indian gymnast
-
డోపింగ్ టెస్టులో ఫెయిల్.. స్టార్ అథ్లెట్‌పై రెండేళ్ల నిషేధం!
భారత జిమ్నాస్టిక్స్ అథ్లెట్ దీపా కర్మాకర్ డోపింగ్ టెస్టులో ఫెయిల్ అయ్యింది. యాంటీ డోపింగ్ టెస్టులో ఫెయిల్ కావడంతో రెండేళ్ల నిషేధానికి గురయ్యే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ (ఎఫ్ఐజీ), జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (జీఎఫ్ఐ), నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (WADA) నిర్దేశించిన మార్గదర్శకాలను దీపా కర్మాకర్ అనుసరించడంలో ఫెయిల్ అయ్యిందని సమాచారం. అయితే శాయ్(SAI) కానీ.. భారత జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ కానీ దీపా కర్మాకర్ నిషేధం గురించి అధికారిక ప్రకటన చేయలేదు. జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనే అథ్లెట్లు రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్టీపీ) కింద రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా రిజిస్టర్ అయిన ప్రతీ అథ్లెట్, ప్రతీ ఏడాది యాంటీ డోపింగ్ టెస్టు కోసం నమూనాలు సమర్పించాల్సి ఉంటుంది. సాంపిల్స్ సమర్పించకపోతే వారిపై ఏడాది నుంచి రెండేళ్ల వరకూ నిషేధం పడుతుంది. ఇక 2016 రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన దీపా కర్మాకర్ తృటిలో పతకం మిస్ చేసుకున్న సంగతి తెలిసిందే. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం, 2015 ఏషియన్ ఛాంపియన్‌షిప్స్‌లో దీపా కర్మాకర్ రజతం సాధించింది. 2018 అర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్‌లో మెర్సిన్‌లో స్వర్ణం గెలిచిన ఆమె కొట్బస్లో రజతం సాధించింది. 2015లో అర్జున అవార్డుని పొందిన దీపా కర్మాకర్.. 2016లో ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు సొంతం చేసుకుంది. -
ఇంటికి వెళ్లగానే దీపా కర్మాకర్ ఏం చేసింది?
రియో ఒలింపిక్స్‌లో పతకం కోసం శాయశక్తులా కృషి చేసి, వెంట్రుక వాసిలో అదృష్టాన్ని మిస్సయిన దీపా కర్మాకర్.. ఇంటికి రాగానే పుస్తకాలు తీసింది. ఇంటికి వచ్చిన మర్నాటి నుంచే ఆమెకు ఎంఏ పరీక్షలు ఉన్నాయి. త్రిపుర యూనివర్సిటీ డిస్టెన్స్ లెర్నింగ్ సెంటర్ ద్వారా ఆమె ఎంఏ రెండో సెమిస్టర్ పరీక్షలకు హాజరైంది. పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ తనకు త్వరలోనే వస్తుందని ఆమె గట్టి నమ్మకంతో చెప్పింది. ఒకవైపు క్రీడాంశాలపై అపారమైన ఆసక్తి చూపుతూనే, చదువు మీద కూడా ఇంత శ్రద్ధ పెట్టడం అద్భుతమని త్రిపుర యూనివర్సిటీ అధికారులు అంటున్నారు. సాధారణంగా క్రీడాకారులు చదువును పక్కన పెట్టేస్తారు. ఎప్పుడో వీలైనప్పుడు పరీక్షలు రాస్తారు. కానీ, దీప మాత్రం అలా కాకుండా అకుంఠిత దీక్షతో రియో నుంచి వచ్చిన మర్నాడే పరీక్షలకు హాజరైంది.. బాగా రాసింది కూడానట. పరీక్షలు తప్పించుకోడానికి వంకలు వెతికే పిల్లలు ఆమెను చూసి నేర్చుకోవాలని అధ్యాపకులు అంటున్ నారు. జిమ్నాస్టిక్స్ కోచింగ్, ప్రాక్టీసుకు చాలా సమయం పడుతుందని, అయినా దీప మాత్రం ఎప్పుడూ చదువును నిర్లక్ష్యం చేయలేదని ఆమె కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు. చివరకు రియోకు వెళ్లేటప్పుడు కూడా ఆమె పుస్తకాలు తీసుకెళ్లిందట. మధ్యలో ఖాళీ దొరికితే చదువుకుందామని అలా తీసుకెళ్లిందని ఆమె తల్లి గౌరి చెప్పారు. మన దేశంలో చదువా.. ఆటలా అని ఏదో ఒకటి ఎంచుకోమంటారని, కానీ రెండూ ఒకేసారి చేయొచ్చని దీపా కర్మాకర్ నిరూపించిందని ఆమెతో పాటు పరీక్షకు హాజరైన యువకుడు చెప్పాడు. -
'మా అమ్మ చాలా భయపడింది'
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ ఫైనల్లో తన స్కోరు పట్ల సంతోషంగా ఉన్నానని, కానీ నాలుగో స్థానంలో నిలవడం కొద్దిగా నిరుత్సాహానికి గురిచేసిందని భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ పేర్కొంది. టోక్యో 2020 ఒలింపిక్స్ లో పోడియంకు చేరడమే నా తదుపరి లక్ష్యమని చెప్పింది. జమ్నాస్టిక్స్ లో తన విన్యాసాలు చూడడానికి తన తల్లి భయపడిందని వెల్లడించింది. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన అభిమాన క్రీడాకారుడని తెలిపింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో శనివారం దీపా కర్మాకర్ ను ఘనంగా సన్మానించారు. తనకు అండగా నిలిచివారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపింది. జిమ్మాస్టిక్స్ లో తాను ఏదైతే సాధించిందంతా కోచ్ బిశ్వేశ్వర్ నంది ఘనత అని ప్రకటించింది. -
'అస్సలు ఊహించలేదు.. అయినా హ్యాపీ'
-
'అస్సలు ఊహించలేదు.. అయినా హ్యాపీ'
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ లో తాను 7 లేదా 8 స్థానాల్లో నిలుస్తానని అనుకున్నానని భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ తెలిపింది. 4వ స్థానం దక్కుతుందని అస్సలు ఊహించలేదని.. అయినా సంతోషంగానే ఉందని వ్యాఖ్యానించింది. శనివారం ఉదయం ఢిల్లీ చేరుకున్న ఆమెకు విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. అధికారులు, అభిమానులు ఆమెను ఘనంగా స్వాగతించారు. దీపా కర్మాకర్ ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నట్టు కోచ్ బిశ్వేశ్వర్ నంది తెలిపారు. ఆమెకు పతకం వస్తే మరింత ఆనందపడేవాడినని చెప్పారు. రియో ఒలింపిక్స్ తృటిలో దీపా కర్మాకర్ కు పతకం చేజారినా ఆమె ప్రదర్శనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. ఆమె పేరును దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ప్రతిపాదించారు. -
దీపా కర్మాకర్‌కు ఖేల్‌రత్న అవార్డు?
ఇప్పటివరకు జిమ్నాస్టిక్స్‌లో ఎక్కడా వినిపించని భారతదేశం పేరును తొలిసారి అంతర్జాతీయ యవనికపై గౌరవనీయమైన స్థానంలో నిలిపిన దీపా కర్మాకర్ పేరును ఖేల్‌రత్న అవార్డుకు ప్రతిపాదిస్తున్నారు. దేశంలో క్రీడారంగానికి సంబంధించి అత్యున్నత పురస్కారం అయిన ఖేల్‌రత్నతో ఈ త్రిపుర జిమ్నాస్టును సత్కరించాలని క్రీడాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. జిమ్నాస్టిక్స్ అంశంలో దీపకు కొద్దిలో కాంస్యపతకం తప్పింది. ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. దీపా కర్మాకర్‌తో పాటు షూటర్ జీతూరాయ్ కూడా ఖేల్ రత్నకు పోటీ పడుతున్నట్లు తెలిసింది. అలాగే దీపకు చిన్నతనంలో శిక్షణ ఇచ్చిన కోచ్ బిశ్వేశ్వర్ నందికి ద్రోణాచార్య అవార్డు దక్కే అవకాశం కనిపిస్తోంది. స్పాన్సర్ చేసేవాళ్లు ఎవరూ లేకపోయినా, సదుపాయాలు శూన్యమైనా.. పేదరికాన్ని సైతం తోసిరాజని దీప తన నైపుణ్యాలను అద్భుతంగా ప్రదర్శించింది. ప్రధానంగా అత్యంత ప్రమాదకరమైన ప్రోదునోవా విభాగంలో ఆమె ప్రతిభ అద్భుతమని క్రీడా పండితులు అంటారు. 2010లో కామన్వెల్త్ గేమ్స్ జరిగినప్పుడు జిమ్నోవా అనే సంస్థ ఆమెకు జిమ్నాస్టిక్స్ దుస్తులు ఇచ్చింది. గత మూడు నెలల క్రితం వరకు ఆమె అవే దుస్తులను ఉపయోగించిందంటే ఆమె ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేదో తెలుసుకోవచ్చు. అయితే.. ఏప్రిల్‌లో జరిగిన రియో టెస్ట్ ఈవెంట్లో ఆమె క్వాలిఫై కావడంతో ఒక్కసారిగా ఆమెకు గుర్తింపు వెల్లువెత్తింది. స్పాన్సర్లు కూడా ఆమెవెంట పడ్డారు. ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలోనే నిలిచినా, దీప భారతదేశానికి మంచి పేరు తీసుకొచ్చిందంటూ సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆమెను ప్రశంసించారు. దాంతో ఇప్పుడు ఆమె పేరును ఖేల్‌రత్న అవార్డుకు ప్రతిపాదించాలని భావిస్తున్నారు.