rio 2016
-
గ్రేట్ దీపా.. దేశం నిన్ను చూసి గర్విస్తోంది!
-
గ్రేట్ దీపా.. దేశం నిన్ను చూసి గర్విస్తోంది!
రియో డి జెనీరో: యావత్ దేశం గతరాత్రి టీవీతెరకు కళ్లప్పగించింది. దీపా కర్మాకర్ ప్రమాదకరమైన విన్యాసం ప్రోడునోవా చేస్తుంటే.. గుండె చిక్కబట్టుకొని చూసింది. దీప అద్భుతమైన విన్యాసాలు చూసి చప్పట్లు కొట్టింది. అంతలోనే నిరాశ.. దీప ఎంత శాయశక్తులా కృషిచేసినా అదృష్టం కలిసిరాలేదు. తృటిలో ఒలింపిక్స్ పతకం చేజారింది. పతకం తేకపోయినా.. దీప మాత్రం దేశప్రజల హృదయాలను గెలుచుకుంది. ఒలింపిక్స్ వాల్ట్ విభాగంలో నాలుగోస్థానంలో నిలిచిన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఒలింపిక్స్ లో పాల్గొంటున్న తొలి భారత జిమ్నాస్ట్ గా ఇప్పటికే రికార్డు సృష్టించిన దీప.. తొలిప్రయత్నంలోనే ఫైనల్ కు చేరి దేశప్రజల్లో పతకంపై ఆశలు రేపింది. తుదివరకు అసమానమైన క్రీడాపటిమ కనబర్చిన దీపా కర్మాకర్ పతకాన్ని సాధించకున్నా.. భవిష్యత్తులో గొప్ప జిమాస్ట్ గా ఎదిగి దేశానికి ఎన్నో కీర్తి ప్రతిష్టలు తెస్తాననే ఆశాభావం కలిగించింది. ఆమె అసమాన పోరాటపటిమపై ట్విట్టర్ లో ప్రశంసల జల్లు కురుస్తోంది. దీపా కర్మాకర్ నిజమైన హీరో అని, అద్భుతమైన పోరాటపటిమను చూపిన ఆమెను చూసి దేశం గర్విస్తోందని నెటిజనులు హర్షం వ్యక్తం చేశారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, షూటర్ అభినవ్ బింద్రా, వీరేంద్ర సెహ్వాగ్, హర్ష బోగ్లే, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, రాజకీయ నాయకుడు అజయ్ మాకెన్ తోపాటు పలువురు నెటిజన్లు దీప క్రీడాప్రతిభను కొనియాడుతూ పెద్ద ఎత్తున ట్వీట్లు చేశారు. -
దీపా.. నువ్ సూపర్.. !
భారత జిమ్మాస్ట్ దీపా కర్మాకర్ తన అద్భుతమైన ప్రదర్శనతో రియో ఒలింపిక్స్ ఫైనల్లో బెర్తు సాధించడమే కాదు.. ఇటు దేశ ప్రజల హృదయాలనూ గెలుచుకుంది. అత్యంత క్లిష్టమైన వ్యక్తిగత వాల్ట్ విభాగంలో గెలిచి.. నిలిచి ఫైనల్‌కు చేరిన దీప సరికొత్త చరిత్ర లిఖించింది. భారత్ నుంచి ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి మహిళా జిమ్నాస్ట్‌గా ఇప్పటికే రికార్డు సృష్టించిన దీప సంచనాలు కొనసాగిస్తూ.. ఫైనల్లోనూ అడుగుపెట్టింది. ఆమె అపూర్వమైన రికార్డును కొనియాడుతూ ట్విట్టర్లో దేశవాసులు అభినందనలు తెలిపారు. భారతీయుల ఆశలను నిలబెడుతూ ఫైనల్లోనూ అద్భుతంగా రాణించి పతకం సాధించాలని, దేశం గర్వపడేలా మరింత ఉన్నత శిఖరాలను ఆమె అధిరోహించాలని పలువురు నెటిజన్లు ఆకాంక్షించారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మొదలు.. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, విజయ్ గోయల్, బాక్సర్ విజిందర్ సహా పలువురు నెటిజన్లు దీపా కర్మాకర్‌కు అభినందనలు తెలిపారు. ఒలింపిక్స్ వేదికపై భారతీయుల ఆకాంక్షలను నిలబెట్టాలని కోరారు. మరోవైపు దీపా కర్మాకర్ వాల్ట్ విన్యాసాలను లైవ్ ప్రసారంలో చానెల్లో చూపకపోవడంపై అమితాబ్ సహా పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. #Rio2016 Congratulations #DipaKarmakar on making history in #ArtisticGymnastics .Good luck for finals. #GoForGold pic.twitter.com/6f56jaXnrc — Sudarsan Pattnaik (@sudarsansand) August 8, 2016 And #DipaKarmakar vaults into finals. First Indian woman to achieve this... May the medal be your bday gift tmrw. pic.twitter.com/PnfAhrp6UK — Naveen Jindal (@MPNaveenJindal) August 8, 2016 -
రియో 2016..
-
అథ్లెట్లకు 4,50,000 కండోమ్ లు ఇస్తారట!
రియో (బ్రెజిల్): ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించనున్న రియో ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో లో ఏకంగా 4,50,000 కండోమ్ లను అందుబాటులో ఉంచనున్నట్టు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) తెలిపింది. 2012 నాటి లండన్ ఒలింపిక్స్ కంటే ఇప్పుడు మూడు రెట్లు అధిక కండోమ్ లను అందుబాటులో ఉంచనున్నట్టు వెల్లడించింది. మొదటిసారిగా 1,00,000 మహిళా కండోమ్ లను అందుబాటు లో ఉంచనున్నట్టు తెలిపింది. ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొననున్న 10,500 మంది క్రీడాకారుల సురక్షిత శృంగారం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐఓసీ పేర్కొంది. జికా వైరస్ దోమల ద్వారా కాకుండా అరక్షిత శృంగారం వల్ల కూడా వ్యాపించే అవకాశం ఉందని అందుకోసమే కండోమ్‌ల సరఫరాను పెంచినట్టు వెల్లడించింది. ఆగస్టు 5న ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. జులై 24 నుంచే రియో ఒలంపిక్ క్రీడా గ్రామానికి చేరుకునే క్రీడాకారులకు కండోమ్ లను అందుబాటులో ఉంచనున్నట్టు ఐఓసీ వెల్లడించింది. 2000 నాటి సిడ్నీ ఒలింపిక్స్ లో లక్ష నుంచి లక్షన్నర కండోమ్ లను అందుబాటులో ఉంచారు. జికా వైరస్ నిరోధానికి కండోమ్ ల పంపిణీకి ఎటువంటి సంబంధం లేదని, అయినా పెద్దమొత్తంలో ఎందుకు పంపిణీ చేస్తున్నారని బ్రెజిల్ పత్రికలు విమర్శిస్తున్నాయి. -
మరో స్టార్ ప్లేయర్‌కూ చాన్స్!
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో భారత క్రీడాబృందానికి స్ఫూర్తినిచ్చేందుకు గుడ్‌విల్ అంబాసిండర్‌గా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను నియమించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) స్పందించింది. సల్మాన్‌ను గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎందుకు నియమించామో తమ వైఖరిపై వివరణ ఇచ్చింది. ఈ నియామకంలో ఎలాంటి డబ్బు ప్రస్తావన లేదని, ఒలింపిక్ క్రీడలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఆయనను అంబాసిడర్‌గా నియమించినట్టు తెలిపింది. బాలీవుడ్ అగ్ర నటుల్లో ఒకరైన సల్మాన్‌ను నియమించడం వల్ల ఒలింపిక్ క్రీడల ప్రాధాన్యం దేశమంతటా తెలిసే అవకాశముందని, తద్వారా దేశంలోనూ ఈ విశ్వక్రీడలు పాపులర్ అయ్యే అవకాశముందని ఐవోఏ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. క్రీడా, కళల రంగాలకు చెందిన మరింత ప్రముఖులను గుడ్‌విల్ అంబాసిడర్లుగా నియమించే అవకాశముందని స్పష్టం చేసింది. క్రీడారంగాల్లో అంతర్జాతీయంగా సత్తా చాటిన పీటీ ఉషా, అంజు బాబీ జార్జ్‌లను కూడా అంబాసిడర్లుగా నియమించవచ్చునని ఐవోఏ సెక్రటరీ రాజీవ్ మెహతా తెలిపారు. ఒలింపిక్స్‌లో భారతకు పతకాన్ని అందించిన పీటీ ఉషాను కూడా గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించే అవకాశాలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. -
రెండు రోజుల్లో రెండు లక్షలకు పైగా టికెట్లు..
రియో డి జనీరియో: ఈ ఏడాది ఆగస్టులో ఆరంభంకానున్న రియో ఒలింపిక్స్ కు అప్పుడే టికెట్ల కోలాహలం మొదలైంది. కేవలం బ్రెజిల్ వాసులకు మాత్రమే వెబ్ సైట్ లో ఉంచిన రియో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడై పోతున్నాయి. టికెట్లను అందుబాటులోకి తెచ్చిన రెండు రోజుల్లోనే రెండు లక్షలకు పైగా కొనుగోలు జరిగింది. అధికశాతం మంది బాస్కెట్ బాల్, వాలీ బాల్, బీచ్ వాలీ బాల్, టెన్నిస్, జూడో, ఆరంభ-ముగింపు కార్యక్రమాలు, అథ్లెటిక్స్, స్మిమ్మింగ్, హ్యాండ్ బాల్ ఆటలను వీక్షించేందుకు టికెట్లను కొనుగోలు చేశారు. దాదాపు ఒక నిమిషంలో మూడు వేలకు పైగా టికెట్లు కొనుగోలు జరిగినట్లు తెలుస్తోంది. -
రియో ఒలింపిక్స్ లో సానియాతో జోడీకి ఓకే!
చెన్నై: ఈ ఏడాది ఆగస్టులో జరుగనున్నరియో ఒలింపిక్స్ క్రీడలకు ఆటగాళ్ల ఎంపికలో రాజకీయాలకు తావుండరాదని భారత టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా ఎంపిక వివాదాలను ఈసారి సృష్టించకూడదని, మెన్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో తనతో జట్టు కట్టడానికి రోహన్ బోపన్న, సానియా మీర్జా అర్హులని ఆయన పేర్కొన్నారు. 2012 లండన్ ఒలింపిక్స్ లో పేస్ తో జతకట్టి ఆడటానికి బోపన్న, మహేశ్ భూపతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఆనాటి ఘటనను గుర్తుచేసుకున్న పేస్ అప్పట్లో చెత్త రాజకీయాలకు పాల్పడ్డారని, ఈసారి అలా జరుగకూడదని అన్నారు. 'డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ కు సంబందించిన ఆనాటి ఘటన పునరావృతం కాబోదని ఆశిస్తున్నా. ప్రతిభ ఆధారంగానే సెలక్షన్ జరుగాలి. 2015లో నేను మూడు మిక్స్డ్ డబుల్స్ గ్రాండ్ స్లామ్స్ గెలుపొందాను. కాబట్టి రియో ఒలింపిక్స్ కు వెళ్లే భారత మిక్స్డ్ డబుల్స్ బృందంలో నేను ముందంజలో ఉంటానని భావిస్తున్నాను' అని పేస్ చెప్పారు. చెన్నై ఓపెన్ లో పాల్గొనడం ద్వారా 2016లో తన ఆటను మొదలుపెట్టిన పేస్ ప్రధానంగా రియో ఒలింపిక్స్ పై దృష్టి పెట్టినట్టు తెలిపారు. రియో ఒలింపిక్స్ లో భారత తరఫున డబుల్స్ లో బోపన్నతో, మిక్స్డ్ డబుల్స్ లో సానియాతో జత కట్టాలని తాను భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. -
గాయాల నుండి కోలుకుంటున్న సింధు
-
రియో రమ్మంటోంది