'అస్సలు ఊహించలేదు.. అయినా హ్యాపీ' | I never even thought of fourth place, Very happy: Dipa Karmakar | Sakshi
Sakshi News home page

'అస్సలు ఊహించలేదు.. అయినా హ్యాపీ'

Published Sat, Aug 20 2016 8:06 AM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

'అస్సలు ఊహించలేదు.. అయినా హ్యాపీ'

'అస్సలు ఊహించలేదు.. అయినా హ్యాపీ'

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ లో తాను 7 లేదా 8 స్థానాల్లో నిలుస్తానని అనుకున్నానని భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ తెలిపింది. 4వ స్థానం దక్కుతుందని అస్సలు ఊహించలేదని.. అయినా సంతోషంగానే ఉందని వ్యాఖ్యానించింది. శనివారం ఉదయం ఢిల్లీ చేరుకున్న ఆమెకు విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. అధికారులు, అభిమానులు ఆమెను ఘనంగా స్వాగతించారు.

దీపా కర్మాకర్ ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నట్టు కోచ్ బిశ్వేశ్వర్ నంది తెలిపారు. ఆమెకు పతకం వస్తే మరింత ఆనందపడేవాడినని చెప్పారు. రియో ఒలింపిక్స్ తృటిలో దీపా కర్మాకర్ కు పతకం చేజారినా ఆమె ప్రదర్శనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. ఆమె పేరును దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ప్రతిపాదించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement