ఆమె హృదయాలను గెలుచుకుంది: సచిన్
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ లో అద్భుత ప్రతిభ ప్రదర్శించిన దీపా కర్మాకర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. దీపాను కీర్తించిన జాబితాలో తాజాగా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చేరారు. ఆటలో గెలుపోటములు సహజమని దీపా తన అద్భుత ప్రదర్శనతో కోట్లాది మంది భారతీయుల హృదయాలను గెలుచుకుందని, దేశం ఆమెను చూసి గర్విస్తోందని సచిన్ ట్వీట్ చేశారు.
భారత త్రివర్ణ పతాకాన్ని ప్రపంచంలో ముందుంచడానికి దీపా, ఆమె కోచ్ గొప్ప కృషి చేశారని మరో భారత క్రికెటర్ శిఖర్ ధవన్ కొనియాడారు. జిమ్నాస్టిక్ పోటీలో 0.150 పాయింట్ల తేడాతో దీపా నాల్గవ స్థానంలో నిలిచి తృటిలో కాంస్య పథకాన్ని కోల్పోయింది.
Winning & losing is a part of sport.. You've won millions of hearts & the entire nation is proud of ur achievements. https://t.co/qSpiWFSp2K
— sachin tendulkar (@sachin_rt) 15 August 2016
Congratulations to you and your coaches @dipakarmakar for placing the tricolour at the forefront of world gymnastics. Proud #DipaKarmakar
— Shikhar Dhawan (@SDhawan25) 15 August 2016