ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటిలాగే ఈ రోజు కూడా మండే మోటివేషన్ పేరుతో తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో జిమ్నాస్ట్ 'దీపా కర్మాకర్' కథనాన్ని హైలెట్ చేస్తూ ట్వీట్ చేశారు.
ఏషియన్ సీనియర్ ఛాంపియన్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్ ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంది. కొంతకాలం క్రితం మోకాలికి గాయమైనప్పటికీ.. ఆటపైన ఉన్న మమకారమే ఆమెను ముందుకు నడిపించి విజయం సాధించేలా చేసాయి. ఆమె అలాగే ముందుకు దూసుకెళ్లాలని కోరుకుంటున్నా.. అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
ఆనంద్ మహీంద్రా ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆటపై ఉన్న మమకారం, దీపా కర్మాకర్ గెలుపు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిందని పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
And more #MondayMotivation
Just back in March, @DipaKarmakar was talking about her injury & the hurdles she had to cross. It was the love for the sport, she said, which keeps her going.
And yesterday she became the 1⃣st 🇮🇳 gymnast to win🥇at the prestigious Asian championship,… https://t.co/jMXzjp7G9P pic.twitter.com/l4OPrOMbaT— anand mahindra (@anandmahindra) May 27, 2024
Comments
Please login to add a commentAdd a comment