ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది జూలై–ఆగస్టులలో టోక్యో ఒలింపిక్స్ నిర్వహించి తీరుతామని ఆతిథ్య దేశం పునరుద్ఘాటించింది. కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడు యోషిరో మోరీ మాట్లాడుతూ ‘ఎలాంటి పరిస్థితులెదురైనా... కరోనా మహమ్మారి ప్రభావం ఎలా వున్నా... మేమైతే మెగా ఈవెంట్ నిర్వహిస్తాం’ అని తమ ఉద్దేశాన్ని బలంగా చెప్పారు. ఒలింపిక్స్ జరుగుతాయా లేదా అన్న చర్చకు బదులు ఎలా నిర్వహించాలన్న చర్చే ఇకపై జరుగుతుందని... ముందుగా అనుకున్నట్లే మార్చి 25న టార్చ్ రిలే పునఃప్రారంభమవుతుందని ఆయన అన్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కూడా టోర్నీ నిర్వహణపైనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. గత ఏడాదే జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment