
జిమ్నాస్టిక్స్‌లో భారత కథ ముగిసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ బ్యాలెన్స్ బీమ్ ఫైనల్లో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో దీపా 12.500 పాయింట్లతో ఐదో స్థానానికి పరిమితమైంది. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్‌లో ఆమె 12.750 పాయింట్లతో ఫైనల్‌కు చేరింది.
చెన్ యైల్ (చైనా, 14.600 పాయింట్లు) స్వర్ణం దక్కించుకోగా... కిమ్ జాంగ్ (ఉత్తర కొరియా, 13.400), జాంగ్ జిన్ (చైనా, 13.325) వరుసగా రజత కాంస్యాలు దక్కించుకున్నారు. మహిళల టీమ్ విభాగంలో భారత జట్టు ఏడో స్థానంతో సరిపెట్టుకోగా... పురుషుల జట్టు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది.