భారత జిమ్నాస్టిక్స్ అథ్లెట్ దీపా కర్మాకర్ డోపింగ్ టెస్టులో ఫెయిల్ అయ్యింది. యాంటీ డోపింగ్ టెస్టులో ఫెయిల్ కావడంతో రెండేళ్ల నిషేధానికి గురయ్యే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ (ఎఫ్‌ఐజీ), జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (జీఎఫ్‌ఐ), నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (WADA) నిర్దేశించిన మార్గదర్శకాలను దీపా కర్మాకర్ అనుసరించడంలో ఫెయిల్ అయ్యిందని సమాచారం.
అయితే శాయ్(SAI) కానీ.. భారత జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ కానీ దీపా కర్మాకర్ నిషేధం గురించి అధికారిక ప్రకటన చేయలేదు. జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనే అథ్లెట్లు రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్‌టీపీ) కింద రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా రిజిస్టర్ అయిన ప్రతీ అథ్లెట్, ప్రతీ ఏడాది యాంటీ డోపింగ్ టెస్టు కోసం నమూనాలు సమర్పించాల్సి ఉంటుంది. సాంపిల్స్ సమర్పించకపోతే వారిపై ఏడాది నుంచి రెండేళ్ల వరకూ నిషేధం పడుతుంది.
ఇక 2016 రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన దీపా కర్మాకర్ తృటిలో పతకం మిస్ చేసుకున్న సంగతి తెలిసిందే. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం, 2015 ఏషియన్ ఛాంపియన్‌షిప్స్‌లో దీపా కర్మాకర్ రజతం సాధించింది. 2018 అర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్‌లో మెర్సిన్‌లో స్వర్ణం గెలిచిన ఆమె కొట్‌బస్‌లో రజతం సాధించింది. 2015లో అర్జున అవార్డుని పొందిన దీపా కర్మాకర్.. 2016లో ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment