దీపా, జీతూలకు రాజీవ్‌ఖేల్త్న్ర!
దాదాపుగా ఖరారు
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం అందించే అత్యున్నత క్రీడా అవార్డు ‘రాజీవ్ ఖేల్త్న్ర’కు ఈ ఏడాది జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, షూటర్ జీతూరాయ్ పేర్లను ప్రతిపాదించారు. వీరిద్దరు ఒలింపిక్స్‌లో పతకం సాధించడంలో విఫలమైనా, ఇటీవలి ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్నారు. వాస్తవానికి ఖేల్త్న్ర అవార్డు కోసం పేర్లు ప్రతిపాదించేందుకు ఇప్పటికే గడువు ముగిసినా... రియోలో దీప ప్రదర్శన ఆమె పేరును చేర్చేలా చేసింది.
అటు జీతూ కూడా రెండేళ్లుగా నిలకడగా రాణిస్తున్నాడు. 12 మంది సభ్యుల కమిటీ కూడా వీరిద్దరి పేర్లను దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. ఒక వేళ ఒలింపిక్స్‌లో సింధు పతకం సాధిస్తే ఆమెను కూడా ఎంపిక చేసే అవకాశం ఉంది. మరో వైపు అర్జున అవార్డు కోసం అజింక్య రహానే, శివ థాపా, గుర్‌ప్రీత్, అపూర్వి చండీలా, సౌమ్యజిత్, వినేశ్ ఫోగట్ తదితరుల పేర్లను సంబంధిత సంఘాలు ప్రతిపాదించాయి.