![దీపకు ప్రధాని ప్రశంస](/styles/webp/s3/article_images/2017/09/3/41461093978_625x300.jpg.webp?itok=M86FnSbd)
దీపకు ప్రధాని ప్రశంస
కట్రా (జమ్మూ): మహిళల జిమ్నాస్టిక్ విభాగంలో భారత్ నుంచి తొలిసారిగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన దీపా కర్మాకర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ‘దీప భారత్ గర్వపడేలా చేసింది. ఒలింపిక్స్‌లో తొలిసారి భారత పుత్రిక జిమ్నాస్టిక్స్‌లో పాల్గొనబోతోంది. అకుంఠిత దీక్షతోనే తాను అనుకున్నది సాధించగలిగింది.
సౌకర్యాల లేమి ఆమె ప్రతిభను అడ్డుకోలేకపోయింది. జీవితంలో పైకి ఎదగాలంటే ఎవరైనా ఇలాంటి కృషి చేయాల్సిందే. ఎలాంటి సాకులు చూపకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి’ అని ప్రధాని సూచించారు. మరోవైపు ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే తన లక్ష్యమని దీప తెలిపింది.