యావత్ దేశం గతరాత్రి టీవీతెరకు కళ్లప్పగించింది. దీపా కర్మాకర్ ప్రమాదకరమైన విన్యాసం ప్రోడునోవా చేస్తుంటే.. గుండె చిక్కబట్టుకొని చూసింది. దీప అద్భుతమైన విన్యాసాలు చూసి చప్పట్లు కొట్టింది. అంతలోనే నిరాశ.. దీప ఎంత శాయశక్తులా కృషిచేసినా అదృష్టం కలిసిరాలేదు. తృటిలో ఒలింపిక్స్ పతకం చేజారింది. పతకం తేకపోయినా.. దీప మాత్రం దేశప్రజల హృదయాలను గెలుచుకుంది.