ఆమె హృదయాలను గెలుచుకుంది: సచిన్ | Dipa Karmakar Won the hearts of Indians: sachin | Sakshi
Sakshi News home page

ఆమె హృదయాలను గెలుచుకుంది: సచిన్

Published Mon, Aug 15 2016 9:49 PM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM

ఆమె హృదయాలను గెలుచుకుంది: సచిన్

ఆమె హృదయాలను గెలుచుకుంది: సచిన్

న్యూఢిల్లీ: ఒలింపిక్స్ లో అద్భుత ప్రతిభ ప్రదర్శించిన దీపా కర్మాకర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. దీపాను కీర్తించిన జాబితాలో తాజాగా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్  చేరారు. ఆటలో గెలుపోటములు సహజమని దీపా తన అద్భుత  ప్రదర్శనతో  కోట్లాది మంది భారతీయుల హృదయాలను గెలుచుకుందని, దేశం ఆమెను చూసి గర్విస్తోందని  సచిన్ ట్వీట్ చేశారు.

 భారత త్రివర్ణ పతాకాన్ని ప్రపంచంలో ముందుంచడానికి దీపా, ఆమె కోచ్ గొప్ప కృషి చేశారని మరో భారత క్రికెటర్ శిఖర్ ధవన్ కొనియాడారు. జిమ్నాస్టిక్ పోటీలో 0.150 పాయింట్ల తేడాతో దీపా నాల్గవ స్థానంలో నిలిచి తృటిలో కాంస్య పథకాన్ని కోల్పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement