కానీ దురదృష్టవశాత్తు 0.15 పాయింట్ల తేడాతో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్యం చేజార్చుకుంది. అయితేనేమి.. ఆమె ఘనతను అందరూ గుర్తించారు. అందుకే పతకాలు గెలుచుకున్నవారితో సమానంగా ఆమెకూ అభినందనలు, ప్రశంసలు, ప్రోత్సాహకాలు లభించాయి. ఒలింపిక్ పతకం గెలవకపోయినా ఆటలో తన 17 ఏళ్ల కష్టానికి దక్కిన ప్రతిఫలంతో దీప కన్నీళ్లపర్యంతమైంది. ఈ క్రమంలో సహజంగానే ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ.. దీపను వరించాయి. జాతీయ స్థాయిలో..త్రిపుర రాజధాని అగర్తలా దీప స్వస్థలం. తండ్రి ప్రోత్సాహంతో ఆటల వైపు ఆసక్తి చూపించిన ఆమె బిశ్వేశ్వర్ నంది అండగా నిలవడంతో పూర్తి స్థాయిలో జిమ్నాస్టిక్స్‌పై దృష్టి సారించింది. కఠోర శ్రమ, ప్రాక్టీస్ తర్వాత తన సమతల పాదం లోపాన్నీ అధిగమించిన దీపకు ఆపై ఎలాంటి ఇబ్బందీ తలెత్తలేదు. స్థానికంగా చిన్న చిన్న టోర్నీల్లో విజయాలు సాధించిన తర్వాత 15 ఏళ్ల వయసులో దీప పేరు తొలిసారి పెద్ద స్థాయికి చేరింది. బెంగాల్‌లోని జల్పాయీగుడీలో జరిగిన జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో ఆమె విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఆమె తన సాధనకు మరింత పదును పెట్టింది. ఫలితంగా సీనియర్ టీమ్‌లోకి పిలుపు వచ్చింది. రెండేళ్ల తర్వాత న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడలకు ఎంపిక చేసిన భారత జట్టులో దీపకు చోటు దక్కింది. అయితే పోటీల్లో పాల్గొనే అవకాశం మాత్రం రాలేదు. కానీ తర్వాతి ఏడాది జాతీయ క్రీడల్లో త్రిపుర తరఫున పాల్గొని అందుబాటులో ఉన్న నాలుగు స్వర్ణాలనూ దీప గెలుచుకోవడం విశేషం. విమర్శలను దాటి..అంతర్జాతీయ స్థాయికి వచ్చేసరికి దీప ఏం చేసినా అది భారత్ తరఫున మొదటి ఘనతగానే నమోదైంది. 2014 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం సాధించిన దీప ఈ క్రీడల్లో పతకం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్‌గా నిలిచింది. తర్వాతి ఏడాదే ప్రతిష్ఠాత్మక ఆసియా చాంపియన్‌షిప్‌లో కూడా ఆమె కాంస్యం గెలుచుకుంది. ఆ తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తన అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తూ ఐదో స్థానం సాధించింది. ఇదే ఆమెను రియో ఒలింపిక్స్ దిశగా తీసుకెళ్లింది. ‘నా గురించి విమర్శలు వచ్చిన ప్రతిసారి వారికి నా ఆటతోనే సమాధానం ఇచ్చాను. 2014లో ప్రొడునోవా మొదలుపెట్టినప్పుడు నన్ను బఫెలో అంటూ చాలా మంది ఆట పట్టించారు. వెంటనే కామన్వెల్త్ పతకం సాధించి చూపించాను. వయసు అయిపోయింది, ఆటలో దమ్ము లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు 31 ఏళ్ల వయసులో ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి చూపించాను. ఇలాంటి ముగింపు ఇవ్వాలనే ఇంతకాలం ఆగాను. ఇప్పుడు సంతృప్తిగా ఉంది’ అంటూ దీప తన రిటైర్మెంట్ సమయంలో వెల్లడించింది. వండర్‌ఫుల్‌గా ముగించి..తన ఆత్మకథ స్మాల్ వండర్‌లో ఆమె తన కెరీర్‌లోని పలు మలుపుల గురించి చెప్పుకుంది. రియో ఒలింపిక్స్ తర్వాత ఒక్కసారిగా స్టార్ ప్లేయర్ హోదా వచ్చినా ఆ తర్వాత పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. వరుస గాయాలతో ఆమె దాదాపు రెండేళ్ల పాటు ఆటకు దూరం కావాల్సి వచ్చింది. పైగా పెద్ద స్థాయి వ్యక్తుల నుంచి మద్దతు దక్కకపోవడంతో ట్రయల్స్‌లో అగ్ర స్థానంలో నిలిచినా పలు సాకులు వెతికి ఆమెను ఆసియా క్రీడలకు పంపకుండా ఫెడరేషన్ నిలిపివేసింది. ఇలాంటి కఠిన సమయాల్లో తాను మానసికంగా మరింత దృఢంగా తయారైంది. విరామం తర్వాత 2018లో రెండు పెద్ద విజయాలతో ఆమె తన సత్తా చాటింది. రెండు వరల్డ్ కప్‌లలో వరుసగా స్వర్ణం, కాంస్యం గెలిచి ఘనంగా పునరాగమనం చేసింది. ఆస్తమా, దగ్గు కోసం వాడే హైజినమైన్ మందును అనుకోకుండా తీసుకొని నిషేధానికి గురైనప్పుడు ఆమెకు ఎక్కడా కనీస మద్దతు లభించలేదు. ఈ ఘటన తర్వాత మళ్లీ తానేంటో నిరూపించుకోవాలనే పట్టుదల ఆమెలో కనిపించింది. 30 ఏళ్లు దాటినా.. అదే జిమ్నాస్టిక్స్ బార్‌పై తీవ్రంగా సాధన చేసింది. 2024 మేలో తాష్కెంట్లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్ బరిలోకి దిగి స్వర్ణ పతకంతో మెరిసి.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచింది. ఈ టోర్నీకి ముందు ‘నేను ఇంకా బతికే ఉన్నానని చాటాలనిపించింది. అందుకే పోటీ పడుతున్నా’ అని భావోద్వేగంతో చెప్పిన దీప సగర్వంగా తన కెరీర్‌ను ముగించి భవిష్యత్ తరాలకు జిమ్నాస్టిక్స్‌లో వెలుగుల దారి చూపించింది. -
#DipaKarmakar : సూపర్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ (ఫొటోలు)
-
రిటైర్మెంట్ ప్రకటించిన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్
భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ సంచలన నిర్ణయం తీసుకుంది. జిమ్నాస్టిక్స్‌కు దీపా రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. రిటైర్మెంట్ తర్వాత కర్మాకర్ కోచ్‌గా లేదా మెంటార్ తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది."జిమ్నాస్టిక్స్ నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. చాలా ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. ఇది అంత తేలికైన నిర్ణయం కాదు. కానీ నా కెరీర్‌కు విడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నాను. జిమ్నాస్టిక్స్ నా జీవితంలో ఒక భాగం. నా కెరీర్లో ఎన్నో ఎత్తు పల్లాలు చవిచూశాను. నాకు ఐదేళ్లు ఉన్నప్పుడు నా ఫ్లాట్ ఫుట్ కారణంగా జిమ్నాస్ట్ కాలేనని చాలా మంది అన్నారు. కానీ ఇప్పుడు నా విజయాలను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ప్రపంచ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం, పతకాలు సాధించడం నాకు ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా రియో ఒలింపిక్స్‌లో ప్రొడునోవా వాల్ట్‌ను ప్రదర్శించడం నా కెరీర్లో మరపురాని క్షణాల్లో ఒకటి" అని తన రిటైర్మెంట్ నోట్లో దీపా పేర్కొంది. కాగా 2011 నేషనల్ గేమ్స్‌లో నాలుగు ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించడంతో కర్మాకర్ ఓవర్ నైట్ స్టార్‌గా మారింది. ఆ తర్వాత ఆసియన్ గేమ్స్‌లోనూ గోల్డ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఆసియన్ గేమ్స్‌లో పసిడి పతకం సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా దీపా నిలిచింది. రియో ఒలిపింక్స్‌లో తృటిలో కాంస్య పతకాన్ని ఆమె చేజార్చుకుంది. దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో 77 పతకాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే పారిస్ ఒలిపింక్స్ ఆర్హత సాధించడంలో 31 ఏళ్ల దీపా విఫలమైంది.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ -
ఆనంద్ మహీంద్రా మండే మోటివేషన్.. ట్వీట్ వైరల్
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటిలాగే ఈ రోజు కూడా మండే మోటివేషన్ పేరుతో తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో జిమ్నాస్ట్ 'దీపా కర్మాకర్' కథనాన్ని హైలెట్ చేస్తూ ట్వీట్ చేశారు.ఏషియన్ సీనియర్ ఛాంపియన్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్ ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంది. కొంతకాలం క్రితం మోకాలికి గాయమైనప్పటికీ.. ఆటపైన ఉన్న మమకారమే ఆమెను ముందుకు నడిపించి విజయం సాధించేలా చేసాయి. ఆమె అలాగే ముందుకు దూసుకెళ్లాలని కోరుకుంటున్నా.. అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.ఆనంద్ మహీంద్రా ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆటపై ఉన్న మమకారం, దీపా కర్మాకర్ గెలుపు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిందని పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.And more #MondayMotivationJust back in March, @DipaKarmakar was talking about her injury & the hurdles she had to cross. It was the love for the sport, she said, which keeps her going.And yesterday she became the 1⃣st 🇮🇳 gymnast to win🥇at the prestigious Asian championship,… https://t.co/jMXzjp7G9P pic.twitter.com/l4OPrOMbaT— anand mahindra (@anandmahindra) May 27, 2024 -
#Dipa Karmakar: ఎనిమిదేళ్ల తర్వాత జాతీయ జిమ్నాస్టిక్స్ పోటీల్లో...
భారత మహిళా స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఎనిమిదేళ్ల తర్వాత జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో పోటీపడనుంది. జనవరి 2 నుంచి భువనేశ్వర్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. 30 ఏళ్ల దీపా 2016 రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంతో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మోకాలి గాయంతో ఆటకు దూరమైంది. పునరాగమనం తర్వాత డోపింగ్ పరీక్షలో పట్టుబడి 21 నెలలపాటు నిషేధానికి గురైంది. నిషేధం గడువు పూర్తి కావడంతో ఆమె మళ్లీ బరిలోకి దిగుతోంది. -
డోపింగ్ టెస్టులో ఫెయిల్.. స్టార్ అథ్లెట్‌పై రెండేళ్ల నిషేధం!
భారత జిమ్నాస్టిక్స్ అథ్లెట్ దీపా కర్మాకర్ డోపింగ్ టెస్టులో ఫెయిల్ అయ్యింది. యాంటీ డోపింగ్ టెస్టులో ఫెయిల్ కావడంతో రెండేళ్ల నిషేధానికి గురయ్యే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ (ఎఫ్ఐజీ), జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (జీఎఫ్ఐ), నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (WADA) నిర్దేశించిన మార్గదర్శకాలను దీపా కర్మాకర్ అనుసరించడంలో ఫెయిల్ అయ్యిందని సమాచారం. అయితే శాయ్(SAI) కానీ.. భారత జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ కానీ దీపా కర్మాకర్ నిషేధం గురించి అధికారిక ప్రకటన చేయలేదు. జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనే అథ్లెట్లు రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్టీపీ) కింద రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా రిజిస్టర్ అయిన ప్రతీ అథ్లెట్, ప్రతీ ఏడాది యాంటీ డోపింగ్ టెస్టు కోసం నమూనాలు సమర్పించాల్సి ఉంటుంది. సాంపిల్స్ సమర్పించకపోతే వారిపై ఏడాది నుంచి రెండేళ్ల వరకూ నిషేధం పడుతుంది. ఇక 2016 రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన దీపా కర్మాకర్ తృటిలో పతకం మిస్ చేసుకున్న సంగతి తెలిసిందే. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం, 2015 ఏషియన్ ఛాంపియన్‌షిప్స్‌లో దీపా కర్మాకర్ రజతం సాధించింది. 2018 అర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్‌లో మెర్సిన్‌లో స్వర్ణం గెలిచిన ఆమె కొట్బస్లో రజతం సాధించింది. 2015లో అర్జున అవార్డుని పొందిన దీపా కర్మాకర్.. 2016లో ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు సొంతం చేసుకుంది. -
జిమ్నాస్ట్ మెరిక... సాధన షురూ ఇక
అగర్తలా (త్రిపుర): కరోనా లాక్‌డౌన్‌తో దేశంలోని అన్ని స్టేడియాలు మూతపడ్డాయి. దాంతో క్రీడాకారులందరూ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. దేశంలో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమయ్యాక మూడో దశ సడలింపుల్లో భాగంగా స్టేడియాల్లో క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకోవచ్చని అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్‌లో స్టార్ బ్యాడ్మింటన్ ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టగా... తాజాగా త్రిపుర రాజధాని అగర్తలాలో భారత మేటి మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌తోపాటు ఇతర జిమ్నాస్ట్‌లు తమ సాధన ప్రారంభించారు. స్థానిక నేతాజీ సుభాష్ రీజినల్ కోచింగ్ సెంటర్ (ఎన్‌ఎస్‌ఆర్‌సీసీ) ఇండోర్ స్టేడియంలో దీపా కర్మాకర్ తన కోచ్ బిశ్వేశ్వర్ నందితో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టింది. 2016 రియో ఒలింపిక్స్‌లో వాల్టింగ్ ఈవెంట్లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకం కోల్పోయిన దీపా కర్మాకర్ ఆ తర్వాత గాయాలబారిన పడి మరో మెగా ఈవెంట్లో బరిలోకి దిగలేకపోయింది. ‘మార్చి 16న జిమ్నాజియం మూతపడింది. ఐదున్నర నెలలు ఇంట్లోనే గడిపా. సుదీర్ఘకాలంపాటు క్రీడా పరికరాలకు దూరంగా ఉంటే క్రీడాకారులందరికీ ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది. అయితే ట్రైనింగ్ లేని సమయంలో నా వ్యక్తిగత కోచ్ బిశ్వేశ్వర్ నంది ఆన్లైన్లో ఫిట్నెస్ తరగతులు తీసుకున్నారు’ అని దీపా కర్మాకర్ వ్యాఖ్యానించింది. -
దీపా కర్మాకర్ ఇంకా కోలుకోలేదు
కోల్‌కతా: భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఇంకా మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని ఆమె కోచ్ బిశ్వేశ్వర్ నంది వెల్లడించారు. అయితే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడంపై ఇప్పుడే చెప్పలేనని అన్నారు. ‘దీపా పునరావాస కార్యక్రమం కొనసాగుతోంది. ఆమె ఎప్పుడు బరిలోకి దిగేది ఇప్పుడే చెప్పలేను. ఏదైనా డాక్టర్ సలహా మేరకే నడుచుకుంటాం. ఆమె పూర్తిగా కోలుకున్నాకే కసరత్తయినా... ఇంకేదైనా! లేదంటే లేదు. ఫిట్నెస్ సంతరించుకున్నాక మళ్లీ ఓసారి డాక్టర్‌కు చూపిస్తాం. సానుకూల సంకేతం వస్తే ఆ తర్వాత ఫిజియోతో కలిసి పునరాగమనంపై దృష్టిపెడతాం’ అని కోచ్ నంది వివరించారు. ఈ అక్టోబర్‌లో జర్మనీలో ప్రపంచ చాంపియన్‌షిప్ జరగనుంది. ఇది ఒలింపిక్స్‌కు క్వాలిఫయింగ్ ఈవెంట్ కావడంతో అప్పటి వరకైనా ఆమె కోలుకోవాలని కోచ్ ఆశిస్తున్నారు. -
దీపా విఫలం
బాకు (అజర్‌బైజా¯Œ ): ప్రపంచకప్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ టోర్నమెంట్లో భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌కు నిరాశ ఎదురైంది. ఇప్పటికే వాల్ట్ విభాగంలో ఫైనల్‌కు అర్హత పొందిన ఆమె బ్యాలెన్సింగ్ బీమ్ విభాగంలో మాత్రం తడబడింది. త్రిపురకు చెందిన 25 ఏళ్ల దీపా శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్‌లో 10.633 పాయింట్లు స్కోరు చేసి 25 మందిలో 20వ స్థానాన్ని సంపాదించింది. ఎమ్మా నెదోవ్ (ఆస్ట్రేలియా–13.466 పాయింట్లు) అందరికంటే ఎక్కువ స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. టాప్–8లో నిలిచిన వారికి ఫైనల్ బెర్త్ లభిస్తుంది. నేడు జరిగే వాల్ట్ ఫైనల్లో దీపా పతకమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. -
ప్రపంచకప్ ఫైనల్ రౌండ్లోకి దీప
బాకు (అజర్బైజాన్): భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్‌లో ఫైనల్ రౌండ్‌కు అర్హత సంపాదించింది. వాల్ట్ ఈవెంట్లో గురువారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్ బరిలోకి దిగిన భారత జిమ్నాస్ట్ మూడో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత పొందింది. 25 ఏళ్ల దీప రెండు క్వాలిఫయింగ్ రౌండ్లలో వరుసగా 14.466, 14.133 పాయింట్లు సాధించింది. మొత్తంమీద 14.299 సగటును నమోదు చేసి ఫైనల్ చేరింది. అమెరికాకు చెందిన జేడ్ క్యారీ (14.70 పాయింట్లు), మెక్సికో మెరిక అలెక్సా మోరెనో (14.533 పాయింట్లు) వరుసగా తొలి రెండు స్థానాలు పొందారు. ఈ క్వాలిఫయింగ్‌లో టాప్–8 జిమ్నాస్ట్‌లు ఫైనల్ చేరతారు. రేపు (శనివారం) వాల్ట్ ఫైనల్ ఈవెంట్ జరగనుంది. రియో ఒలింపిక్స్‌లో భారత అమ్మాయి తృటిలో కాంస్యం చేజార్చుకొని నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. గత ఏడాది మోకాలి గాయం నుంచి కోలుకున్నాక బరిలోకి దిగిన ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ (జర్మనీ)లో దీప కాంస్యం గెలిచింది. గాయం వల్లే అంతకుముందు జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల ఫైనల్లో ఆమె పోటీపడలేకపోయింది. -
దీపా కర్మాకర్‌కు కాంస్యం
న్యూఢిల్లీ: ఆర్టిస్టిక్స్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్‌లో భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ సత్తా చాటింది. జర్మనీలోని కోట్బస్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో కాంస్య పతకాన్ని గెలుపొందింది. శనివారం జరిగిన వాల్ట్ ఈవెంట్ ఫైనల్లో 25 ఏళ్ల దీప 14.316 పాయింట్లు స్కోర్ చేసి మూడోస్థానంలో నిలిచింది. ఈ విభాగంలో రెబెకా ఆండ్రాడే (బ్రెజిల్) స్వర్ణం గెలుచుకోగా, జేడ్ కారీ (యూఎస్)కు రజతం లభించింది. శుక్రవారం జరిగిన వాల్ట్ క్వాలిఫయింగ్ రౌండ్లో 14.100 పాయింట్లు సాధించి ఆరో స్థానంతో ఫైనల్‌కు చేరిన ఈ త్రిపుర అమ్మాయి తుదిపోరులో మెరుగ్గా రాణించి పతకాన్ని ఒడిసి పట్టింది. మరోవైపు వాల్ట్ ఫైనల్స్‌కు ముందు జరిగిన బ్యాలన్స్ బీమ్ ఈవెంట్ క్వాలిఫయర్స్‌లో దీపాకు నిరాశ ఎదురైంది. 11.066 (4.8+ 6.266) పాయింట్లు స్కోర్ చేసిన దీప 23వ స్థానంలో నిలిచింది. -
దీపా కర్మాకర్ ఐదుతో సరి...
జిమ్నాస్టిక్స్‌లో భారత కథ ముగిసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ బ్యాలెన్స్ బీమ్ ఫైనల్లో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో దీపా 12.500 పాయింట్లతో ఐదో స్థానానికి పరిమితమైంది. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్లో ఆమె 12.750 పాయింట్లతో ఫైనల్‌కు చేరింది. చెన్ యైల్ (చైనా, 14.600 పాయింట్లు) స్వర్ణం దక్కించుకోగా... కిమ్ జాంగ్ (ఉత్తర కొరియా, 13.400), జాంగ్ జిన్ (చైనా, 13.325) వరుసగా రజత కాంస్యాలు దక్కించుకున్నారు. మహిళల టీమ్ విభాగంలో భారత జట్టు ఏడో స్థానంతో సరిపెట్టుకోగా... పురుషుల జట్టు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. -
ఏషియాడ్‌లో నేటి భారతీయం
► జిమ్నాస్టిక్స్: దీపా కర్మాకర్, ప్రణతి దాస్, అరుణా రెడ్డి, మందిర, ప్రణతి నాయక్ (క్వాలిఫయింగ్; మ.గం. 2.30 నుంచి). ►కబడ్డీ (మహిళల విభాగం): భారత్(vs) శ్రీలంక, (ఉ.గం. 8 నుంచి); భారత్(vs)ఇండోనేసియా, (ఉ.గం. 11.20 నుంచి); పురుషుల విభాగం: భారత్(vs)థాయ్‌లాండ్ (సా.గం. 4 నుంచి). ►షూటింగ్: అభిషేక్ శర్మ, సౌరభ్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్; ఉ.గం. 8 నుంచి; ఫైనల్స్ 9.45 నుంచి). లక్షయ్, శ్రేయసి సింగ్ (ట్రాప్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ క్వాలిఫయింగ్; ఉ.గం. 8.30 నుంచి; ఫైనల్స్ మ.గం. 3 నుంచి). ► రెజ్లింగ్: పురుషుల గ్రీకో రోమన్ స్టయిల్ (జ్ఞానేందర్–60 కేజీలు; మనీశ్–67 కేజీలు); మహిళల ఫ్రీస్టయిల్ (దివ్య కక్రాన్–68 కేజీలు; కిరణ్–72 కేజీలు; మ.గం. 12 నుంచి రాత్రి 7 వరకు). సోనీ టెన్–2, సోనీ ఈఎస్‌పీఎన్‌లలో ప్రత్యక్ష ప్రసారం -
రొట్టెకొద్దీ పిండి
జీవన కాలమ్ దీపా కర్మాకర్‌కి, సింధుకి ఇచ్చినట్టు ఇల్లు ఇస్తే మంచిదే కదా! కానీ అందరూ ఇళ్లే ఇస్తే ఎలా? కొందరు ఫర్నిచర్ ఇవ్వండి. మరికొందరు వంట సామగ్రి ఇవ్వండి. ఎయిర్ కండిషన్ మిషన్లను బహూకరించండి. డోర్ కర్టెన్లు ఇవ్వండి. మొన్నటి రియో ఒలిం పిక్స్‌లో ప్రపంచాన్ని ఆశ్చర్య చకితుల్ని చేసిన కళాకారిణి దీపా కర్మాకర్. మృత్యువుని కూడా లెక్క చేయని ప్రొడు నోవా విన్యాసం ఒక విస్ఫో టనం. కొద్ది సెకన్లలో బహు మతిని కర్మాకర్ నష్ట పోయినా, దేశ ప్రజల మన్న నలను నష్టపోలేదు. ఎక్కడో అగర్తలాలో అతి మామూలు కుటుంబంలో పుట్టిన ఈ 23 ఏళ్ల పిల్ల– తన లక్ష్యంలో నిప్పునీ, సాధనలో మృత్యువునీ జయిం చి– ప్రపంచాన్ని దిగ్భ్రాంతుల్ని చేసింది. ఆమె విజయానికి మెచ్చి సచిన్ తెందూల్కర్ అనే భారతరత్న ఆమెకు ఒక బీఎం డబ్ల్యూ కారుని బహూకరించాడు. దీని ఖరీదు– కనీసం కోటి రూపా యలు. నా ఉద్దేశం ఇలాంటివి భారతదేశంలో vulgar display of affluence అని. దీపా కర్మాకర్‌కి ఇది కొత్త సమస్య. పాపం, వాళ్ల ఊర్లో ఇంత పెద్ద, గొప్ప కారు తిరగడానికి రోడ్లు లేవు. కనుక త్రిపుర ప్రభుత్వం నిస్సహాయంగా ఆ ఊర్లో ఫలానా కారు తిరిగే రోడ్లను వేసే కార్యక్రమాన్ని చేప ట్టింది. అయితే పాపం, దీపా ఈ బహు మతిని అందుకున్నప్పుడే ఆమె తండ్రి ఓ మాట చెప్పారు. ‘‘బాబూ! ఈ కారుని నడపడానికి, తట్టుకో వడానికి మాకు శక్తి చాలదు. ఆ కారుకి అయిన డబ్బు ఇవ్వండి. మాకు ఉపయోగపడుతుంది’’ అని. బీఎండబ్ల్యూ సచిన్ వితరణని, స్థాయిని చెప్తోంది కాని– దీపా కర్మాకర్ స్థాయిని అర్థం చేసుకోని ‘లోపాన్ని’ కూడా చెప్తోంది. ఆ కారు తాళం చెవుల్ని అందుకుంటూ– ఈ దిక్కుమాలిన ‘మొగ్గ’ వేసి గొప్ప ఇబ్బందిని తెచ్చి పెట్టుకున్నానే! అని దీప ఒక్క సారయినా మనసులో అనుకుని ఉంటుందని నాకని పిస్తుంది. ఆ బాధ నాకు తెలుసు. నా జీవితంలో దాదాపు 17వ యేట నుంచీ ఏవో బహుమతులూ, చిన్న చిన్న జ్ఞాపికలూ, షీల్డులూ అందుతూనే ఉన్నాయి. రాను రాను వాటి ఉధృతం పెరిగి– ప్రతీ సభలో ఏ కొత్త ఉధృతం మీద పడుతుందోనన్న భయం ఎక్కువవు తోంది. సీనా రేకు, ప్లైవుడ్ చెక్కలతో అందంగా బొమ్మ లంటించిన వందలాది షీల్డులను నా జీవితంలో పుచ్చుకున్నాను. పుచ్చుకుంటూనే ఉన్నాను. వాటినేం చెయ్యాలి? ఎక్కడ ఉంచాలి? ఇచ్చేవారి మర్యాద, ఔదార్యం గొప్పవే. కానీ ఉంచుకోవాల్సిన నా ఇల్లు చిన్నది. ఇది 62 సంవత్సరాలుగా జరుగుతున్న ఉత్పాతం. మా ఇంట్లో షెల్ఫులన్నీ, కిటికీలన్నీ, గోడ లన్నీ, ఖాళీ స్థలమంతా వీటికి చాలవు. నాకప్పుడ ప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఈ కార్యకర్తలు– దూర దృష్టితో ఉపయోగపడే వస్తువులేమన్నా ఇవ్వరాదా? అని. కానీ అందరూ తెందూల్కర్లే. పెద్ద మనసు కలవారే. ఈ మధ్య టోపీలు వచ్చాయి. ఇక శాలువాలు కొల్లలు. ఒకసారి ఒక సంస్థవారు చక్కటి బ్రీఫ్ కేసు ఇచ్చారు. ఇప్పటికీ దాన్ని వాడతాను. మరొకరు గొడుగు ఇచ్చారు. వర్షం ఛాయలు కనిపించగానే, ‘ఫ్రెండ్స్ క్లబ్బు గొడుగు కారులో పెట్టారా?’ అని గుర్తు చేసుకుంటాను. శాలువాకి బదులు– చక్కగా పార్సిలు చేసి పది నాప్కిన్స్ ఇవ్వరాదా అనుకుంటాను. రోజూ చెయ్యి తుడుచుకుంటూ ఆ సంస్థని జ్ఞాపకం చేసు కోవచ్చు. చక్కటి షేవింగ్ కిట్ ఇవ్వరాదా? రోజూ గెడ్డం చేసుకుంటూ వారిని తలుచుకుంటాం. నాలుగు తువాళ్లివ్వండి. ఒక పడక కుర్చీ ఇవ్వండి. రెండు బెడ్ షీట్లు ఇవ్వండి. రెండు తలగడాలివ్వండి. పది పాకెట్ల సబ్బులివ్వండి. ఆడవాళ్లకి పైట పిన్నులు ఇవ్వండి. జడ కుచ్చులివ్వండి. పోనీ ఇప్పుడు జడలు వేసు కోవడం మానేశారు కనుక– పది నైటీలు ఇవ్వండి. మగాళ్లకు డజను లుంగీలివ్వండి. కందిపప్పు ధరలు మండిపోతు న్నాయి. పది కిలోల కందిపప్పు ఇవ్వండి. 5 కిలోల మినప గుళ్లి వ్వండి. సైకిలు మార్కు ఇంగువ డబ్బాలను ఇవ్వండి. భార్యలు సన్మానం ఎప్పుడా అని ఎదురుచూడకపోతే నన్న డగండి. ఇది నవ్వుతూ అన్నా, నవ్వులాటకి అన్నమాట కాదు. ఎవరినీ చిన్న బుచ్చడం ఎంతమాత్రం కాదు. ఆ మధ్య కువాయిత్‌లో ఒక సీడీ ప్లేయర్ ఇచ్చారు. ఒక సెల్‌ఫోన్ ఇవ్వండి. ఐపాడ్ ఇవ్వండి. సంగీతం కాసెట్లు ఇవ్వండి. పోనీ, కొత్త సినీమా టికెట్లు ఇవ్వండి. దీపా కర్మాకర్‌కి, సింధుకి ఇచ్చినట్టు ఇల్లు ఇస్తే మంచిదే కదా! కానీ అందరూ ఇళ్లే ఇస్తే ఎలా? కొందరు ఫర్నిచర్ ఇవ్వండి. మరికొందరు వంట సామగ్రి ఇవ్వండి. ఎయిర్ కండిషన్ మిషన్లను బహూ కరించండి. డోర్ కర్టెన్లు ఇవ్వండి. దీపకి ఒక సంవ త్సరానికి సరిపోయే బంగాళాదుంపల్ని సరఫరా చెయ్యమనండి. ఒక లారీతో గోధుమ పిండిని బహూ కరించమనండి. అయ్యా, రొట్టె కొద్దీ పిండిని ఎంపిక చేయాలి. భరించలేనివారికి అక్కరలేని సత్కారం– ఇబ్బంది పెట్టే ఇరకాటం అవుతుంది. ఇది ఇచ్చేవారి పెద్ద మన సుని శంకించడం ఎంతమాత్రం కాదు. పుచ్చుకునే అర్హత ఇచ్చుకునే వితరణకు ఉదాత్తతని ఇస్తుంది. అందుకే బలి చక్రవర్తి వితరణ చరిత్ర అయింది. పురాణమయింది–పుచ్చుకున్నవాడు సాక్షాత్తు దేవుడు కనుక. అది అర్హతకి పట్టాభిషేకం. వితరణకు నివాళి. గొల్లపూడి మారుతీరావు -
ఆమె కారు కోసం.. రూ. 78 కోట్లతో రోడ్లు!
రియో ఒలింపిక్స్‌లో త్రుటిలో పతకం చేజార్చుకున్న భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కోసం.. ఆమె ఉండే ప్రాంతంలో ప్రత్యేకంగా రోడ్లు బాగు చేయిస్తున్నారు. హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం వాళ్లు తనకు ఇచ్చిన బీఎండబ్ల్యు కారును ఇక్కడ నడిపించడం సాధ్యం కాదని, అందువల్ల ఆ కారును తిరిగి ఇచ్చేస్తానని ఆమె చెప్పిన విషయం పెద్ద వివాదానికి దారితీసింది. సుదీర్ఘ కాలంగా కమ్యూనిస్టుల పాలనలోనే ఉన్న త్రిపురలో రోడ్ల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. దాంతో ఈ రోడ్ల మీద ఇంత ఖరీదైన కారు నడిపించడం సాధ్యం కాదని దీపా కర్మాకర్ చెప్పింది. ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా భావించిన అగర్తలా మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ ప్రఫుల్‌జిత్ సిన్హా.. అభోయ్‌నగర్ లోని దీపా కర్మాకర్ ఇంటిప్రాంతంలో ఉన్న రోడ్లన్నింటినీ బాగు చేయిస్తున్నట్లు చెప్పారు. అక్కడి నుంచి అగర్తలా మెడికల్ కాలేజి వరకు ఉన్న రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం రూ. 78 కోట్లు కేటాయించినట్లు పీడబ్ల్యుడి శాఖ అధికారి ఒకరు తెలిపారు. కాగా ప్రభుత్వ నిర్ణయం పట్ల దీపా కర్మాకర్ హర్షం వ్యక్తం చేసింది. బీఎండబ్ల్యు కారు తిరగడానికి రోడ్ల గురించి తాను ఫిర్యాదు చేయలేదని... రోడ్ల వెడల్పుతో పాటు నాణ్యత కూడా ముఖ్యమేనని, కారు నిర్వహణ, సర్వీసింగ్ లాంటివి కూడా ముఖ్యాంశాలని ఆమె చెప్పింది. అందువల్లే కారు వెనక్కి ఇవ్వాలనుకున్నట్లు తెలిపింది. -
దీపా నిర్ణయంతో షాక్ తిన్నత్రిపుర సర్కారు
-
నాకు అదే గొప్ప విషయం: దీపా కర్మాకర్
తనకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేతులు మీదుగా గిఫ్ట్‌ను అందుకోవడమే గొప్ప విషయమని అంటోంది జిమ్నాస్ట్ దీపా కర్మాకర్. రియోలో ప్రదర్శన ఆధారంగా తాను అందుకున్న బీఎండబ్యూ కారును భరించే శక్తి లేదని, అందువల్ల ఆ గిఫ్ట్ ను ఇచ్చేయనున్నట్లు వచ్చిన వార్తలను దీపా ఖండించింది. ఆ కారును తిరిగి ఇచ్చే ఆలోచన లేదని దీపా తాజాగా స్ఫష్టం చేసింది. 'ఆ కారును సచిన్ చేతులు మీదుగా అందుకున్నా. సచిన్ నుంచి ఏ గిఫ్ట్ అందుకున్న అది నాకు గొప్ప విషయమే. అతని నుంచి అందుకున్న గిఫ్ట్ ను ఇచ్చే ఆలోచన నాకు లేదు' అని దీపా పేర్కొంది. తాను కేవలం అగర్తలాలో బీఎండబ్యూ షోరూం లేదని విషయాన్ని మాత్రమే తెలిపినట్లు ఒలింపిక్స్ లో తృటిలో పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయిన దీపా పేర్కొంది. దీనిపై హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తో మాట్లాడినట్లు తెలిపింది. ఇటీవల రియో ఒలింపిక్స్ లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా దీపాకు క్రికెట్ దిగ్గజం సచిన్ చేతులు మీదుగా బీఎండబ్యూ కారును అందజేశారు. రియో ఒలింపిక్స్ జిమ్నాస్టిక్‌లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన దీపకు, సింధు, సాక్షిలతోపాటు బీఎండబ్ల్యూ కారును హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు వీ చాముండేశ్వరినాథ్ బహూకరించిన సంగతి తెలిసిందే. -
ఆ బీఎండబ్ల్యూ కానుక.. తిరిగి ఇచ్చేస్తుందట!
రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబర్చిన పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్‌లకు క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లు కానుకగా అందిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఖరీదైన కానుకను మెయింటెన్ చేయలేక తిరిగి ఇచ్చేద్దామనుకుంటోంది దీపా కర్మాకర్. రియో ఒలింపిక్స్ జిమ్నాస్టిక్‌లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన దీపకు, సింధు, సాక్షిలతోపాటు బీఎండబ్ల్యూ కారును హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు వీ చాముండేశ్వరినాథ్ బహూకరించిన సంగతి తెలిసిందే. ఈ కారును భరించడం తనకు తలకుమించిన బరువు కావడంతో దానిని తిరిగి చాముండేశ్వరినాథ్‌కు ఇవ్వాలని ఆమె నిర్ణయించినట్టు తెలుస్తోంది. అగర్తలా వంటి చిన్న నగరంలో అంతటి ఖరీదైన, విలాసవంతమైన కారును ఉపయోగించడం దీప, ఆమె కుటుంబానికి కష్టంగా మారడం.. అగర్తలాలో ఇరుకురోడ్లు గుంతలు, గోతులతో అస్తవ్యస్తంగా ఉండటం వారు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణమని సమాచారం. అంతేకాకుండా వచ్చేనెలలో జర్మనీలో జరగబోయే చాలెంజర్స్ కప్ కోసం దీప సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బీఎండబ్ల్యూ మెయింటెన్స్ భరించే స్థోమత ఆమె వద్ద లేదని, అంతేకాకుండా ఎక్కువ సమయాన్ని ఆమె ప్రాక్టీస్ మీద దృష్టిపెట్టడంతో దీనిని ఉపయోగించే పరిస్థితి కూడా లేదని, అందుకే తిరిగి ఇచ్చేద్దామని భావిస్తున్నదని దీప కోచ్ బిశ్వేశ్వర్ నంది తెలిపారు. కారు తిరిగి ఇచ్చేద్దామన్న నిర్ణయం నిజానికి దీపది కాదని, కానీ దీప కుటుంబం, తాను కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. -
'క్రికెట్‌తో సమానంగా చూస్తున్నారు'
కోల్‌కతా: ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించి ఇటీవల జరిగిన రియోకు వెళ్లిన దీపా కర్మకర్... ప్రస్తుతం జిమ్నాస్టిక్స్ పై పెరుగుతున్న ఆదరణపై సంతోషం వ్యక్తం చేసింది. గతంలో తాను క్రికెట్లో చూసిన విశేష అభిమానుల సంఖ్య ఇప్పుడు జిమ్నాస్టిక్స్‌లో చూస్తున్నట్లు దీపా తెలిపింది. ఈ మేరకు చాలా మంది అభిమానులు జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడానికి అడ్మిషన్లు తీసుకున్నట్లు తనతో చెప్పారని పేర్కొంది. 'ఇప్పటికే చాలామంది జిమ్నాస్టిక్ గేమ్స్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. చాలామంది జిమ్నాస్టిక్స్ను నేర్చుకోవడానికి సిద్ధమవుతున్న విషయం విని సంతోషం కల్గింది. జిమ్నాస్టిక్స్ను క్రికెట్ తో పోల్చుతూ ఆ గేమ్‌ను ఎంచుకుంటున్నారు' అని దీపా స్పష్టం చేసింది. ఈ ఒలింపిక్స్‌లో పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయినా, వచ్చే టోక్యో ఒలింపిక్స్‌లో కచ్చితంగా పతకంతో తిరిగి వస్తానని పేర్కొంది. -
బైల్స్ పై గెలవడమే లక్ష్యంగా..
కోల్‌కతా: రియో ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ వాల్ట్ విభాగంలో తృటిలో కాంస్య పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయిన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ తదుపరి లక్ష్యం వరల్డ్ నంబర్‌వన్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్‌ను ఓడించడమేనట. అమెరికాకు చెందిన బైల్స్‌పై గెలవడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నట్లు దీపా తాజాగా పేర్కొంది. రియోలో వాల్ట్ జిమ్నాస్టిక్స్‌లో పసిడి సాధించిన బైల్సే తాను చూసిన మహిళా జిమ్నాస్ట్ల్లో అత్యుత్తమం అంటూ దీపా కితాబిచ్చింది. 'ఆమె కంటే నేను ఉత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయాను. కాకపోతే బైల్స్‌ను ఓడించడానికి ఇప్పట్నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. అదే లక్ష్యంగా ప్రిపరేషన్ మొదలుపెట్టా. ఆమెను ఓడించడమే నా తదుపరి లక్ష్యం' అని దీపా పేర్కొంది. నగరంలో స్థానికంగా జరిగిన దుర్గా పూజా కార్యక్రమంలో పాల్గొన్న దీప.. తన రియో ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే రియోలో పతకం సాధించకపోవడంతో యావత్ భారతావనిని నిరాశకు లోనైన విషయం తనకు తెలుసని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. తాను పతకం గెలిచి ఉంటే దాన్ని దేశానికి అంకింత ఇచ్చేదానని దీప పేర్కొంది. -
'జిమ్నాస్టిక్స్ అంటే సర్కస్ ఫీట్లా అని అడిగారు'
న్యూఢిల్లీ: భారత్ నుంచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించి తొలి మహిళా జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్‌కు రియోలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయట. రియోకు వచ్చిన అభిమానుల్లో కొంతమంది జిమ్నాస్టిక్స్ గేమ్స్‌ను సర్కస్ ఫీట్లతో పోల్చడమే కాకుండా, తనను పదే పదే అవే ప్రశ్నలతో సతమతం చేశారని దీపా కర్మాకర్ తాజాగా స్పష్టం చేసింది. 'నేను రియోలో పతకం సాధించాలనే ఒత్తిడిలో ఉన్నప్పుడు పలువురు నా వద్దకు వచ్చి జిమ్నాస్టిక్స్ అంటే ఏమిటని అడిగారు. అలా అడగమే కాకుండా సర్కస్‌ను పోలి ఉంటుందా అని అడిగారు. కానీ వాటిని నేను పెద్దగా పట్టించుకోకుండా ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి యత్నించా' అని వాల్ట్ విభాగంలో నాల్గోస్థానంలో నిలిచి తృటిలో కాంస్య పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయిన దీపా పేర్కొంది. ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రియో జ్ఞాపకాల్ని నెమరవేసుకున్న త్రిపుర అమ్మాయి.. జిమ్నాస్టిక్స్ను సర్కస్ తో పోల్చడం కొంతవరకూ ఇబ్బందికరంగా అనిపించిందని పేర్కొంది. -
'ఇది భారత్.. ఇక్కడ ఆకట్టుకుంటేనే'
భువనేశ్వర్: రియో ఒలింపిక్స్‌లాంటి ఒక మెగా ఈవెంట్‌కు వెళ్లే ముందు క్రీడాకారులకు ఆర్థిక చేయూతనిస్తే వారి ప్రదర్శన మరింత మెరుగ్గా ఉంటుందన్న పలువురి భావనను జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కోచ్ బిశ్వేశర్ నంది తోసి పుచ్చాడు. ఇక్కడ ఎటువంటి నజరానాలు పొందాలన్నా ముందు మన ప్రదర్శన సంతృప్తికరంగా ఉంటేనే జరుగుతుందని విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నాడు. ' ఇది భారత్.. ఇక్కడ ముందుగా మనల్ని నిరూపించుకుంటేనే ప్రశంసాపూర్వకమైన నజరానాలు అందుతాయి. ఆయా క్రీడాకారులు గురించి ఏమైనా రాయాలన్నా వారు ప్రత్యేకతను చాటుకున్న తరువాతే జరుగుతుంది' అని ద్రోణాచార్య అవార్డు గ్రహీత బిశ్వేశ్వర్ తెలిపారు. గత రాత్రి ఓ సన్మాన కార్యక్రమానికి హాజరైన బిశ్వేశ్వర్.. భారత్ లో ఆటగాళ్లకు రివార్డులు రావాలంటే వారు కచ్చితమైన ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం ఉందన్నాడు. దాంతో పాటు రియో శిక్షణలో భాగంగా దీపాకు విదేశీ కోచ్ అవసరం లేదన్న తన వాదనను బిశ్వేశ్వర్ సమర్ధించుకున్నాడు. తాను ఏ ఎక్సర్సైజ్ చెప్పినా ఎంతో చురుగ్గా చేసే అమ్మాయికి మరొక కోచ్ అవసరం లేదనే భావించే ఆ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అయితే రియోలో దీప శిక్షణను పొడిగించడానికి భయపడేవాడినని బిశ్వేశ్వర్ పేర్కొన్నాడు. ఇందుకు కారణం ఆమె తండ్రి తనకు ఇచ్చిన వార్నింగే ప్రధాన కారణమన్నాడు. కొన్ని సందర్భాల్లో దీప చాలా మొండిగా ఉంటుందనే విషయాన్ని ఆమె తండ్రి పదే పదే చెప్పడంతో ప్రాక్టీస్ సెషన్‌ను పొడిగించడానికి భయపడాల్సి వచ్చేదన్నాడు. -
సగర్వంగా... సంతోషంగా...
-
ఇంటికి వెళ్లగానే దీపా కర్మాకర్ ఏం చేసింది?
రియో ఒలింపిక్స్‌లో పతకం కోసం శాయశక్తులా కృషి చేసి, వెంట్రుక వాసిలో అదృష్టాన్ని మిస్సయిన దీపా కర్మాకర్.. ఇంటికి రాగానే పుస్తకాలు తీసింది. ఇంటికి వచ్చిన మర్నాటి నుంచే ఆమెకు ఎంఏ పరీక్షలు ఉన్నాయి. త్రిపుర యూనివర్సిటీ డిస్టెన్స్ లెర్నింగ్ సెంటర్ ద్వారా ఆమె ఎంఏ రెండో సెమిస్టర్ పరీక్షలకు హాజరైంది. పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ తనకు త్వరలోనే వస్తుందని ఆమె గట్టి నమ్మకంతో చెప్పింది. ఒకవైపు క్రీడాంశాలపై అపారమైన ఆసక్తి చూపుతూనే, చదువు మీద కూడా ఇంత శ్రద్ధ పెట్టడం అద్భుతమని త్రిపుర యూనివర్సిటీ అధికారులు అంటున్నారు. సాధారణంగా క్రీడాకారులు చదువును పక్కన పెట్టేస్తారు. ఎప్పుడో వీలైనప్పుడు పరీక్షలు రాస్తారు. కానీ, దీప మాత్రం అలా కాకుండా అకుంఠిత దీక్షతో రియో నుంచి వచ్చిన మర్నాడే పరీక్షలకు హాజరైంది.. బాగా రాసింది కూడానట. పరీక్షలు తప్పించుకోడానికి వంకలు వెతికే పిల్లలు ఆమెను చూసి నేర్చుకోవాలని అధ్యాపకులు అంటున్ నారు. జిమ్నాస్టిక్స్ కోచింగ్, ప్రాక్టీసుకు చాలా సమయం పడుతుందని, అయినా దీప మాత్రం ఎప్పుడూ చదువును నిర్లక్ష్యం చేయలేదని ఆమె కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు. చివరకు రియోకు వెళ్లేటప్పుడు కూడా ఆమె పుస్తకాలు తీసుకెళ్లిందట. మధ్యలో ఖాళీ దొరికితే చదువుకుందామని అలా తీసుకెళ్లిందని ఆమె తల్లి గౌరి చెప్పారు. మన దేశంలో చదువా.. ఆటలా అని ఏదో ఒకటి ఎంచుకోమంటారని, కానీ రెండూ ఒకేసారి చేయొచ్చని దీపా కర్మాకర్ నిరూపించిందని ఆమెతో పాటు పరీక్షకు హాజరైన యువకుడు చెప్పాడు. -
త్రిపురలో దీపా కర్మాంకర్కు స్వాగతం
-
దీపా కర్మాకర్‌కు తెలంగాణ సర్కారు నజరానా
హైదరాబాద్: రియో ఒలింపిక్స్ లో జిమ్నాస్టిక్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచిన దీపా కర్మాకర్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రూ.50 లక్షల నజరానా ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. 52 సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్ క్రీడల్లో జిమ్నాస్టిక్స్ విభాగంలో అర్హత పొందిన తొలి భారత జిమ్నాస్ట్‌గా దీపా కర్మాకర్ రికార్డు సృష్టించారని ప్రకటనలో పేర్కొన్నారు. ఒలింపిక్స్‌లో అమ్మాయిలు అద్భుత ప్రతిభా పాటవాలు ప్రదర్శించడం స్పూర్తిదాయకమని సీఎం కేసీఆర్ కొనియాడారు. అమ్మాయిలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, యావత్ భారతావని వారికి అండగా నిలవాలని ప్రకటనలో ఆయన సూచించారు. రియో ఒలింపిక్స్ లో అద్భుత ప్రదర్శన చేసినా తృటిలో దీప కాంస్య పతకాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. -
'మా అమ్మ చాలా భయపడింది'
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ ఫైనల్లో తన స్కోరు పట్ల సంతోషంగా ఉన్నానని, కానీ నాలుగో స్థానంలో నిలవడం కొద్దిగా నిరుత్సాహానికి గురిచేసిందని భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ పేర్కొంది. టోక్యో 2020 ఒలింపిక్స్ లో పోడియంకు చేరడమే నా తదుపరి లక్ష్యమని చెప్పింది. జమ్నాస్టిక్స్ లో తన విన్యాసాలు చూడడానికి తన తల్లి భయపడిందని వెల్లడించింది. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన అభిమాన క్రీడాకారుడని తెలిపింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో శనివారం దీపా కర్మాకర్ ను ఘనంగా సన్మానించారు. తనకు అండగా నిలిచివారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపింది. జిమ్మాస్టిక్స్ లో తాను ఏదైతే సాధించిందంతా కోచ్ బిశ్వేశ్వర్ నంది ఘనత అని ప్రకటించింది. -
'అస్సలు ఊహించలేదు.. అయినా హ్యాపీ'
-
'అస్సలు ఊహించలేదు.. అయినా హ్యాపీ'
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ లో తాను 7 లేదా 8 స్థానాల్లో నిలుస్తానని అనుకున్నానని భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ తెలిపింది. 4వ స్థానం దక్కుతుందని అస్సలు ఊహించలేదని.. అయినా సంతోషంగానే ఉందని వ్యాఖ్యానించింది. శనివారం ఉదయం ఢిల్లీ చేరుకున్న ఆమెకు విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. అధికారులు, అభిమానులు ఆమెను ఘనంగా స్వాగతించారు. దీపా కర్మాకర్ ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నట్టు కోచ్ బిశ్వేశ్వర్ నంది తెలిపారు. ఆమెకు పతకం వస్తే మరింత ఆనందపడేవాడినని చెప్పారు. రియో ఒలింపిక్స్ తృటిలో దీపా కర్మాకర్ కు పతకం చేజారినా ఆమె ప్రదర్శనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. ఆమె పేరును దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ప్రతిపాదించారు. -
దీపా, జీతూలకు రాజీవ్ఖేల్త్న్ర!
దాదాపుగా ఖరారు న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం అందించే అత్యున్నత క్రీడా అవార్డు ‘రాజీవ్ ఖేల్త్న్ర’కు ఈ ఏడాది జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, షూటర్ జీతూరాయ్ పేర్లను ప్రతిపాదించారు. వీరిద్దరు ఒలింపిక్స్‌లో పతకం సాధించడంలో విఫలమైనా, ఇటీవలి ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్నారు. వాస్తవానికి ఖేల్త్న్ర అవార్డు కోసం పేర్లు ప్రతిపాదించేందుకు ఇప్పటికే గడువు ముగిసినా... రియోలో దీప ప్రదర్శన ఆమె పేరును చేర్చేలా చేసింది. అటు జీతూ కూడా రెండేళ్లుగా నిలకడగా రాణిస్తున్నాడు. 12 మంది సభ్యుల కమిటీ కూడా వీరిద్దరి పేర్లను దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. ఒక వేళ ఒలింపిక్స్‌లో సింధు పతకం సాధిస్తే ఆమెను కూడా ఎంపిక చేసే అవకాశం ఉంది. మరో వైపు అర్జున అవార్డు కోసం అజింక్య రహానే, శివ థాపా, గుర్ప్రీత్, అపూర్వి చండీలా, సౌమ్యజిత్, వినేశ్ ఫోగట్ తదితరుల పేర్లను సంబంధిత సంఘాలు ప్రతిపాదించాయి. -
దీపా కర్మాకర్‌కు ఖేల్‌రత్న అవార్డు?
ఇప్పటివరకు జిమ్నాస్టిక్స్‌లో ఎక్కడా వినిపించని భారతదేశం పేరును తొలిసారి అంతర్జాతీయ యవనికపై గౌరవనీయమైన స్థానంలో నిలిపిన దీపా కర్మాకర్ పేరును ఖేల్‌రత్న అవార్డుకు ప్రతిపాదిస్తున్నారు. దేశంలో క్రీడారంగానికి సంబంధించి అత్యున్నత పురస్కారం అయిన ఖేల్‌రత్నతో ఈ త్రిపుర జిమ్నాస్టును సత్కరించాలని క్రీడాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. జిమ్నాస్టిక్స్ అంశంలో దీపకు కొద్దిలో కాంస్యపతకం తప్పింది. ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. దీపా కర్మాకర్‌తో పాటు షూటర్ జీతూరాయ్ కూడా ఖేల్ రత్నకు పోటీ పడుతున్నట్లు తెలిసింది. అలాగే దీపకు చిన్నతనంలో శిక్షణ ఇచ్చిన కోచ్ బిశ్వేశ్వర్ నందికి ద్రోణాచార్య అవార్డు దక్కే అవకాశం కనిపిస్తోంది. స్పాన్సర్ చేసేవాళ్లు ఎవరూ లేకపోయినా, సదుపాయాలు శూన్యమైనా.. పేదరికాన్ని సైతం తోసిరాజని దీప తన నైపుణ్యాలను అద్భుతంగా ప్రదర్శించింది. ప్రధానంగా అత్యంత ప్రమాదకరమైన ప్రోదునోవా విభాగంలో ఆమె ప్రతిభ అద్భుతమని క్రీడా పండితులు అంటారు. 2010లో కామన్వెల్త్ గేమ్స్ జరిగినప్పుడు జిమ్నోవా అనే సంస్థ ఆమెకు జిమ్నాస్టిక్స్ దుస్తులు ఇచ్చింది. గత మూడు నెలల క్రితం వరకు ఆమె అవే దుస్తులను ఉపయోగించిందంటే ఆమె ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేదో తెలుసుకోవచ్చు. అయితే.. ఏప్రిల్‌లో జరిగిన రియో టెస్ట్ ఈవెంట్లో ఆమె క్వాలిఫై కావడంతో ఒక్కసారిగా ఆమెకు గుర్తింపు వెల్లువెత్తింది. స్పాన్సర్లు కూడా ఆమెవెంట పడ్డారు. ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలోనే నిలిచినా, దీప భారతదేశానికి మంచి పేరు తీసుకొచ్చిందంటూ సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆమెను ప్రశంసించారు. దాంతో ఇప్పుడు ఆమె పేరును ఖేల్‌రత్న అవార్డుకు ప్రతిపాదించాలని భావిస్తున్నారు. -
ఆమె హృదయాలను గెలుచుకుంది: సచిన్
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ లో అద్భుత ప్రతిభ ప్రదర్శించిన దీపా కర్మాకర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. దీపాను కీర్తించిన జాబితాలో తాజాగా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చేరారు. ఆటలో గెలుపోటములు సహజమని దీపా తన అద్భుత ప్రదర్శనతో కోట్లాది మంది భారతీయుల హృదయాలను గెలుచుకుందని, దేశం ఆమెను చూసి గర్విస్తోందని సచిన్ ట్వీట్ చేశారు. భారత త్రివర్ణ పతాకాన్ని ప్రపంచంలో ముందుంచడానికి దీపా, ఆమె కోచ్ గొప్ప కృషి చేశారని మరో భారత క్రికెటర్ శిఖర్ ధవన్ కొనియాడారు. జిమ్నాస్టిక్ పోటీలో 0.150 పాయింట్ల తేడాతో దీపా నాల్గవ స్థానంలో నిలిచి తృటిలో కాంస్య పథకాన్ని కోల్పోయింది. Winning & losing is a part of sport.. You've won millions of hearts & the entire nation is proud of ur achievements. https://t.co/qSpiWFSp2K — sachin tendulkar (@sachin_rt) 15 August 2016 Congratulations to you and your coaches @dipakarmakar for placing the tricolour at the forefront of world gymnastics. Proud #DipaKarmakar — Shikhar Dhawan (@SDhawan25) 15 August 2016 -
గ్రేట్ దీపా.. దేశం నిన్ను చూసి గర్విస్తోంది!
-
గ్రేట్ దీపా.. దేశం నిన్ను చూసి గర్విస్తోంది!
రియో డి జెనీరో: యావత్ దేశం గతరాత్రి టీవీతెరకు కళ్లప్పగించింది. దీపా కర్మాకర్ ప్రమాదకరమైన విన్యాసం ప్రోడునోవా చేస్తుంటే.. గుండె చిక్కబట్టుకొని చూసింది. దీప అద్భుతమైన విన్యాసాలు చూసి చప్పట్లు కొట్టింది. అంతలోనే నిరాశ.. దీప ఎంత శాయశక్తులా కృషిచేసినా అదృష్టం కలిసిరాలేదు. తృటిలో ఒలింపిక్స్ పతకం చేజారింది. పతకం తేకపోయినా.. దీప మాత్రం దేశప్రజల హృదయాలను గెలుచుకుంది. ఒలింపిక్స్ వాల్ట్ విభాగంలో నాలుగోస్థానంలో నిలిచిన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఒలింపిక్స్ లో పాల్గొంటున్న తొలి భారత జిమ్నాస్ట్ గా ఇప్పటికే రికార్డు సృష్టించిన దీప.. తొలిప్రయత్నంలోనే ఫైనల్ కు చేరి దేశప్రజల్లో పతకంపై ఆశలు రేపింది. తుదివరకు అసమానమైన క్రీడాపటిమ కనబర్చిన దీపా కర్మాకర్ పతకాన్ని సాధించకున్నా.. భవిష్యత్తులో గొప్ప జిమాస్ట్ గా ఎదిగి దేశానికి ఎన్నో కీర్తి ప్రతిష్టలు తెస్తాననే ఆశాభావం కలిగించింది. ఆమె అసమాన పోరాటపటిమపై ట్విట్టర్ లో ప్రశంసల జల్లు కురుస్తోంది. దీపా కర్మాకర్ నిజమైన హీరో అని, అద్భుతమైన పోరాటపటిమను చూపిన ఆమెను చూసి దేశం గర్విస్తోందని నెటిజనులు హర్షం వ్యక్తం చేశారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, షూటర్ అభినవ్ బింద్రా, వీరేంద్ర సెహ్వాగ్, హర్ష బోగ్లే, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, రాజకీయ నాయకుడు అజయ్ మాకెన్ తోపాటు పలువురు నెటిజన్లు దీప క్రీడాప్రతిభను కొనియాడుతూ పెద్ద ఎత్తున ట్వీట్లు చేశారు. -
'నా కూతురు పతకం సాధిస్తుంది'
రియో ఒలింపిక్స్‌లో ఆదివారం భారత్‌కు చాలా కీలకం కానుంది. ముఖ్యంగా భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ పై దేశం ఎన్నో ఆశలు పెట్టుకుంది. నేటి రాత్రి ఆమె పాల్గొనే ఈవెంట్ జరగనున్న నేపథ్యంలో దీపా కర్మాకర్ విజయం సాధించాలని ఆమె సొంత రాష్ట్రం త్రిపురలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భారత్ నుంచి తొలిసారి ఒలింపిక్స్ ఫైనల్‌కు అర్హత సాధించిన జిమ్నాస్ట్ గా ఇప్పటికే దీపా కర్మాకర్ పేరు మార్మోగిపోయింది. దీపాకు ప్రధానంగా బైల్స్(అమెరికా) రూపంలో కఠిన ప్రత్యర్థి ఎదురుకానుంది. దీపా కర్మాకర్ తండ్రి దులాల్ కర్మాకర్ మాట్లాడుతూ.. దేశమంతా ఆమెకు అండగా నిలిచింది, అందరూ ఆమె కోసం పూజలు చేస్తున్నారని చెప్పారు. దేశమంతా ఆమెపై ఎన్నో అంచనాలు పెంచుకుందని, తన కూతురు పతకం సాధిస్తుందని తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. అందరి మద్ధతు కూడగట్టుకుని తన కూతురు మెరుగైన ప్రదర్శన చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
అడిగితే వద్దన్నారు... ఇప్పుడు పంపించారు!
దీపా కర్మాకర్ కోసం ఫిజియో రియో: ఒలింపిక్స్‌లో జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఫైనల్స్‌కు క్వాలిఫై అయిన తర్వాత గానీ ఆమె విలువను భారత అధికారులు గుర్తించలేదు. ఈ పోటీలకు ముందు తనకు ఫిజియో కావాలని, కఠినమైన ఈవెంట్ల సాధన తర్వాత కోలుకునేందుకు ఎంతో అవసరం అవుతుందని దీపా మొత్తుకుంది. అయితే అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం హడావిడిగా దీపా కోసం ఫిజియో సజ్జాద్ మీర్‌ను పంపించింది. మంగళవారం సాయంత్రమే మీర్ రియోకు చేరుకున్నారు. -
దీపా.. నువ్ సూపర్.. !
భారత జిమ్మాస్ట్ దీపా కర్మాకర్ తన అద్భుతమైన ప్రదర్శనతో రియో ఒలింపిక్స్ ఫైనల్లో బెర్తు సాధించడమే కాదు.. ఇటు దేశ ప్రజల హృదయాలనూ గెలుచుకుంది. అత్యంత క్లిష్టమైన వ్యక్తిగత వాల్ట్ విభాగంలో గెలిచి.. నిలిచి ఫైనల్‌కు చేరిన దీప సరికొత్త చరిత్ర లిఖించింది. భారత్ నుంచి ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి మహిళా జిమ్నాస్ట్‌గా ఇప్పటికే రికార్డు సృష్టించిన దీప సంచనాలు కొనసాగిస్తూ.. ఫైనల్లోనూ అడుగుపెట్టింది. ఆమె అపూర్వమైన రికార్డును కొనియాడుతూ ట్విట్టర్లో దేశవాసులు అభినందనలు తెలిపారు. భారతీయుల ఆశలను నిలబెడుతూ ఫైనల్లోనూ అద్భుతంగా రాణించి పతకం సాధించాలని, దేశం గర్వపడేలా మరింత ఉన్నత శిఖరాలను ఆమె అధిరోహించాలని పలువురు నెటిజన్లు ఆకాంక్షించారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మొదలు.. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, విజయ్ గోయల్, బాక్సర్ విజిందర్ సహా పలువురు నెటిజన్లు దీపా కర్మాకర్‌కు అభినందనలు తెలిపారు. ఒలింపిక్స్ వేదికపై భారతీయుల ఆకాంక్షలను నిలబెట్టాలని కోరారు. మరోవైపు దీపా కర్మాకర్ వాల్ట్ విన్యాసాలను లైవ్ ప్రసారంలో చానెల్లో చూపకపోవడంపై అమితాబ్ సహా పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. #Rio2016 Congratulations #DipaKarmakar on making history in #ArtisticGymnastics .Good luck for finals. #GoForGold pic.twitter.com/6f56jaXnrc — Sudarsan Pattnaik (@sudarsansand) August 8, 2016 And #DipaKarmakar vaults into finals. First Indian woman to achieve this... May the medal be your bday gift tmrw. pic.twitter.com/PnfAhrp6UK — Naveen Jindal (@MPNaveenJindal) August 8, 2016 -
దీపా కర్మాకర్ కొత్త చరిత్ర
-
దీపా కర్మాకర్ కొత్త చరిత్ర
రియో డీ జనీరో: భారత్ నుంచి ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి మహిళా జిమ్నాస్ట్‌గా ఇటీవల రికార్డు సృష్టించిన దీపా కర్మాకర్.. రియో ఒలింపిక్స్ లో కొత్త చరిత్ర సృష్టించింది. వాల్ట్ విభాగంలో ఫైనల్‌కు చేరి సరికొత్త చరిత్రను లిఖించింది. క్వాలిఫయింగ్ రౌండ్ లో భాగంగా ప్రొడునోవా వాల్ట్ విభాగంలో 14.850 పాయింట్లు సాధించి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇందులో టాప్-8లో ఉన్నవారు మాత్రమే ఫైనల్ కు అర్హత సాధిస్తారు. అయితే దీపా ఏడో స్థానంలో నిలిచే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది. కెనడా జిమ్నాస్ట్ షాలోన్ ఓల్సేన్ 14.950 పాయింట్ల్లు సాధించడంతో దీపా ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. దీంతో ఒలింపిక్స్‌లో దాదాపు ఐదు దశాబ్దాలుగా భారతీయులకు కలగా మిగిలిన జిమ్నాస్టిక్స్ పతకంపై ఆశలను పెంచుతూ ఆగస్టు 14వ తేదీన జరిగే ఫైనల్లో పోరుకు సిద్ధమైంది. ఈ ఏడాది ఏప్రిల్ లో రియో డీ జెనీరియోలో జరిగిన ఫైనల్ క్వాలిఫయర్ లో 52.698 పాయింట్లు నమోదు చేసిన దీపా కర్మాకర్ రియోకు అర్హత సాధించింది. తద్వారా ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా దీప రికార్డు నెలకొల్పింది. త్రిపురకు చెందిన ఈ 22 ఏళ్ల అమ్మాయి.. కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్‌గా రికార్డు సృష్టించడమే కాకుండా, ఆ తర్వాత వరల్డ్ జిమ్నాస్ట్ చాంపియన్‌షిప్ కు అర్హత సాధించింది. ఒలింపిక్స్‌లో ఫైనల్ రౌండే లక్ష్యంగా బరిలోకి దిగిన దీపా కర్మాకర్ అంచనాలను అందుకోవడం పతకంపై ఆశలను పెంచుతుంది. -
ఉత్కంఠ రేపుతోన్న ఆగస్టు 14..
రియో డి జెనిరో: భారత స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15కు ఒక్కరోజు ముందు జరగబోయే పోటీపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. భారత జిమ్నాస్టిక్స్‌లో కొత్త చరిత్రను లిఖిస్తూ.. 52 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రియో ఒలింపిక్స్ అర్హత సాధించిన జిమ్నస్ట్ దీపా కర్మాకర్.. ఆదివారం రాత్రి జరిగిన వాల్ట్ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చి, ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయురాలు ఆమెనే కావడం విశేషం. ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం ఆశలను సజీవంగా నిలిపిన ఆమె.. ఆగస్టు 14న జరగబోయే ఫైనల్స్ లో వివిధ దేశాలకు చెందిన ఏడుగురు జిమ్నాస్ట్ లతో తలపడనుంది. తుదిపోరులోనూ ఆమె మెరిసి పతకం సాధించాలని దేశం యావత్తు కోరుకుంటోంది. (భారత ఆశా'దీపం') ఒక్క హాకీ తప్ప అన్ని క్రీడాంశాల్లోనూ భారత క్రీడాకారులు ఫైఫల్యాల బాట పడుతున్నవేళ.. ఆదివారం జరిగిన మహిళల క్వాలిఫయింగ్‌లో దీపా వాల్ట్ విభాగంలో 14.850 పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. మొదటి ప్రయత్నంలో భాగంగా డిఫికల్టీలో 7.0, ఎగ్జిక్యూషన్ లో 8.1 పాయింట్లు సాధించిన దీపా.. రెండో రౌండ్ డిఫికల్టీలో మాత్రం 6.0 పాయింట్లు మాత్రమే సాధించింది. మొదటి రౌండ్లో వాల్ట్పై ధీమాగా నిలబడగలిగిన ఆమె, రెండో రౌండ్ 'ట్రస్క్ డబుల్ ఫుల్ ట్విస్ట్'ను ప్రదర్శించడంలో కాస్త తడబాటుకులోనైంది. మొత్తానికి 14.850 పాయింట్లు సాధించిన మొదటి ఎనిమిది మందిలో ఒకరిగా ఫైనల్స్ లోకి ప్రవేశించింది. కెనడియన్ జిమ్నాస్ట్ షాలోన్ 14.950 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. (కొండగాలి తిరిగింది) ఇక మిగతా పొజిషన్లను గమనిస్తే మూడు సార్లు ప్రపంచ చాంపియన్, అమెరికన్ జిమ్నాస్ట్ అయిన సిమోనె బైల్స్ 16.050 పాయింట్లతో మొదటిస్థానాన్ని ఆక్రమించింది. ఆమె రెండు రౌండ్లలోనూ ఎగ్జిక్యూషన్ లో 9.700 పాయింట్లు సాధించింది. నార్త్ కొరియాకు చెందిన జాంగ్ ఉన్ హాంగ్ 15.683 పాయింట్లతో రెండో స్థానాన్ని, స్విట్జర్లాండ్ జిమ్నాస్ట్ గులియా స్టెయిన్ బర్గ్ మూడో(15.266 పాయింట్లు) స్థానంలో నిలిచారు. వీరంతా ఆగస్టు 14న జరిగే మహిళల వ్యక్తిగత విభాగ పతకాల కోసం పోటీపడతారు. ఇక మిగతా క్రీడాంశాల్లో భారత టీటీ, షూటర్లు, టెన్నిస్ స్టార్ సానియా మిర్జా, వెయిట్ లిఫ్టర్లు, ఆర్చరీ జట్లు ఓటమిచెందాయి. కాగా, రేపు (ఆగస్టు 9న) దీపాకర్మాకర్ పుట్టినరోజని, పతకం సాధింస్తే అంతకంటే గొప్ప గిఫ్ట్ ఉండబోదని ఆమె తండ్రి దులాల్ కర్మాకర్ అంటున్నారు. (రెండో రోజూ భారత్ కు వైఫల్యాలే) -
'దీపా కర్మాకర్ పై ఒత్తిడి ఉంది'
రియో డి జనీరో:ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత తొలి మహిళా జిమ్నాస్టిక్‌గా రియోలో అడుగుపెట్టిన దీపా కర్మాకర్‌పై యావత్ భారతావని చాలా ఆశలు పెట్టుకుందని ఆమె కోచ్ బిశ్వేశ్వర్ నంది స్పష్టం చేశారు. ప్రస్తుతం తమపై ఒలింపిక్స్ పతకం సాధించాల్సిన ఒత్తిడి అధికంగా ఉందని పేర్కొన్నారు. గత ఏప్రిల్‌లో దీపా సంచలన ప్రదర్శనతో రియోకు అర్హత సాధించిన అనంతరం ఆమెపై ఒక్కసారిగా ఆశలు పెరిగిపోయాయని..ఇప్పుడు ఒలింపిక్స్‌లో పతకం తీసుకొస్తుందని వంద కోట్ల అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే తమపై అధిక ఒత్తిడి పడుతుందన్నాడు. ' రియోలో దీపా కర్మాకర్ పతకం సాధిస్తుందని అంతా భారీ అంచనాలతో ఉన్నారు. భారత అభిమానులకు పతకం కానుకగా ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇది బిలియన్ భారత ప్రజల ఆశ. దీపా కర్మాకర్ రియోకు అర్హత సాధించిన తరువాత ఆమెపై అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. కాకపోతే మెగా ఈవెంట్లో పతకం సాధించడమనేది కష్టంతో కూడుకున్నదని వారికి తెలియదు. మా శాయశక్తులా పతకం సాధించడానికి యత్నిస్తాం. ఆ విషయాన్ని అంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా.దీపా కర్మాకర్ ప్రదర్శనపై నాకు కూడా నమ్మకం ఉంది.' అని బిశ్వేశ్వర్ నంది పేర్కొన్నారు. ఏప్రిల్ లో రియో డీ జెనీరియోలో జరిగిన ఫైనల్ క్వాలిఫయర్ లో 52.698 పాయింట్లు నమోదు చేసిన దీపా కర్మాకర్ రియోకు అర్హత సాధించింది. తద్వారా ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా దీప రికార్డు నెలకొల్పింది. త్రిపురకు చెందిన ఈ 22 ఏళ్ల అమ్మాయి.. కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్‌గా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత వరల్డ్ జిమ్నాస్ట్ చాంపియన్‌షిప్ కు అర్హత సాధించింది. ఒలింపిక్స్‌లో ఫైనల్ రౌండే లక్ష్యంగా బరిలోకి దిగిన దీపా కర్మాకర్.. ఆగస్టు 7వ తేదీన తొలి రౌండ్ పోరులో తలపడనుంది. -
'దీపా కర్మాకర్ విదేశీ శిక్షణను వద్దన్నా'
న్యూఢిల్లీ: గత రెండు నెలల క్రితం ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించడం ద్వారా తొలి భారతీయ మహిళా జిమ్నాస్ట్‌గా రికార్డు నెలకొల్పిన దీపా కర్మాకర్ స్వదేశంలోనే శిక్షణ తీసుకోవడంలో ఎటువంటి తప్పిదం లేదని ఆమె కోచ్ బిశ్వేశ్వర్ నంది పేర్కొన్నాడు. భారత్ నుంచి రియోకు ఎంపికైన చాలా మంది అథ్లెట్లు విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్న తరుణంలో దీపా అసంతృప్తిగా ఉందంటూ వచ్చిన వార్తలపై బిశ్వేశ్వర్ స్పందించాడు. ' దీపా కర్మాకర్ విదేశీ శిక్షణలో భాగంగా స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) నుంచి పిలుపు అందింది. అయితే దాన్ని నేనే తిరస్కరించాను. దాంతో పాటు మమ్ముల్ని కొంతమంది స్పాన్సర్లు కూడా సంప్రదించారు. దాన్ని కూడా వద్దనుకున్నాం. విదేశాల్లో శిక్షణ తీసుకోనందుకు దీపా కర్మాకర్లో ఎటువంటి నిరాశ లేదు. కానీ దీపా అసంతృప్తిగా ఉందంటూ కథనాలు రావడంపై స్పందించాల్సి వచ్చింది. చాలా సంవత్సరాల తరువాత భారత జిమ్నాస్ట్ ఒలింపిక్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తుంది. ఇప్పటివరకూ ఆమె భారత కోచ్‌ల పర్యవేక్షణలోనే మెరుగైన ఫలితాలు సాధించింది. ఆ కారణంతోనే భారత్‌లో శిక్షణకు మొగ్గు చూపాం. ప్రస్తుతం ఆమె శిక్షణకు ఎటువంటి ఇబ్బంది లేదు'అని కోచ్ పేర్కొన్నాడు. ఒలింపిక్స్ సన్నాహకంలో భాగంగా త్రిపురకు చెందిన దీపా కర్మాకర్ ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో శిక్షణ పొందుతున్నట్లు బిశ్వేశ్వర్ నంది వెల్లడించాడు. -
దీపా కర్మాకర్ కు రూ.30 లక్షల ప్రోత్సాహకం
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన దీపా కర్మాకర్‌కు క్రీడల శాఖ ప్రోత్సాహకం ప్రకటించింది. ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళా జిమ్నాస్ట్‌గా రికార్డుకు ఎక్కిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గురువారం రూ.30 లక్షల ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. అయితే ఆ చిన్న మొత్తం దీపా కర్మాకర్ ఒలింపిక్స్ గేమ్స్‌లో పాల్గొనేందుకు సరిపోతాయా అనేది ప్రశ్నార్థకమే. కాగా త్రిపురకు చెందిన 22 ఏళ్ల దీప జిమ్నాస్టిక్స్‌లో అద్భుతాలు స్పష్టిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. రియో డీ జెనీరియోలో ఫైనల్ క్వాలిఫయర్ లో 52.698 పాయింట్లు నమోదు చేసి అద్భుత ప్రతిభను కనబర్చింది. కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్‌గా ఆమె ఇదివరకే రికార్డు సృష్టించింది. ఆ తర్వాత వరల్డ్ జిమ్నాస్ట్ చాంపియన్‌షిప్‌కు కూడా దీపా కర్మకార్ అర్హత సాధించింది. -
దీపా కర్మకార్పై ప్రశంసల వర్షం
న్యూఢిల్లీ:ఈ ఏడాది బ్రెజిల్లో జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మకార్పై సర్వత్రా ప్రశంలస వర్షం కురుస్తోంది. ఈ చారిత్రాత్మక ఫీట్‌తో ఆమె భారతీయ యువతకు ఆదర్శంగా నిలుస్తుందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొనియాడాడు. దీపా కర్మకార్ సాధించిన ఘనత అసాధారణమని సచిన్ పొగడ్తలతో ముంచెత్తాడు. దేశంలోని యువతలో మరింత స్ఫూర్తిని నింపడానికి ఆమె నమోదు చేసిన అరుదైన ఘనత కచ్చితంగా దోహదం చేస్తుందని తెలిపాడు. ఈ సందర్భంగా ఆమెకు సచిన్ శుభాకాంక్షలు తెలియజేశాడు. మరోవైపు దీపా సాధించిన ఘనత భారత జిమ్నాస్టిక్స్ను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిందంటూ క్రీడామంత్రి సర్బానంద్ సోనోవాల్ ప్రశంసించారు. బ్రెజిల్లో జరిగే రియో ఒలింపిక్స్‌కు దీపా కర్మాకార్ అర్హత సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా దీప రికార్డు నెలకొల్పింది. రియో డీ జెనీరియోలో ఫైనల్ క్వాలిఫయర్ లో 52.698 పాయింట్లు నమోదు చేసి అద్భుత ప్రతిభను కనబర్చింది. త్రిపురకు చెందిన 22 ఏళ్ల దీప జిమ్నాస్టిక్స్‌లో అద్భుతాలు స్పష్టిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్‌గా ఆమె ఇదివరకే రికార్డు సృష్టించింది. ఆ తర్వాత వరల్డ్ జిమ్నాస్ట్ చాంపియన్‌షిప్‌కు కూడా దీపా కర్మకార్ అర్హత సాధించింది. -
చరిత్ర సృష్టించిన దీపా కర్మకార్
న్యూఢిల్లీ: భారత జిమ్నాస్ట్ దీపా కర్మకార్ చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది బ్రెజిల్లో జరిగే రియో ఒలింపిక్స్‌కు ఆమె అర్హత సాధించింది. తద్వారా ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా దీప రికార్డు నెలకొల్పింది. త్రిపురకు చెందిన 22 ఏళ్ల దీప జిమ్నాస్టిక్స్‌లో అద్భుతాలు చేస్తోంది. కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్‌గా ఆమె ఇదివరకే రికార్డు సృష్టించింది. 2014 గ్లాస్గో గేమ్స్‌లో కాంస్య పతకం గెలిచింది. ఆ తర్వాత వరల్డ్ జిమ్నాస్ట్ చాంపియన్‌షిప్‌కు కూడా అర్హత సాధించింది. -
ఢిల్లీలో ఆశీష్.. గ్లాస్గోలో దీప సంచలనం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఎక్కువగా పతకాలు గెలిచే క్రీడాంశాల్లో షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బాక్సింగ్ ముఖ్యమైనవి. అథ్లెటిక్స్‌లో ఆశించిన స్థాయిలో పతకాలు రావడం లేదు. ఇక జిమ్నాస్టిక్స్‌లో అయితే ఇంతకుముందు భారత క్రీడాకారులు ఫైనల్స్ దాకా పోవడమే గొప్ప. అయితే జిమ్నాస్టిక్స్లోనూ భారత్ శకం ఆరంభమైంది. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత జిమ్నాస్ట్ ఆశీష్ కుమార్, తాజా గ్లాస్గో ఈవెంట్లో దీపా కర్మాకర్ చరిత్ర సృష్టించారు. కామన్వెల్త్ గేమ్స్ జిమ్నాస్టిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా ఆశీష్, తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా దీప రికార్డు నెలకొల్పారు. ఆశీష్ రజత, కాంస్య పతకాలు.. దీప కాంస్య పతకం గెల్చుకుని జిమ్నాస్టిక్స్ పతకాలు గెలిచే సత్తా భారత్‌కు ఉందని నిరూపించారు. ఇది శుభ పరిణామం. గ్లాస్గోలో దీప మహిళల వాల్ట్ విభాగంలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం గెలిచిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా రికార్డులకెక్కింది. గురువారం జరిగిన ఫైనల్లో తొలి వాల్ట్‌లో 13,633 పాయింట్లు సాధించిన దీప... రెండో వాల్ట్‌లో అందరికంటే ఎక్కువగా 15,100 పాయింట్లు నమోదు చేసింది. అయితే ఓవరాల్ పాయింట్లలో (14,366) వెనుకబడి మూడో స్థానంతో సంతృప్తి పడింది. అయితే పురుషుల ఫ్లోర్ ఫైనల్లో ఆశిష్ కుమార్ నిరాశపర్చాడు. 13,800 పాయింట్లతో ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు.