చరిత్ర సృష్టించిన దీపా కర్మకార్ | Dipa Karmakar becomes the first Indian woman gymnast to qualify for an Olympics | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన దీపా కర్మకార్

Published Mon, Apr 18 2016 9:06 AM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM

చరిత్ర సృష్టించిన దీపా కర్మకార్ - Sakshi

చరిత్ర సృష్టించిన దీపా కర్మకార్

న్యూఢిల్లీ: భారత జిమ్నాస్ట్ దీపా కర్మకార్ చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది బ్రెజిల్లో జరిగే రియో ఒలింపిక్స్కు ఆమె అర్హత సాధించింది. తద్వారా ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్గా దీప రికార్డు నెలకొల్పింది.

త్రిపురకు చెందిన 22 ఏళ్ల దీప జిమ్నాస్టిక్స్లో అద్భుతాలు చేస్తోంది. కామన్వెల్త్ గేమ్స్లో పతకం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్గా ఆమె ఇదివరకే రికార్డు సృష్టించింది. 2014 గ్లాస్గో గేమ్స్లో కాంస్య పతకం గెలిచింది. ఆ తర్వాత వరల్డ్ జిమ్నాస్ట్ చాంపియన్షిప్కు కూడా అర్హత సాధించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement