Bisheshwar Nandi
-
'మా అమ్మ చాలా భయపడింది'
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ ఫైనల్లో తన స్కోరు పట్ల సంతోషంగా ఉన్నానని, కానీ నాలుగో స్థానంలో నిలవడం కొద్దిగా నిరుత్సాహానికి గురిచేసిందని భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ పేర్కొంది. టోక్యో 2020 ఒలింపిక్స్ లో పోడియంకు చేరడమే నా తదుపరి లక్ష్యమని చెప్పింది. జమ్నాస్టిక్స్ లో తన విన్యాసాలు చూడడానికి తన తల్లి భయపడిందని వెల్లడించింది. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన అభిమాన క్రీడాకారుడని తెలిపింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో శనివారం దీపా కర్మాకర్ ను ఘనంగా సన్మానించారు. తనకు అండగా నిలిచివారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపింది. జిమ్మాస్టిక్స్ లో తాను ఏదైతే సాధించిందంతా కోచ్ బిశ్వేశ్వర్ నంది ఘనత అని ప్రకటించింది. -
'అస్సలు ఊహించలేదు.. అయినా హ్యాపీ'
-
'అస్సలు ఊహించలేదు.. అయినా హ్యాపీ'
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ లో తాను 7 లేదా 8 స్థానాల్లో నిలుస్తానని అనుకున్నానని భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ తెలిపింది. 4వ స్థానం దక్కుతుందని అస్సలు ఊహించలేదని.. అయినా సంతోషంగానే ఉందని వ్యాఖ్యానించింది. శనివారం ఉదయం ఢిల్లీ చేరుకున్న ఆమెకు విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. అధికారులు, అభిమానులు ఆమెను ఘనంగా స్వాగతించారు. దీపా కర్మాకర్ ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నట్టు కోచ్ బిశ్వేశ్వర్ నంది తెలిపారు. ఆమెకు పతకం వస్తే మరింత ఆనందపడేవాడినని చెప్పారు. రియో ఒలింపిక్స్ తృటిలో దీపా కర్మాకర్ కు పతకం చేజారినా ఆమె ప్రదర్శనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. ఆమె పేరును దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ప్రతిపాదించారు.