![Can Not Say Anything About Dipa Karmakars Olympics Participation - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/30/Dipa.jpg.webp?itok=lvJkb7rf)
కోల్‌కతా: భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఇంకా మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని ఆమె కోచ్ బిశ్వేశ్వర్ నంది వెల్లడించారు. అయితే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడంపై ఇప్పుడే చెప్పలేనని అన్నారు. ‘దీపా పునరావాస కార్యక్రమం కొనసాగుతోంది. ఆమె ఎప్పుడు బరిలోకి దిగేది ఇప్పుడే చెప్పలేను. ఏదైనా డాక్టర్ సలహా మేరకే నడుచుకుంటాం. ఆమె పూర్తిగా కోలుకున్నాకే కసరత్తయినా... ఇంకేదైనా! లేదంటే లేదు. ఫిట్‌నెస్ సంతరించుకున్నాక మళ్లీ ఓసారి డాక్టర్‌కు చూపిస్తాం. సానుకూల సంకేతం వస్తే ఆ తర్వాత ఫిజియోతో కలిసి పునరాగమనంపై దృష్టిపెడతాం’ అని కోచ్ నంది వివరించారు. ఈ అక్టోబర్‌లో జర్మనీలో ప్రపంచ చాంపియన్‌షిప్ జరగనుంది. ఇది ఒలింపిక్స్‌కు క్వాలిఫయింగ్ ఈవెంట్ కావడంతో అప్పటి వరకైనా ఆమె కోలుకోవాలని కోచ్ ఆశిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment