దీపా.. నువ్‌ సూపర్‌.. ! | Dipa Karmakar rules twitter space after she vaults into Rio 2016 final | Sakshi
Sakshi News home page

దీపా.. నువ్‌ సూపర్‌.. !

Published Mon, Aug 8 2016 6:53 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

దీపా.. నువ్‌ సూపర్‌.. !

దీపా.. నువ్‌ సూపర్‌.. !

భారత జిమ్మాస్ట్‌ దీపా కర్మాకర్ తన అద్భుతమైన ప్రదర్శనతో రియో ఒలింపిక్స్‌ ఫైనల్‌లో బెర్తు సాధించడమే కాదు.. ఇటు దేశ ప్రజల హృదయాలనూ గెలుచుకుంది.

భారత జిమ్మాస్ట్‌ దీపా కర్మాకర్ తన అద్భుతమైన ప్రదర్శనతో రియో ఒలింపిక్స్‌ ఫైనల్‌లో బెర్తు సాధించడమే కాదు.. ఇటు దేశ ప్రజల హృదయాలనూ గెలుచుకుంది. అత్యంత క్లిష్టమైన వ్యక్తిగత వాల్ట్‌ విభాగంలో గెలిచి.. నిలిచి ఫైనల్‌కు చేరిన దీప సరికొత్త చరిత్ర లిఖించింది.

భారత్ నుంచి ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి మహిళా జిమ్నాస్ట్గా ఇప్పటికే రికార్డు సృష్టించిన దీప  సంచనాలు కొనసాగిస్తూ.. ఫైనల్‌లోనూ అడుగుపెట్టింది. ఆమె అపూర్వమైన రికార్డును కొనియాడుతూ ట్విట్టర్‌లో దేశవాసులు అభినందనలు తెలిపారు. భారతీయుల ఆశలను నిలబెడుతూ ఫైనల్‌లోనూ అద్భుతంగా రాణించి పతకం సాధించాలని, దేశం గర్వపడేలా మరింత ఉన్నత శిఖరాలను ఆమె అధిరోహించాలని పలువురు నెటిజన్లు ఆకాంక్షించారు.

బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ మొదలు.. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, కేంద్రమంత్రులు రవిశంకర్‌ ప్రసాద్‌, విజయ్‌ గోయల్‌, బాక్సర్‌ విజిందర్‌ సహా పలువురు నెటిజన్లు దీపా కర్మాకర్‌కు అభినందనలు తెలిపారు. ఒలింపిక్స్‌ వేదికపై భారతీయుల ఆకాంక్షలను నిలబెట్టాలని కోరారు. మరోవైపు దీపా కర్మాకర్‌ వాల్ట్ విన్యాసాలను లైవ్‌ ప్రసారంలో చానెల్‌లో చూపకపోవడంపై అమితాబ్ సహా పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement