బాకు (అజర్‌బైజాన్): భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్‌లో ఫైనల్ రౌండ్‌కు అర్హత సంపాదించింది. వాల్ట్ ఈవెంట్‌లో గురువారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్ బరిలోకి దిగిన భారత జిమ్నాస్ట్ మూడో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత పొందింది. 25 ఏళ్ల దీప రెండు క్వాలిఫయింగ్ రౌండ్లలో వరుసగా 14.466, 14.133 పాయింట్లు సాధించింది. మొత్తంమీద 14.299 సగటును నమోదు చేసి ఫైనల్ చేరింది.
అమెరికాకు చెందిన జేడ్ క్యారీ (14.70 పాయింట్లు), మెక్సికో మెరిక అలెక్సా మోరెనో (14.533 పాయింట్లు) వరుసగా తొలి రెండు స్థానాలు పొందారు. ఈ క్వాలిఫయింగ్‌లో టాప్–8 జిమ్నాస్ట్‌లు ఫైనల్ చేరతారు. రేపు (శనివారం) వాల్ట్ ఫైనల్ ఈవెంట్ జరగనుంది. రియో ఒలింపిక్స్‌లో భారత అమ్మాయి తృటిలో కాంస్యం చేజార్చుకొని నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. గత ఏడాది మోకాలి గాయం నుంచి కోలుకున్నాక బరిలోకి దిగిన ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ (జర్మనీ)లో దీప కాంస్యం గెలిచింది. గాయం వల్లే అంతకుముందు జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల ఫైనల్లో ఆమె పోటీపడలేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment