ఈ ఏడాది ఆగస్టులో ఆరంభంకానున్న రియో ఒలింపిక్స్ కు అప్పుడే టికెట్ల కోలాహలం మొదలైంది.
రియో డి జనీరియో: ఈ ఏడాది ఆగస్టులో ఆరంభంకానున్న రియో ఒలింపిక్స్ కు అప్పుడే టికెట్ల కోలాహలం మొదలైంది. కేవలం బ్రెజిల్ వాసులకు మాత్రమే వెబ్ సైట్ లో ఉంచిన రియో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడై పోతున్నాయి. టికెట్లను అందుబాటులోకి తెచ్చిన రెండు రోజుల్లోనే రెండు లక్షలకు పైగా కొనుగోలు జరిగింది.
అధికశాతం మంది బాస్కెట్ బాల్, వాలీ బాల్, బీచ్ వాలీ బాల్, టెన్నిస్, జూడో, ఆరంభ-ముగింపు కార్యక్రమాలు, అథ్లెటిక్స్, స్మిమ్మింగ్, హ్యాండ్ బాల్ ఆటలను వీక్షించేందుకు టికెట్లను కొనుగోలు చేశారు. దాదాపు ఒక నిమిషంలో మూడు వేలకు పైగా టికెట్లు కొనుగోలు జరిగినట్లు తెలుస్తోంది.