న్యూఢిల్లీ: ఆర్టిస్టిక్స్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్‌లో భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ సత్తా చాటింది. జర్మనీలోని కోట్బస్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో కాంస్య పతకాన్ని గెలుపొందింది. శనివారం జరిగిన వాల్ట్ ఈవెంట్ ఫైనల్లో 25 ఏళ్ల దీప 14.316 పాయింట్లు స్కోర్ చేసి మూడోస్థానంలో నిలిచింది. ఈ విభాగంలో రెబెకా ఆండ్రాడే (బ్రెజిల్) స్వర్ణం గెలుచుకోగా, జేడ్ కారీ (యూఎస్)కు రజతం లభించింది.
శుక్రవారం జరిగిన వాల్ట్ క్వాలిఫయింగ్ రౌండ్‌లో 14.100 పాయింట్లు సాధించి ఆరో స్థానంతో ఫైనల్‌కు చేరిన ఈ త్రిపుర అమ్మాయి తుదిపోరులో మెరుగ్గా రాణించి పతకాన్ని ఒడిసి పట్టింది. మరోవైపు వాల్ట్ ఫైనల్స్‌కు ముందు జరిగిన బ్యాలన్స్ బీమ్ ఈవెంట్ క్వాలిఫయర్స్‌లో దీపాకు నిరాశ ఎదురైంది. 11.066 (4.8+ 6.266) పాయింట్లు స్కోర్ చేసిన దీప 23వ స్థానంలో నిలిచింది.
దీపా కర్మాకర్‌కు కాంస్యం
Published Sun, Nov 25 2018 2:03 AM | Last Updated on Sun, Nov 25 2018 2:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment